STOCKS

News


లాంగ్‌టర్మ్‌ ఔట్‌పర్ఫార్మర్‌: సియారామ్‌ సిల్క్‌

Saturday 1st September 2018
Markets_main1535793646.png-19878

బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా సియారామ్‌ సిల్క్‌ మిల్స్‌పై బుల్లిష్‌గా ఉంది. ఎందుకో చూద్దాం..

బ్రోకరేజ్‌: సెంట్రమ్‌
స్టాక్‌: సియారామ్‌ సిల్క్‌ మిల్స్‌
రేటింగ్‌: లాంగ్‌టర్మ్‌ ఔట్‌పర్ఫార్మర్‌
ప్రస్తుత ధర: రూ.557
టార్గెట్‌ ప్రైస్‌: రూ.674
రిటర్న్‌ అంచనా: 21 శాతం
బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా సియారామ్‌ సిల్క్‌ మిల్స్‌పై పాజిటివ్‌గా ఉంది. దీర్ఘకాలానికి స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఔట్‌పర్ఫార్మర్‌ రేటింగ్‌ను ఇచ్చింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.674గా నిర్ణయించింది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో చెప్పుకోదగ్గ ఫలితాలనేమీ ప్రకటించలేదని పేర్కొంది. రెవెన్యూ వార్షికంగా 0.5 శాతం క్షీణతతో రూ.322 కోట్లకు తగ్గిందని, కన్సూమర్‌ డిమాండ్‌ ఊహించిన స్థాయిలో పుంజుకోలేదనే విషయాన్ని ఇది స్పష్టం చేస్తోందని తెలిపింది. ఇక ఈబీటా, మార్జిన్లు పెరిగాయని పేర్కొంది. ముడి పదార్ధాల ధరలు తక్కువగా ఉండటం, ఇతర వ్యయాలు తగ్గడం కలిసొచ్చిందని తెలిపింది. అయితే ఎంప్లాయీ వ్యయాలు పెరిగాయని పేర్కొంది. అధిక ఇన్వెంటరీ వ్యయాలు, ముడి పదార్ధాల ధరల్లో ఒదిదుడుకులు, జీఎస్‌టీ ప్రతికూలతలు.. వర్కింగ్‌ క్యాపిటల్‌ పెరుగుదల, డెట్‌-టు-ఈక్విటీ రేషియో వంటి అంశాల్లో ప్రతిఫలిస్తున్నాయని వివరించింది. ప్రస్తుత క్యూ1లో కన్సూమర్‌ డిమాండ్‌ స్తబ్దుగా ఉందని, ఇది తాత్కాలిక అంశమని, దీర్ఘకాలంలో సియారామ్‌ సిల్క్‌ మంచి పనితీరు కనబరుస్తుందని పేర్కొంది. ప్రస్తుత డెట్‌, వర్కింగ్‌ క్యాపిటల్‌ వంటి అంశాలు రికవరీని సూచిస్తున్నాయని తెలిపింది. అధిక మార్జిన్లను అందించే రెడీమేడ్‌ గార్మెంట్‌ విభాగం, కన్సూమర్‌ డిమాండ్‌ పుంజుకోవడం అనే అంశాలను నిశితంగా గమనించాల్సి ఉందని పేర్కొంది. ఉత్పత్తి ‍వ్యయాల పెరుగుదల వల్ల లాభదాయకతపై ప్రతికూల ప్రభావం పడటం, కన్సూమర్‌ డిమాండ్‌లో రికవరీ నెమ్మదిగా ఉండటం వంటివి రిస్క్‌ అంశాలని తెలిపింది. 

కంపెనీ వివరాలు, పనితీరు సంబంధిత ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1535793657Siyaram Silk Mills.pdf)

You may be interested

5వ నెల పతనమే..!

Saturday 1st September 2018

ప్రపంచమార్కెట్లో పసిడి ధర వరుసగా 5వ నెలలో పతనమైంది. గత శుక్రవారంతో ముగిసిన ఆగస్ట్‌ నెలలో ఔన్స్‌ పసిడి 2.2శాతం మేర నష్టపోయింది. 2013 తరువాత పసిడి వరుసగా 5వనెలలో నష్టపోవడం ఇదే తొలిసారి. ఈ ఆగస్ట్‌లో డాలర్‌ ఇండెక్స్‌ ఏడాదిన్నర గరిష్టానికి చేరుకోవడం, టర్కీ సంక్షోభం, ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు భయాలు పసిడి పతనానికి కారణమయ్యాయి. ఈ ప్రతికూలాంశాల నేపథ్యంలో ఆగస్ట్‌ 16న నాటికి అంతర్జాతీయ మార్కెట్లో

ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌ టార్గెట్‌.. 145

Saturday 1st September 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: కోటక్‌ సెక్యూరిటీస్‌ స్టాక్‌: ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.118 టార్గెట్‌ ప్రైస్‌: రూ.145 బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌.. ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌పై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.145గా నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరంలో బలహీనమైన పనితీరు కనబర్చిన కంపెనీ కొత్త ఆర్థిక

Most from this category