STOCKS

News


ఈ రెండు స్టాక్స్‌పై సెంట్రమ్‌ బుల్లిష్‌

Saturday 6th October 2018
Markets_main1538811432.png-20919

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా రెండు స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. అవేంటో ఒకసారి చూద్దాం.. 

స్టాక్‌: ఐసీఐసీఐ బ్యాంక్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.307
టార్గెట్‌ ప్రైస్‌: రూ.360
అప్‌సైడ్‌: 14 శాతం

సెం‍ట్రమ్‌.. ఐసీఐసీఐ బ్యాంక్‌పై పాజిటివ్‌గా ఉంది. చందా కొచర్‌ తక్షణ నిష్క్రమణ, ఐదేళ్ల కాలానికి గానూ బ్యాంక్‌ ప్రస్తుత సీవోవో సందీప్‌ బక్షిని కొత్త ఎండీ, సీఈవోగా ప్రమోట్‌ చేయడం వంటి అంశాల వల్ల నాయకత్వ అంశంపై తలెత్తిన అస్థిరతలకు అడ్డుకట్ట పడిందని పేర్కొంది. బ్యాంక్‌ తాజా నిర్ణయం ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపుతుందని తెలిపింది. బక్షికి ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో 30 ఏళ్లకుపైగా అనుభవం ఉందని పేర్కొంది. ఈయన బ్యాంక్‌లోకి అడుగు పెట్టకు మునుపు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీగా, సీఈవోగా పనిచేశారని గుర్తుచేసింది. బ్యాంక్‌ తన బ్యాలెన్స్‌ షీట్‌లో రిటైల్‌, ఎస్‌ఎంఈ విభాగాల వాటా పెంచుకోవడంపై దృష్టిపెట్టడం, ఎక్కువ రేటింగ్‌ కలిగిన కార్పొరేట్‌ సంస్థలకు ప్రాధాన్యమివ్వడం వంటి అంశాలు సానుకూలమని తెలిపింది. ఎన్‌పీఏల పెరుగుదల ఎక్కువ స్థాయిల్లో ఉండకపోవచ్చని పేర్కొంది. క్యాపిటల్‌ పొజిషన్‌ ఆరోగ్యకరంగానే ఉందని తెలిపింది. అందువల్ల ఐసీఐసీఐ బ్యాంక్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. 

స్టాక్‌: బజాజ్‌ ఆటో
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.2,543
టార్గెట్‌ ప్రైస్‌: రూ.3,176
అప్‌సైడ్‌: 20 శాతం

భారత్‌లో మోటార్‌సైకిల్‌ కొనుగోలు చేయాలనుకుంటున్న కస్టమర్ల కోసం బజాజ్‌ ఆటో తాజాగా 5-5-5 ఆఫర్‌ను ప్రకటించిందని సెంట్రమ్‌ పేర్కొంది. ఇది అక్టోబర్‌ 5 నుంచి అమలులోకి వచ్చింది. కంపెనీ ఇందులో భాగంగా 5 ఉచిత సర్వీసులు, 5 ఏళ్ల ఉచిత వారెంటీ, 5 ఏళ్లు ఉచిత ఓన్‌ డ్యామేజ్‌ ఇన్సూరెన్స్‌ వంటి ప్రయోజనాలను కస్టమర్లకు అందిస్తోంది. పరిశ్రమలో ఇలాంటి ఆఫర్‌ ప్రకటించిన తొలి కంపెనీ బజాజ్‌ ఆటో అని సెంట్రమ్‌ పేర్కొంది. 5-5-5 ఆఫర్‌ వల్ల పండుగ సీజన్‌లో వాహన అమ్మకాలు పెరుగొచ్చని అంచనా వేసింది. దీనివల్ల మార్జిన్లపై సానుకూల ప్రభావం ఉంటుందని తెలిపింది. అందువల్ల బజాజ్‌ ఆటో స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. 

కంపెనీల వివరాలు, వాటి పనితీరు సంబంధిత ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌లపై క్లిక్‌ చేయండి...

View Pdf One (1538811491ICICI Bank - Company Update - Centrum 04102018.pdf)
View Pdf Two (1488543420Bajaj Auto - Event Update - Centrum 05102018.pdf)

You may be interested

ఆర్తి డ్రగ్స్‌: 65% అప్‌సైడ్‌కు ఛాన్స్‌..

Saturday 6th October 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా ఆర్తి డ్రగ్స్‌పై బుల్లిష్‌గా ఉంది. ఎందుకో చూద్దాం..  స్టాక్‌: ఆర్తి డ్రగ్స్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.546 టార్గెట్‌ ప్రైస్‌: రూ.910 అప్‌సైడ్‌: 66 శాతం సెంట్రమ్‌.. ఆర్తి డ్రగ్స్‌పై పాజిటివ్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.910గా నిర్ణయించింది. ఆర్తి డ్రగ్స్‌ కంపెనీ తయారు చేసే 10 ఏపీఐలలో (యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రీడియెంట్‌) తొమ్మిదింటిలో మార్కెట్‌ లీడర్‌గా ఉందని పేర్కొంది. క్వాలిఫైడ్‌

పెట్టుబడికి ముందే?

Saturday 6th October 2018

సాక్షి, హైదరాబాద్‌: రోజురోజుకూ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణిస్తుండటంతో ప్రవాసులు రియల్టీ వైపు మళ్లుతున్నారు. నివాస సముదాయాల్లో కంటే వాణిజ్య, రిటైల్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఓ కన్సల్టెన్సీ సర్వేలో తేలింది. మరి, ఇలాంటి సమయంలో వాణిజ్య సముదాయల్లో పెట్టుబడులు పెట్టేముందు ఎలాంటి అంశాలను గమనించాలనే విషయంపై నిపుణులు సూచనలివిగో.. ♦ నివాస సముదాయాల్లో పెట్టుబడులు 2–4 శాతం అద్దె గిట్టుబాటైతే.. వాణì జ్య సముదాయాల్లో మాత్రం ఇది 8–11

Most from this category