STOCKS

News


జ్యోతి ల్యాబ్స్‌ను హోల్డ్‌ చేయవచ్చు: జియోజిత్‌

Saturday 27th October 2018
Markets_main1540624464.png-21534

ముంబై:- ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ జియోజిత్‌.. ఎఫ్‌ఎంసీజీ సంస్థ జ్యోతి ల్యాబొరేటరీస్ షేరును హోల్డ్‌ చేయవచ్చని సిఫార్సు చేసింది. దేశీయ ఎంఫ్‌సీజీ సంస్థగా పేరుగాంచిన జ్యోతి ల్యాబ్స్‌.. దోమల, క్రిమికీటకాల నిరోధకాలతో పాటు డిష్‌ వాషింగ్‌, ఫ్యాబ్రిక్‌, పర్సనల్‌ సంరక్షణ ఉత్పత్తులను తయారీ చేస్తుంది. ఇటీవలే కంపెనీ తమ ఉత్పత్తులపై ధరలు పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉండటం కంపెనీ షేరుకు కలిసొచ్చే అంశమని జియోజిత్‌ అంటోంది. కంపెనీ షేరుపై జియోజిత్‌ విశ్లేషణలు ఇలా ఉన్నాయి.
షేరు ప్రస్తుత ధర:- రూ.180
టార్గెట్‌ ధర:- రూ.198
రేటింగ్‌:- హోల్డ్‌ చేయవచ్చు
క్యూ2 ఫలితాలు:-
ఈ క్యూ2లో రూ.45.34 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ2లో సాధించిన రూ.42.29 కోట్ల నికరలాభంతో పోలిస్తే ఇది 7.21 శాతం అధికం. మొత్తం ఆదాయం గతేడాది ఇదే క్యూ2లో రూ.410.93 కోట్లను నమోదు చేయగా ఈ ఏడాది క్యూ2లో 432.36 కోట్లను సాధించింది. ఇటీవల కేరళలో సంభవించిన వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరిత్యాలు క్యూ2 ఫలితాలపై ప్రభావాన్ని చూపినట్లు కంపెనీ తెలిపింది. ఇప్పుడు పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందని, రానున్న క్యూ3 అత్యుత్తమ ఫలితాలను నమోదు చేస్తామని కంపెనీ విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.
ఆవిష్కరణలు:-
 జ్యోతి ల్యాబ్స్‌.. డిష్‌వాష్‌ విభాగంలో ‘‘ప్రిమిల్‌ ట్యామరిండ్‌’’, గృహోపకరణాల విభాగంలో ‘‘మాక్సో అగరబత్తి’’ వ్యక్తిగత సంరక్షణ విభాగంలో ‘‘మార్గో గ్లిజరిన్‌’’లను విడుదల చేసింది. కంపెనీ ఆవిష్కరించిన ఈ నూతన ఉత్పత్తులు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయని జియోజిత్‌ అంచనా వేస్తుంది. మార్కెట్లో తన ఉత్పత్తుల విక్రయాలను పెంచుకునేందుకు కంపెనీ నిరంతరం ప్రకటనలను, ప్రమోషన్లు విరివిరిగా ఉపయోగించుకుంటుంది.

View Pdf One (1540624310Jyothy Laboratories Ltd.jpg)

You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌ సిఫార్సులు..

Saturday 27th October 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ పలు స్టాక్స్‌పై వివిధ రకాల సిఫార్సులు చేసింది. అవేంటివో చూద్దాం..  మారుతీ సుజుకీ ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.8,252గా నిర్ణయించాం. మారుతీ క్యూ2లో అంచనాల కన్నా కొంచెం మంచి పనితీరు కనబర్చింది. ఇంధన ధరల పెరుగుదల, వరదలు, అధిక వడ్డీ రేట్ల, ఇన్సూరెన్స్‌ ‍వ్యయాల పెరుగుదల వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. ప్రస్తుత పండుగ సీజన్‌లో విక్రయాలు దాదాపు ఫ్లాట్‌గా

కేపీఐటీకి ‘బై’ రేటింగ్‌

Saturday 27th October 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ఐటీ కంపెనీ కేపీఐటీ టెక్నాలజీస్‌పై బై రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింంది. ఈ స్టాక్‌ టార్గెట్‌ ప్రైస్‌ను రూ.285గా నిర్ణయించింది. కంపెనీ క్యూ2 ఎర్నింగ్స్‌ ఆరోగ్యకరంగా ఉన్నాయని తెలిపింది. రెవెన్యూ అంచనాలకు అనుగుణంగా ఉంటే, లాభదాయకత అంచనాలను మించిందని పేర్కొంది. రానున్న కాలంలో మార్జిన్లు పెరిగే అవకాశముందని అంచనా వేసింది. కంపెనీ రెవెన్యూ గైడెన్స్‌ను స్థిరంగా కొనసాగించడం, ఈబీటా మార్జిన్‌ గైడెన్స్‌ పెంచడం

Most from this category