News


సిమెంట్‌ షేర్లకు దూరంగా ఉండండి: కోటక్‌

Saturday 29th December 2018
Markets_main1546077223.png-23315

దేశవ్యాప్తంగా సిమెంట్‌ ధరలు దిగివస్తున్న నేపథ్యంలో అధిక వ్యాల్యూవేషన్‌ కలిగిన సిమెంట్‌రంగ షేర్లకు దూరంగా ఉండటమే మంచిదని కోటక్‌ సెక్యూరిటీ అభిప్రాయపడుతోంది. ప్రతి సిమెంట్‌ బస్తాపై ధర రూ.3ల మేరకు తగ్గుముఖం పట్టడంతో ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీల ఆదాయాలు 1శాతం నుంచి 3శాతం వరకు తగ్గవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తుంది. పెట్‌కోక్‌ వ్యయాల క్షీణత సిమెంట్‌ ధరలపై ఒత్తిడిని కలిగించినప్పటికీ.., వచ్చే త్రైమాసికంలో ధరలు, ఇంధన వ్యయాల మధ్య వ్యత్యాసంతో సిమెంట్‌ ధరలు 2శాతం మేర తగ్గుతాయని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తుంది. కంపెనీ ఆదాయలు సైతం మరో రెండేళ్ల పాటు ఓ మోస్తారు గానే ఉంటుంది. వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టినప్పట్టకి.., ఈ ప్రభావం నాలుగో త్రైమాసికంలో ప్రతిబింబిస్తుంది. కావున ఇప్పటికైతే సిమెంట్‌ షేర్లకు దూరంగా ఉండటం మంచిదని బ్రోకరేజ్‌ సంస్థ అంటుంది.

(సిమెంట్‌ షేర్లపై కోటక్‌ బ్రోకరేజ్‌ సంస్థ మరింత విశ్లేషణకు కింద లింకులో చూడవచ్చు)

View Pdf One (1546077339[Kotak] Construction Materials, December 24, 2018.pdf)

You may be interested

ఎఫ్‌పీఐలపై కోటక్‌ నివేదిక

Saturday 29th December 2018

నవంబర్‌ నెలలో వివిధ మార్కెట్లలోకి నిధుల ప్రవాహం ఇలా ఉంది... దేశీయంగా: చాలా నెలల తర్వాత భారత మార్కెట్లోకి ఎఫ్‌పీఐలు మరలా వచ్చాయి. నవంబర్‌లో లిస్టెడ్‌ ఫండ్స్‌లోకి 46.3 కోట్ల డాలర్లు, జీఈఎం ఫండ్స్‌లోకి 52.9 కోట్ల డాలర్లు వచ్చాయి.  వర్ధమాన దేశాల్లోకి: భారత్‌తో పాటు చైనా, సౌత్‌కొరియా మార్కెట్లలో విదేశీ నిధులు రాగా, రష్యా మార్కెట్లో నుంచి విదేశీ ఇన్వెస్టర్లు 10.6 కోట్ల డాలర్లను ఉపసంహరించుకున్నారు.  మరిన్ని వివరాలకు కింద ఇచ్చిన పీడీఎఫ్‌

సెల్లింగ్‌ సప్తపది

Saturday 29th December 2018

ఎప్పుడు అమ్మేయాలో తెలుకోండి స్టాక్‌ మార్కెట్లో విజయం సాధించాలంటే రెండు మౌలిక సూత్రాలు తప్పక తెలిసుండాలి. ఒకటి సరైన సమయంలో కొనడం, రెండు సరైన సమయంలో అమ్మడం. చాలామంది ఆచితూచి కొనుగోలు చేసినా ఎప్పుడు అమ్మాలో తెలియక బొక్కబోర్లాపడుతుంటారు. అందుకే మన వద్ద ఉన్న స్టాకులను ఎప్పుడు విక్రయించాలో తెలుసుకోవడం కీలకం. ఇందుకు నిపుణులు కొన్ని సంకేతాలను సూచిస్తున్నారు... 1. 20 శాతం లాభాలు: సాధారణంగా ఒక కీలక నిరోధాన్ని దాటిన తర్వాత

Most from this category