STOCKS

News


ఫైజర్‌ హోల్డ్‌ చేయొచ్చు

Thursday 13th September 2018
Markets_main1536819032.png-20235

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా ఫైజర్‌ స్టాక్‌ను హోల్డ్‌ చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. 

బ్రోకరేజ్‌: సెం‍ట్రమ్‌
స్టాక్‌: ఫైజర్‌
ఇండస్ట్రీ: ఫార్మా
రేటింగ్‌: హోల్డ్‌ 
ప్రస్తుత ధర: రూ.3,576
టార్గెట్‌ ప్రైస్‌: రూ.3,100
డౌన్‌సైడ్‌: 13.8 శాతం 
సెంట్రమ్‌.. ఫైజర్‌ స్టాక్‌ను హోల్డ్‌ చేయవచ్చని సిఫార్సు చేసింది. స్టాక్‌ రేటింగ్‌ను బై నుంచి హోల్డ్‌కి తగ్గించింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.3,100గా నిర్ణయించింది. ఫైజర్‌ స్టాక్‌ గత కొద్ది కాలంగా బాగా పెరిగిందని, అందువల్ల అధిక వ్యాల్యుయేషన్స్‌ చోటుచేసుకున్నాయని పేర్కొంది. కంపెనీ ఏజీఎంలో తీసుకున్న నిర్ణయాల దృష్టా పాజిటివ్‌ ఔట్‌లుక్‌ను కలిగి ఉన్నట్లు తెలిపింది. తనకు చెందిన పలు బ్రాండ్ల మంచి వృద్ధి కారణంగా ఫైజర్‌ బలమైన పనితీరు కనబర్చవచ్చని పేర్కొంది. నికర లాభం, మార్జిన్లు కూడా పెరగొచ్చని అంచనా వేసింది. కంపెనీ ఇటీవల కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించిందని తెలిపింది. దేశీ ఫార్మా మార్కెట్‌ నెమ్మదించవచ్చనే అంచనాలు, ఇతర బ్రాండ్లపై ధరల ఒత్తిడి నెలకొనడం వంటివి రిస్క్‌ అంశాలని పేర్కొంది. అధిక వ్యాల్యుయేషన్ల వల్ల రేటింగ్‌ తగ్గించినట్లు తెలిపింది. 

కంపెనీ వివరాలు, పనితీరు సంబంధిత ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1536819041Pfizer - Event Update - Centrum 10092018.pdf)

You may be interested

వారంరోజుల గరిష్టం వద్ద పసిడి

Thursday 13th September 2018

న్యూయార్క్‌:- ప్రపంచ మార్కెట్లో గురువారం పసిడి ధర వారంరోజుల గరిష్టం పైన స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆరు ప్రధాన కరెన్సీ విలువతో పోలిస్తే డాలర్‌ ఇండెక్స్‌ క్షీణించడం, అమెరికా 10ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌ పెరగడం ఇందుకు కారణమవుతున్నాయి. ఆసియా మార్కెట్లో భారత వర్తమానకాలం ఉదయం 11 గంటలకు ఔన్స్‌ పసిడి 1 డాలరు స్వల్పంగా లాభపడి రూ.1,211.90 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. క్షీణించిన డాలర్‌ ఇండెక్స్‌:- అమెరికా-చైనా దేశాల మధ్య

ఫార్మాలో టాప్‌ పిక్‌: అరబిందో

Thursday 13th September 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా అరబిందో ఫార్మా షేరు కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..  బ్రోకరేజ్‌: సెంట్రమ్‌ స్టాక్‌: అరబిందో ఫార్మా ఇండస్ట్రీ: ఫార్మా రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.773 టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,270 అప్‌సైడ్‌: 64 శాతం సెంట్రమ్‌.. అరబిందో ఫార్మాపై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,010 నుంచి రూ.1,270కు పెంచింది. బై రేటింగ్‌ను కొనసాగించింది. అరబిందో ఫార్మా అమెరికాకు చెందిన నోవార్టిస్‌ ఏజీ

Most from this category