STOCKS

News


సెంట్రమ్‌ స్టాక్‌ సిఫార్సులు..

Friday 23rd November 2018
Markets_main1542954023.png-22343

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా మూడు స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. అవేంటో చూద్దాం.. 

ఎస్‌బీఐ
ఎస్‌బీఐపై బై రేటింగ్‌ కొనసాగిస్తున్నాం. టార్గెట్‌ ప్రైస్‌ రూ.350గా నిర్ణయించాం. బ్యాంక్‌ క్యూ2 ఫలితాలను గమనిస్తే పలు విభాగాల్లో సానుకూల వాతావరణం కనిపిస్తోంది. నిర్వహణ లాభం అంచనాలు మించింది. దేశీ మార్జిన్లు, రుణ వృద్ధి, స్లిపేజ్‌లు, అసెట్‌ రికవరీ, రిటర్న్‌ రేషియో వంటి అంశాలు మెరుగుదల నమోదయ్యింది. క్యాపిటల్‌ పొజిషన్‌ బలంగానే ఉంది. అనుబంధ బ్యాంకులు లాభాల్లో నడుస్తున్నాయి. వృద్ధి అంచనాలు బాగున్నాయి. బ్యాంక్‌ వ్యాపారాలు, నిర్వహణ పనితీరు బాగుండటం, అసెట్‌ క్వాలిటీ మెరుగుపడటం వంటి అంశాల కారణంగా ఎస్‌బీఐపై పాజిటివ్‌గా ఉన్నాం. రిస్క్‌ అంశానికి వస్తే.. మార్జిన్లపై ఒత్తిడి, రికవరీల్లో వేగం లేకపోవడం కారణంగా ఎర్నింగ్స్‌పై ప్రభావం పడొచ్చు.

ఓరియెంటల్‌ కార్బన్‌ అండ్‌ కెమికల్స్‌
ఓరియెటంట్‌ కార్బన్‌ అండ్‌ కెమికల్స్‌పై పాజిటివ్‌గా ఉన్నాం. బై రేటింగ్‌ను కొనసాగిస్తున్నాం. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,575గా నిర్ణయించాం. ప్రస్తుత క్యూ2లో కంపెనీ బలమైన పనితీరు కనబర్చింది. వార్షికంగా చూస్తే ఈబీటాలో 32 శాతం వృద్ధి, పీఏటీలో 42 శాతం వృద్ధి నమోదయ్యింది. డిమాండ్‌ ఔట్‌లుక్‌ బలంగా కనిపిస్తుండటం వల్ల స్టాక్‌పై బుల్లిష్‌గా ఉన్నాం. కార్యకలాపాల విస్తరణ మరొక సానుకూల అంశం. కంపెనీ ఇటీవలే మధ్యంతర డివిడెండ్‌, షేర్ల బైబ్యాక్‌ను కూడా ప్రకటించింది. సబ్సిడరీలు బలమైన టర్నోవర్‌ను సాధించొచ్చనే అంచనాలున్నాయి. తక్కువ విక్రయాలు, రూపాయి బలపడటం వంటివి ప్రతికూల అంశాలు. 

కేర్‌ రేటింగ్స్‌
క్రెడిట్‌ అనాలసిస్‌ అండ్‌ రీసెర్చ్‌ (కేర్‌ రేటింగ్స్‌)పై పాజిటివ్‌గా ఉన్నాం. బై రేటింగ్‌ కొనసాగిస్తున్నాం. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,550గా నిర్ణయించాం. ప్రస్తుత క్యూ2 ఎర్నింగ్స్‌ ఆకట్టుకోలేకపోయినా కూడా కంపెనీ బిజినెస్‌ మోడల్‌, రిటర్న్‌ రేషియో, ఫ్రీ క్యాష్‌ ఫ్లో ఈల్డ్‌ వంటి అంశాల కారణగా స్టాక్‌పై బుల్లిష్‌గా ఉన్నాం. కంపెనీ ఇటీవల తన రేటింగ్‌ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. వీటి ఫలితం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. మార్జిన్లపై ఒత్తిడి, బీఎల్‌ఆర్‌ విక్రయాలు తగ్గడం వంటివి రిస్క్‌ అంశాలు. 

బ్యాంక్‌/కంపెనీల పనితీరుకు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌లపై క్లిక్‌ చేయండి...

 

 

View Pdf One (1542954193State Bank of India - Q2FY19 Results Update - Centrum 05112018.pdf)
View Pdf Two (929718948Oriental Carbon & Chemicals - Q2FY19 Result Update - Centrum 05112018.pdf) View Pdf Three (1704739048CARE Ratings - Q2FY19 Results Update - Centrum 05112018.pdf)

You may be interested

మారుతీ సుజుకీ టార్గెట్‌ ఎంత?

Friday 23rd November 2018

 ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ జియోజిత్‌ తాజాగా మారుతీ సుజుకీ ఇండియాపై పాజిటివ్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: జియోజిత్‌ స్టాక్‌: మారుతీ సుజుకీ ఇండియా రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.7,411 టార్గెట్‌ ప్రైస్‌: రూ.8,419 రిటర్న్‌ అంచనా: 14 శాతం జియోజిత్‌.. దేశీ దిగ్గజ ప్యాసింజర్‌ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియాపై పాజిటివ్‌గానే ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.8,419గా నిర్ణయించింది. 14

నాట్కో​ ఫార్మాను కొనవచ్చు: జియోజిత్‌

Friday 23rd November 2018

ఫార్మారంగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న నాట్కోపార్మా కంపెనీ షేరుకు ప్రముఖ రేటింగ్‌ సంస్థ జియోజిత్‌ ‘‘బై’’ రేటింగ్‌ కేటాయించింది. కంపెనీకి చెందిన పలు అంశాలను కూలంకుషంగా పరిశీలించిన అనంతరం గతంలో తాము షేరుకు కేటాయించిన ‘‘హోల్డ్‌’’ రేటింగ్‌ను ‘‘బై’’ రేటింగ్‌కు సవరిస్తున్నట్లు జియోజిత్‌ చెప్పుకొచ్చింది. ఇప్పుడు నాట్కోషేరుపై రేటింగ్‌ సం‍స్థ విశ్లేషణలు ఎలా ఉన్నాయో చూద్దాం... రంగం:- ఫార్మారంగం రేటింగ్‌:- కొనొచ్చు విశ్లేషణ:- ఫార్మారంగంలో నూతన జనరిక్‌ ఆవిష్కరణలతో పాటు కాలానుగుణంగా ఔషధాలను అభివృద్ధి

Most from this category