STOCKS

News


ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌పై సెంట్రమ్‌ పాజిటివ్‌

Thursday 8th November 2018
Markets_main1541668632.png-21792

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ వెల్త్‌ రీసెర్చ్‌ తాజాగా ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌ స్టాక్‌పై పాజిటివ్‌గా ఉంది. ఎందుకో చూద్దాం..

బ్రోకరేజ్‌: సెంట్రమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌
స్టాక్‌: ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌
రేటింగ్‌: ఔట్‌ఫర్ఫార్మర్‌
ప్రస్తుత ధర: రూ.136
టార్గెట్‌ ప్రైస్‌: రూ.175
అప్‌సైడ్‌ అంచనా: 30 శాతం

సెంట్రమ్‌.. ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌పై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఔట్‌పర్ఫార్మర్‌ రేటింగ్‌ ఇచ్చింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.175గా నిర్ణయించింది. అంటే ప్రస్తుత ధరతో పోలిస్తే దాదాపు 30 శాతం పెరుగుదల ఉండొచ్చని అంచనా వేస్తోంది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) మంచి ఫలితాలను ప్రకటించిందని పేర్కొంది. జూలై చివరి నుంచి చూస్తే ఈ స్టాక్‌ దాదాపు 23 శాతం కరెక‌్షన్‌కు గురయ్యిందని తెలిపింది. కంపెనీ ఎన్‌పీఏలు పెరగొచ్చనే ఆందోళనలు ఇందుకు కారణమని పేర్కొంది. అయితే కంపెనీ ఈ విషయమై స్పష్టతనిచ్చిందని తెలిపింది. లోన్‌ బుక్‌ వృద్ధి సానుకూల అంశమని పేర్కొంది. పెద్ద కంపెనీలు/హౌసింగ్‌ అకౌంట్లలోని స్లిపేజ్‌లు, ప్రధాన వ్యాపారం నెమ్మదించడం, పలు కీలక విభాగాల్లో పోటీ పెరుగుదల వంటివి రిస్క్‌ అంశాలని తెలిపింది.

కంపెనీ పనితీరుకు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1541668646Centrum Wealth - L&T Finance Holdings Ltd- Q2FY19 Result Update - 1 November 2018.pdf)

You may be interested

నెలరోజుల కోసం టాప్‌ సిఫార్సులు

Thursday 8th November 2018

ముంబై: ఈవారంలో నిఫ్టీ ఇప్పటివరకు అధిక శాతం రేంజ్‌బౌండ్‌లోనే కొనసాగింది. 10,440 పాయింట్ల వద్ద కీలక మద్దతు ఉండగా.. ఈ స్థాయిని కోల్పోతే 10340, ఆ తరువాత 10260 అత్యంత కీలక స్థాయిలుగా ఉన్నాయని సాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్స్‌ హెడ్‌ ఆశిష్‌ చతుర్‌మెహతా విశ్లేషించారు. 10,600 స్థాయిని అధిగమించి, ఆ స్థాయి ఎగువన నిలబడగలిగినప్పుడే 10,750-10,850 రేంజ్‌కు చేరుకుంటుందని వ్యాఖ్యానించారు. నిఫ్టీ ఆప్షన్స్‌ విభాగంలో అత్యధిక

ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌పై ఆనంద్‌రాఠి బుల్లిష్‌

Thursday 8th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి స్టాక్‌: ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.187 టార్గెట్‌ ప్రైస్‌: రూ.239 ఆనంద్‌రాఠి.. ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌పై పాజిటివ్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. బై రేటింగ్‌ను కొనసాగించింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.239గా నిర్ణయించింది. కంపెనీ ప్రస్తుత

Most from this category