STOCKS

News


ఫైనాన్స్‌ స్టాక్స్‌పై సెంట్రమ్‌ ఏమంటోంది?

Saturday 17th November 2018
Markets_main1542442886.png-22143

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా పలు ఫైనాన్స్‌ రంగ షేర్లపై తన సిఫార్సులు తెలియజేసింది. అవేంటో చూద్దాం.. 

క్యాపిటల్‌ ఫస్ట్‌
ఈ స్టాక్‌ను హోల్డ్‌ చేయవచ్చు. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.546గా నిర్ణయించాం. 12 శాతం వరకు అప్‌సైడ్‌ ఉండొచ్చు. స్టాక్‌ ప్రస్తుత ధర రూ.494గా ఉంది. ప్రస్తుత క్యూ2లో క్యాపిటల్‌ ఫస్ట్‌ లోన్‌ బుక్‌ వార్షికంగా 42 శాతం వృద్ధితో రూ.32,622 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం, ప్రి-ప్రొవిజనింగ్‌ ప్రాఫిట్‌, నికర లాభంలో వరుసగా 54 శాతం, 48 శాతం, 245 శాతం వృద్ధి నమోదయ్యింది. అయితే అసెట్‌ క్వాలిటీ తగ్గింది. స్థూల ఎన్‌పీఏలు 1.94 శాతానికి పెరిగాయి. లోన్‌ బుక్‌లో బలమైన వృద్ధి, డైవర్సిఫైడ్‌ అసెట్స్‌, తక్కువ ఎన్‌పీఏల కారణంగా క్యాపిటల్‌ ఫస్ట్‌ను హోల్డ్‌ చేయవచ్చని సిఫార్సు చేస్తున్నాం. ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌తో విలీనం వల్ల కొన్ని ప్రతికూలతలు ఎదురు కావొచ్చు. రిటైల్‌ అన్‌సెక్యూర్డ్‌ లోన్స్‌ వల్ల స్లిపేజ్‌లు పెరగడం, పలు విభాగాల్లో తీవ్రమైన పోటీ, ఆర్థిక వృద్ధి నెమ్మదించడం, విలీన ప్రక్రియ వల్ల కార్యకలాపాలపై కొంత ‍ప్రతికూల ప్రభావం పడొచ్చనే అంచనాలు వంటివి రిస్క్‌ అంశాలు. 

భారత్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌
ఈ షేరును హోల్డ్‌ చేయవచ్చు. టార్గెట్‌ ప్రైస్‌ రూ.1,114. స్టాక్‌ ప్రస్తుత ధర రూ.925. దాదాపు 20 శాతం అప్‌సైడ్‌కు ఛాన్స్‌ ఉంది. ప్రస్తుత క్యూ2 కంపెనీ బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. నికర వడ్డీ ఆదాయం వార్షికంగా 40 శాతం వృద్ధి చెందింది. బలమైన రుణ వృద్ధి ఇందుకు కారణం. ఇతర ఆదాయం, ఫీజు ఆదాయం కూడా ఎక్కువగానే ఉంది. రుణ నాణ్యత నిలకడగా ఉంది. స్థూల ఎన్‌పీఏలు 0.4 శాతంగా, నికర ఎన్‌పీఏలు 0.1 శాతంగా ఉన్నాయి. బలహీనమైన మార్కెట్‌ కారణంగా స్టాక్‌ 23 శాతంమేర కరెక‌్షన్‌కు గురయ్యింది. స్టాక్‌పై పాజిటివ్‌గా ఉన్నాం. కొన్ని రాష్ట్రాలకే పరిమితం కావడం, పలు సామాజిక-రాజకీయ అంశాలు వంటివి రిస్క్‌ అంశాలు. 

చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌
ఈ స్టాక్‌కు ఔట్‌పర్ఫార్మ్‌ రేటింగ్‌ ఇచ్చింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,530గా నిర్ణయించింది. స్టాక్‌ ప్రస్తుత ధర రూ.1,255. చోళమండలం ప్రస్తుత క్యూ2లో బలమైన ఫలితాలను ప్రకటించింది. ఏయూఎంలో 31 శాతం వృద్ధి కనిపించింది. స్థూల ఎన్‌పీఏలు తగ్గాయి. నికర వడ్డీ ఆదాయం 14 శాతం, నికర లాభం 49 శాతం పెరిగాయి. రుణాల్లో 26 శాతం వృద్ధి నమోదయ్యింది. వ్యాపార వృద్ధి అంచనాల కన్నా తక్కువగా ఉండటం, ఎన్‌పీఏ రికవరీలో ఆలస్యం, వెహికల్‌ ఫైనాన్స్‌ నెమ్మదించడం వంటివి రిస్క్‌ అంశాలు. 

సంస్థల పనితీరుకు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌లపై క్లిక్‌ చేయండి...

View Pdf One (1542442964Centrum Wealth - Capital First Ltd- Q2FY19 Result Update - 12 November 2018.pdf)
View Pdf Two (2091722161Centrum Wealth - Bharat Financial Inclusion Ltd - Q2FY19 Result Update - 12 November 2018.pdf) View Pdf Three (49372570Centrum Wealth - Cholamandalam Investment & Finance Ltd - Q2FY19 Result Update - 6 November 2018.pdf)

You may be interested

ఎస్‌ఎంఎల్‌ ఇసుజుపై హెచ్‌డీఎఫ్‌సీ పాజిటివ్‌

Saturday 17th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ఎస్‌ఎంఎల్‌ ఇసుజుపై పాజిటివ్‌గా ఉంది. ఎందుకో చూద్దాం..  బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌: ఎస్‌ఎంఎల్‌ ఇసుజు రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.675 టార్గెట్‌ ప్రైస్‌: రూ.904 హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. ఎస్‌ఎంఎల్‌ ఇసుజుపై బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.904గా నిర్ణయించింది. కంపెనీ క్యూ2లో మిశ్రమ పనితీరు కనబర్చిందని పేర్కొంది. రెవెన్యూ వార్షికంగా 30 శాతం మేర పెరిగిందని తెలిపింది. విక్రయాలు 28

ఎన్‌బీఎఫ్‌సీలు/బ్యాంక్స్‌ ఔట్‌లుక్‌ ఎలా ఉండొచ్చు?

Saturday 17th November 2018

బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల ఔట్‌లుక్‌ చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తోందని కోటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తెలిపింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన చూస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బ్యాంకులు స్వల్ప లాభాలను నమోదు చేశాయని పేర్కొంది. ఇన్వెస్ట్‌మెంట్లకు, ఎన్‌పీఏలకు అధిక కేటాయింపులు ఇందుకు కారణమని తెలిపింది. స్లిపేజ్‌లు తగ్గడం సానుకూల అంశమని పేర్కొంది. అందువల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో బ్యాంకులు పనితీరు మరింత మెరుగుపడొచ్చని అంచనా వేసింది. కార్పొరేట్‌

Most from this category