STOCKS

News


ఈ స్టాక్స్‌కు బై రేటింగ్‌..

Friday 23rd November 2018
Markets_main1542957317.png-22345

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా రెండు స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. అవేంటో చూద్దాం.. 

లుపిన్‌
లుపిన్‌పై పాజిటివ్‌గా ఉన్నాం. బై రేటింగ్‌ను కొనసాగిస్తున్నాం. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.960గా నిర్ణయించాం. అమెరికా జనరిక్‌ మారెకట్‌లో తీవ్రమైన పోటీ, ధరల ఒత్తిడి కారణంగా క్యూ2లో కంపెనీ ఫలితాలు అంచనాలకు దిగువునే ఉండిపోయాయి. వార్షికంగా చూస్తే కంపెనీ ఆదాయం ఫ్లాట్‌గానే ఉంది. మార్జిన్లు, నికర లాభం తగ్గాయి. తేవా, మైలాన్‌ సంస్థలు కొన్ని జనరిక్‌ ప్రొడక్టులను అమెరికా మార్కెట్‌లో విక్రయించడం నిలిపివేయడం వల్ల.. అక్కడ లుపిన్‌కు పోటీ కొంత మేర తగ్గింది. అమెరికా ఎఫ్‌డీఏ నుంచి లుపిన్‌ పలు ఉత్పత్తులకు అనుమతులు లభించాల్సి ఉందని, ఇవి భవిష్యత్‌ వృద్ధికి దోహదపడతాయి. విక్రయాలు, మార్జిన్లు పెరగొచ్చు. అమెరికా మార్కెట్‌లో బలమైన వృద్ధి నమోదు కావొచ్చు. దేశీ మార్కెట్‌లో వృద్ధి నెమ్మదిగా ఉండటం రిస్క్‌ అంశం. 

కిర్లోస్కర్‌ ఫెర్రస్‌
కిర్లోస్కర్‌ ఫెర్రస్‌ స్టాక్‌పై బై రేటింగ్‌ కొనసాగిస్తున్నాం. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.140గా నిర్ణయించాం. కంపెనీ ప్రస్తుత క్యూ2లో బలమైన పనితీరు కనబర్చింది. ఈబీటా అంచనాలు మించింది. బలమైన విక్రయాలు నమోదయ్యాయి. అధిక మార్జిన్లను అందించే కాస్టింగ్‌ బిజినెస్‌లో మార్కెట్‌ వాటా పెరుగుదల, వ్యయ నియం‍త్రణ, వేలంలో ఆకర్షణీయమైన ధరకు ఐరన్‌ ఓర్‌ మైన్‌ను సొంతం చేసుకోవడం, ఆరోగ్యకరమైన క్యాష్‌ ఫ్లో జనరేషన్‌, బలమైన బ్యాలెన్స్‌ షీట్‌ వంటి అంశాల నేపథ్యంలో స్టాక్‌పై పాజిటివ్‌గా ఉన్నాం. 

 

కంపెనీల పనితీరుకు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌లపై క్లిక్‌ చేయండి...

 

View Pdf One (1542957401Lupin - Q2FY19 Result Update - Centrum 06112018.pdf)
View Pdf Two (1188367066Kirloskar Ferrous - Q2FY19 Result Update - Centrum 05112018.pdf)

You may be interested

రియల్‌మి కొత్త ఫోన్‌ ‘యూ1’

Friday 23rd November 2018

కేవలం నాలుగు స్మార్ట్‌ఫోన్లతోనే తన సత్తా చాటుకున్న చైనాకు చెందిన మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘రియల్‌మి’ మరొక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది. నవంబర్‌ 28న ‘యూ1’ అనే కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. సెల్ఫీ కెమెరా ప్రధాన బలంగా కంపెనీ ఈ ఫోన్‌ను ఆవిష్కరించనుంది. అలాగే ఇందులో హీలియో పీ70 ప్రాసెసర్‌ను ఉపయోగిస్తోంది. ప్రపంచంలోనే ఈ రకం ప్రాసెసర్‌తో వస్తోన్న తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదే.

మారుతీ సుజుకీ టార్గెట్‌ ఎంత?

Friday 23rd November 2018

 ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ జియోజిత్‌ తాజాగా మారుతీ సుజుకీ ఇండియాపై పాజిటివ్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: జియోజిత్‌ స్టాక్‌: మారుతీ సుజుకీ ఇండియా రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.7,411 టార్గెట్‌ ప్రైస్‌: రూ.8,419 రిటర్న్‌ అంచనా: 14 శాతం జియోజిత్‌.. దేశీ దిగ్గజ ప్యాసింజర్‌ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియాపై పాజిటివ్‌గానే ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.8,419గా నిర్ణయించింది. 14

Most from this category