News


సిప్లాను కొనవచ్చు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌

Saturday 29th December 2018
Markets_main1546075359.png-23310

ఔషధ రంగ దిగ్గజం సిప్లా షేరును కొనవచ్చని ప్రముఖ బ్రోకరేజ్‌ సం‍స్థ కోటక్‌ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సూచిస్తుంది. ఇటీవల షేరు ధర బాగా పతమనమై, తక్కువ ధర వద్ద ట్రేడ్‌ అవుతోందని, ఈ అంశం షేరు కొనేవారికి మంచి అవకాశమని బ్రోకరేజ్‌ సంస్థ చెబుతుంది.  సిస్లా షేరుపై బ్రోకరేజ్‌ సంస్థ విశ్లేషణలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం

షేరు:- సిప్లా

రంగం:- ఔషధ రంగం
టార్గెట్‌ ధర:- రూ.605లు

ఉపోద్ఘాతం:-
సిప్లా షేరు ఈ సెప్టెంబర్‌ 18న నుంచి రూ.671లు 25శాతం క్షీణించింది. కన్‌సెన్సెస్‌ ఆదాయం 14శాతం తగ్గింది. అమెరికా ఇటీవల ఇరాన్‌పై ఆంక్షలు విధించడం, యెమెన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధం, టెండర్‌ వ్యాపారంలో ధరలు తగ్గుముఖం పట్టడం, యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఇంగ్రీడెయెంట్‌(ఏపీఐ)లో ద్రవ్యోల్బణం, కొన్ని ముఖ్యమైన యూనిట్లపై యూఎస్‌ఎఫ్‌డీఏ అభ్యంతరాలు తదితర సమస్యలు షేరుపై ప్రభావాన్ని చూపాయి. ఈ సమస్యల ప్రభావం మరో 2-3 త్రైమాసికాల వరకు కొనసాగవచ్చు.
                అమెరికా, ఇండియా, దక్షిణాఫ్రికాల్లో వ్యాపారం మరింత వృద్ధి చెంది 2020-21 ఆర్థిక సంవత్సరం నాటికి కంపెనీ ఆదాయం 14శాతం నుంచి 15శాతం, కంపౌండ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేటింగ్‌(సీఏజీఆర్‌) 10శాతం, ఎబిటా మార్జిన్‌ 18 నుంచి 20శాతం నమోదు చేస్తుందని కంపెనీ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. తర్వలో యూఎస్‌ మార్కెట్‌లో విడుదల చేసే​ ఇంజెక్షన్‌, ఇన్హెలర్ష్‌లు తమ ఆదాయంలో కీలకంగా మారనున్నట్లు కంపెనీ చెప్పుకొచ్చి‍ంది.
సానుకూలంశాలు:-
1. అమెరికా, ఇండియా మార్కెట్లలో వ్యయాన్ని నియంత్రించడటం, అన్ని విభాగాల్లో సామర్థ్య సమతులత్యను సాధించడంతో 2020-21 ఆర్థిక సంవత్సరం ఆదాయం 10శాతం, ఎబిటా మార్జిన్‌ 19-10శాతం పెరుగుతుందని కంపెనీ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది.
2. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి యూఎస్‌లో అమ్మకాలు 120-130 మిలిన్‌ డాలర్లను చేరుకుంటుంది. డ్రగ్‌ మేనేజ్‌మెంట్‌ థెరిపీ(డీటీఎం)వ్యాపారం రెండెంకెల వృద్ధిని సాధిస్తుంది. అంతేకాక అ‍మ్మకాలు ఈ ఏడాదిలో 180-200 మిలియన్‌ డాలర్ల అమ్మకాలను సాధిస్తుంది.
3. లైసెన్స్‌ ఉత్పత్తులు అమ్మకాలు, క్రోనిక్‌ థెరిపీ వ్యాపారం వృద్ధి అంశాలు దేశీయంగా వ్యాపార వృద్ధి 12-14శాతం పెరిగేందుకు సహకరిస్తాయి. ఇదే సమయంలో సౌతాఫ్రికా ప్రైవేట్‌ వ్యాపారం 14శాతం వృద్ధిని సాధించడంతో పాటు అక్కడి మార్కెట్‌ రేట్‌ 2నుంచి 3శాతం రెట్లు పెరుగుతుంది. మిర్రెన్‌ ఫార్మాను చేజిక్కించుకోవడంతో ఓటీసీ వ్యాపారం రెండెంకల వృద్ధిని సాధిస్తుంది.
సిప్లా ముందున్న సవాళ్లు:-
1.ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరతల కారణంగా ఇరాన్‌ యెమెన్‌లో అమ్మకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30నుంచి 40 మిలియన్‌ డాలర్ల అమ్మకాను. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 70 నుంచి 80 మిలియన్‌ డాలర్ల అమ్మకాలను కోల్పోనున్నట్లు విశ్లేషకులు అంచనావేస్తున్నారు
2.దక్షిణాప్రికాలో టెండర్‌ వ్యాపారం ధరల కోతను ఎదుర్కోంటుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో  ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు
3.సామర్థ్య సమతులత్య సాధించే క్రమంలో ఏర్పడే సరఫరా కొరత ఇబ్బందులు అ‍మ్మకాలపై ప్రభావాన్ని చూపాయి. దీంతో త్రైమాసిక విక్రయాల్లో దాదపు 1బిలియన్‌ డాలర్‌(రూ.వంద కోట్లు) తగ్గాయి.

(సిప్లా షేరుపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ మరింత విశ్లేషణకు కింద లింకులో చూడవచ్చు)

View Pdf One (1546075691Cipla_-_Update_-_Dec_18_-_HDFC_sec.pdf)

You may be interested

78 కౌంటర్లలో ఎంఎసీడీ పాజిటివ్‌ సిగ్నల్స్‌

Saturday 29th December 2018

గతవారం ముగింపు ప్రకారం 78 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా మారిన కంపెనీల్లో ఎన్‌సీసీ, జెట్‌ ఎయిర్‌వేస్‌, అదానీ పోర్ట్స్‌, జీఎస్‌ఎఫ్‌సీ, వొక్‌హార్ట్‌, గ్రాసిమ్‌, టెక్‌మహీంద్రా, టాటా ఎలాక్సి, మైండ్‌ట్రీ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో కొద్ది రోజుల నుంచి ట్రేడింగ్‌ పరిమాణం పెరుగుతూ, షేర్లు పెరగడం ట్రెండ్‌ పటిష్టతను

1280డాలర్ల పైన పసిడి ముగింపు

Saturday 29th December 2018

ప్రపంచమార్కెట్లో పసిడి ధర 6నెలల తర్వాత మొదటిసారి 1280డాలర్లపై ముగిసింది. ప్రపంచ ఆర్థిక మందగమన ఆందోళనలు, అమెరికా మార్కెట్ల ఒడిదుడుకుల ట్రేడింగ్‌, డాలర్‌ ఇండెక్స్‌ వారం రోజుల కనిష్టానికి పతనం... తదితర అంశాలు పసిడికి అండగా నిలిచాయి. ఒకానొకదశలో పసిడి ధర శుక్రవారం రాత్రి 1,284.55 డాలర్ల వద్ద తాజాగా ఆరునెలల గరిష్టాన్ని అందుకుంది. చివరకు రాత్రి అమెరికా మార్కెట్లో 2.20 డాలర్ల లాభంతో 1,283.30డాలర్ల వద్ద ముగిసింది. ఈ

Most from this category