STOCKS

News


ఓరియెంట్‌ రిఫ్రాక్టరీస్‌ రేటింగ్‌ డౌన్‌

Thursday 13th September 2018
Markets_main1536823640.png-20238

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా ఓరియెంట్‌ రిఫ్రాక్టరీస్‌ స్టాక్‌ను హోల్డ్‌ చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. 

బ్రోకరేజ్‌: సెంట్రమ్‌
స్టాక్‌: ఓరియెంట్‌ రిఫ్రాక్టరీస్‌
ఇండస్ట్రీ: మెటల్స్‌
రేటింగ్‌: హోల్డ్‌
ప్రస్తుత ధర: రూ.242
టార్గెట్‌ ప్రైస్‌: రూ.230
డౌన్‌సైడ్‌: 8 శాతం
సెంట్రమ్‌.. ఓరియెంట్‌ రిఫ్రాక్టరీస్‌ స్టాక్‌ను హోల్డ్‌ చేయవచ్చని సిఫార్సు చేసింది. రేటింగ్‌ను బై నుంచి హోల్డ్‌కు తగ్గించింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.230గా నిర్ణయించింది. కంపెనీ పెద్ద సంస్థగా ఎదగడానికి ప్రయత్నిస్తోందని తెలిపింది. భారత్‌లో అధిక మార్కెట్‌ వాటాను దక్కించుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకుంటోందని పేర్కొంది. దేశీ, ఎగుమతుల డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి సామర్థ్యాన్ని విస్తరించుకుంటోందని తెలిపింది. రెవెన్యూ వృద్ధి అంచనాలు బలంగా ఉన్నాయని పేర్కొంది. అయితే మార్జిన్లు తగ్గొచ్చని తెలిపింది. దీంతో ఎర్నింగ్స్‌ వృద్ధి తక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది. మేనేజ్‌మెంట్‌ బాగుందని పేర్కొంది. కంపెనీ వ్యాపారం ఎగుమతులు, దిగుమతులపై ఆధారపడటం వల్ల ఎర్నింగ్స్‌ సహా మార్జిన్లలో ఒడిదుడుకులు ఉండటం రిస్క్‌ అంశమని తెలిపింది. 

కంపెనీ వివరాలు, పనితీరు సంబంధిత ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1536823648Orient Refractories - Company Update - Centrum 11092018.pdf)

You may be interested

బ్రెంట్‌ @ 80 డాలర్లు

Thursday 13th September 2018

బ్రెంట్‌ క్రూడ్‌ ధర బుధవారం మళ్లీ బ్యారెల్‌కు 80 డాలర్లను తాకింది. ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర మే 22 నుంచి చూస్తే ఈ మార్క్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా సరఫరా తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. లండన్‌ మార్కెట్‌లో బ్రెంట్‌ ఫ్యూచర్స్‌ ధర బుధవారం ఒకానొక సమయంలో 80.13 డాలర్ల స్థాయికి పెరిగింది. అలాగే అమెరికా క్రూడ్‌ బెంచ్‌మార్క్‌ డబ్ల్యూటీఐ క్రూడ్‌ కూడా 70.98 డాలర్లకు ఎగసింది. ఇరాన్‌ను

ఇర్కాన్‌ ఐపీవో: సబ్‌స్క్రైబ్‌ చేయాలా? వద్దా?

Thursday 13th September 2018

రైల్వే శాఖ నేతృత్వంలోని ‘ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌’ ఐపీవోకు వస్తోంది. మరి ఇందులో ఇన్వెస్ట్‌ చేయాలా? వద్దా? అనే సందేహం చాలా మంది ఇన్వెస్టర్లకు ఉంటుంది. ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా ఇర్కాన్‌ ఐపీవోను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చని సిఫార్సు చేసింది. 4 స్టార్‌ రేటింగ్‌ ఇచ్చింది.    ఐపీవో వివరాలు.. ప్రైస్‌బాండ్‌: రూ.470-475 ఫేస్‌ వ్యాల్యు: రూ.10 ఇష్యూ సైజ్‌: రూ.470 కోట్లు మినిమమ్‌ లాట్‌ సైజ్‌: 30 ఇష్యూ ప్రారంభం: సెప్టెంబర్‌ 17 ఇష్యూ ముగింపు: సెప్టెంబర్‌ 19 షేర్‌ హోల్డింగ్స్‌  

Most from this category