STOCKS

News


ఈ స్టాక్స్‌పై సెంట్రమ్‌ బుల్లిష్‌

Wednesday 28th November 2018
Markets_main1543394957.png-22453

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా మూడు స్టాక్స్‌ను సిఫార్సు చేసింది. అవేంటో చూద్దాం.. 

టాటా స్టీల్‌
టాటా స్టీల్‌పై పాజిటివ్‌గా ఉన్నాం. బై రేటింగ్‌ ఇస్తున్నాం. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.790గా నిర్ణయిస్తున్నాం. దేశీయంగా బలమైన క్యాష్‌ ఫ్లో ఉండటం, కొనుగోళ్లు వంటివి సానుకూల అంశాలు. కంపెనీ క్యూ2 ఫలితాలు అంచనాలు మించాయి. రుణ భారం తగ్గించుకోవాలనే లక్ష్యం, తన సబ్సిడరీ ద్వారా ఉషా మార్టిన్‌ కొనుగోలు ప్రకటన వంటి వాటి వల్ల కంపెనీపై బుల్లిష్‌గా ఉన్నాం. దేశీ వ్యాపారాల ఎర్నింగ్స్‌ పెరిగే అవకాశాలున్నాయి. స్టీల్‌ ధరలు తగ్గడం, అసెట్స్‌ కొనుగోలు వంటివి రిస్క్‌ అంశాలు. 

సన్‌ ఫార్మా
ఈ స్టాక్‌ను హోల్డ్‌లో ఉంచొచ్చు. టార్గెట్‌ ప్రైస్‌ను రూ,580 నుంచి రూ.550కు తగ్గించాం. కంపెనీ క్యూ2 ఎర్నింగ్స్‌ తమ అంచనాల కన్నా దిగువునే ఉన్నాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే రెవెన్యూలో 4 శాతం, నికర లాభంలో 9 శాతం వృద్ధి నమోదయ్యింది. మార్జన్లు 22.1 శాతానికి మెరుగుపడ్డాయి. అమెరికా మార్కెట్‌ నుంచి అధిక రెవెన్యూ ఉంటే.. అది సానుకూలం. మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్లపై రెగ్యులేటరీ నిబంధనలు రిస్క్‌ అంశం. ఈ స్టాక్‌ కొనుగోలు కన్నా అరబిందో ఫార్మా లేదా సిప్లాకు ప్రాధాన్యమివ్వడం ఉత్తమం. 

సాటిన్‌ క్రెడిట్‌కేర్‌ నెట్‌వర్క్‌
ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.390గా నిర్ణయిస్తున్నాం. కంపెనీ క్యూ2 ఫలితాలు అంచనాలు మించాయి. ఏయూఎం వృద్ధి బలంగా ఉంది. క్యాపిటల్‌ పొజిషన్‌ ఆరోగ్యకరంగా కొనసాగుతోంది. అసెట్‌ క్వాలిటీ బాగుంది. రుణ మంజూరీ వ్యయాలు పెరగడం వల్ల మార్జిన్లపై ఒత్తిగి ఏర్పడవచ్చు. అలాగే నిర్వహణ ఖర్చులు కూడా పెరిగాయి. వీటి వల్ల సమీప కాలంలో ఆర్‌వోఈపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. వ్యాల్యుయేషన్స్‌ ఆమోదయోగ్యంగా ఉన్నాయి. స్టాక్‌ను కొనొచ్చు.

ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌
ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తున్నాం. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.350గా నిర్ణయించాం. బలమైన ఎర్నింగ్స్‌, ఏయూఎంలో వృద్ధి, షేరు ధర కరెక‌్షన్‌ వంటి వాటి వల్ల స్టాక్‌పై పాజిటివ్‌గా ఉన్నాం. స్టాక్‌ వ్యాల్యుయేషన్స్‌ ఆకర్షణీయంగా ఉన్నాయి. అయితే హోల్డింగ్‌ కంపెనీలోని వ్యవస్థపై స్పష్టత వచ్చేంత వరకు వేచి చూడాల్సి ఉంది. అలాగే ఎన్‌ఐఎం అంచనాల కన్నా ఎక్కువగా తగ్గడం రిస్క్‌ అంశం. You may be interested

యస్‌ సెక్యూరిటీస్‌ ప్రెసిడెంట్‌గా అంబానీ..

Wednesday 28th November 2018

యస్‌ సెక్యూరిటీస్‌ ఇండియా ప్రెసిడెంట్‌, హెడ్‌ ఆఫ్‌ రీసెర్చ్‌గా అమర్‌ అంబానీ నియమితులయ్యారు. యస్‌ బ్యాంక్‌కు చెందిన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, బ్రోకరేజ్‌ సబ్సిడరీయే ఈ యస్‌ సెక్యూరిటీస్‌. ‘అమర్‌ అంబానీకి అభినందనలు తెలియజేస్తున్నాను. అమర్‌, ఈయన బృందం యస్‌ సెక్యూరిటీస్‌ ప్రయాణంలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉంది. వీరంతా సంస్థ మార్కెట్‌ యాక్సెస్‌ను, సముపార్జన సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తారని విశ్వసిస్తున్నాను’ అని యస్‌ సెక్యూరిటీస్‌ చైర్మన్‌ రాణా

నిఫ్టీ కీలక నిరోధస్థాయి 10740-10750..!

Wednesday 28th November 2018

ముంబై: నిఫ్టీ 200-రోజుల సాధారణ సగటు కదిలికల స్థాయి 10,753 పాయింట్ల వద్ద ఉండగా.. ఈ స్థాయిని అధిగమించిన పక్షంలో 10,850-10,980 పాయింట్ల వరకు ర్యాలీ కొనసాగుతుందని ఎస్ సెక్యూరిటీస్ (ఇండియా) లిమిటెడ్‌ టెక్నికల్ అనలిస్ట్ ఆదిత్య అగర్వాలా విశ్లేషించారు. బుధవారం ఉదయం సెషన్లో సూచీ 10,742 పాయింట్లను చేరుకోగా.. ఈ స్థాయి 50-డబ్ల్యూఎంఏ (వీక్లీ మూవింగ్‌ యావరేజ్‌) అని.. ఈ సగటు ప్రకారం, 10740-10750 స్థాయిని సూచీ అధిగమించలేపోతే

Most from this category