సెంట్రమ్ స్టాక్ సిఫార్సులు
By Sakshi

బ్రోకరేజ్ సంస్థ సెంట్రమ్ తాజాగా మూడు స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. అవేంటో ఒకసారి చూద్దాం.. స్టాక్: డెక్కన్ సిమెంట్స్ స్టాక్: సిప్లా స్టాక్: మీర్జా ఇంటర్నేషనల్ కంపెనీ వివరాలు, పనితీరు సంబంధిత ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌లపై క్లిక్ చేయండి...
ఇండస్ట్రీ: సిమెంట్
రేటింగ్: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.437
టార్గెట్ ప్రైస్: రూ.670
డెక్కన్ సిమెంట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో మంచి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. దక్షిణ ప్రాంతంలోని అన్ని మార్కెట్ల నుంచి బలమైన డిమాండ్ ఉండటం వల్ల అమ్మకాలు బాగా పెరిగాయి. తీవ్రమైన పోటీ నేపథ్యంలో ధరల రికవరీ లేకపోవడం, రవాణా వ్యయాలు సహా ఇంధర ధరల పెరుగుదల వల్ల ఈబీటా 7 శాతం మేర తగ్గింది. బ్యాలెన్స్ షీటు బలంగా ఉండటం, దక్షిణ భారతదేశంలో ధరల రికవరీ అంచనా కారణంగా డెక్కన్ సిమెంట్ స్టాక్‌ను సిఫార్సు చేస్తున్నట్లు సెంట్రమ్ పేర్కొంది. ప్రస్తుతం ఈ షేరు తక్కువ వ్యాల్యుయేషన్స్ వద్ద ట్రేడవుతోందని తెలిపింది. అందువల్ల రూ.670 టార్గెట్ ప్రైస్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది.
ఇండస్ట్రీ: ఫార్మా
రేటింగ్: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.621
టార్గెట్ ప్రైస్: రూ.750
సెంట్రమ్.. సిప్లా స్టాక్‌పై బై రేటింగ్‌ను కొనసాగించింది. టార్గెట్ ప్రైస్‌ను రూ.730 నుంచి రూ.750కి పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం, ఈబీటా అంచనాలకు అనువుగానే ఉన్నాయని సెంట్రమ్ పేర్కొంది. నికర లాభం అంచనాలు మించిందని తెలిపింది. సిప్లా ఆదాయం వార్షికంగా 12 శాతం పెరిగిందని, అలాగే మార్జిన్లు 18.4 శాతానికి చేరాయని, నికర లాభం 5 శాతం ఎగసిందని పేర్కొంది. దేశీ వ్యాపారాన్ని పరిశీలిస్తే.. ఆదాయం ఏకంగా 39 శాతం పెరిగిందని తెలిపింది. రెస్పిరేటరీ, ఆంకాలజీ, యాంటీ ఇన్ఫెక్షన్ విభాగాల్లో టాప్ పొజిషన్లో ఉందని గుర్తుచేసింది. దేశీ, దక్షిణాఫ్రికా దేశాల వ్యాపారాలు తదుపరి వృద్ధికి దోహదపడతాయని తెలిపింది. దేశీ మార్కెట్లో వృద్ధి నెమ్మదిగా ఉండటం, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలకు రెగ్యుటరీ నిబంధనలు వంటివి రిస్క్ అంశాలని పేర్కొంది.
ఇండస్ట్రీ: కన్సూమర్
రేటింగ్: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.100
టార్గెట్ ప్రైస్: రూ.162
సెంట్రమ్.. మీర్జా ఇంటర్నేషనల్పై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌పై బై రేటింగ్‌ను కొనసాగించింది. టార్గెట్ ప్రైస్‌ను రూ.162గా నిర్ణయించింది. కంపెనీ ఫలితాలు అంచనాలకు దిగువునే ఉన్నప్పటికీ... కొత్త ప్రొడక్టుల వలన దేశీ బిజినెస్‌లో వృద్ధి జోరందుకుంటుందని అంచనా వేసింది. ఆన్లైన్ ఈబీవో చానల్లో బలమైన వృద్ధిని అవకాశాలున్నాయని తెలిపింది. అలాగే మేనేజ్మెంట్ కొత్త స్టోర్లను ఏర్పాటు చేస్తోందని పేర్కొంది. మహిళల పాదరక్షల విభాగంలోని ఎంట్రీ ఇవ్వడం వల్ల కంపెనీ విక్రయాలు పెరగొచ్చని తెలిపింది. గార్మెంట్ బిజినెస్ కూడా వృద్ధి బాటలో ఉందని పేర్కొంది. మార్జిన్ గైడెన్స్ 17-18 శాతంగా ఉండటం, ఎగుమతుల్లో స్వల్ప వృద్ధి వంటివి సానుకూల అంశాలని తెలిపింది. దేశీ వ్యాపారం మందగించడం, ఫుట్‌వేర్ అండ్ గార్మెంట్స్ దిగుమతులపై సుంకాలు పెరగడం వంటివి రిస్క్ అంశాలని పేర్కొంది.
View Pdf Two (1261813783Deccan Cements - Q1FY19 Result Update - Centrum 10082018.pdf) View Pdf Three (33852685Mirza International - Q1FY19 Result Update - Centrum 09082018.pdf)
You may be interested
ఈ స్టాక్ హోల్డ్ చేయొచ్చు!!
Saturday 11th August 2018ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ సెంట్రమ్ బ్రోకింగ్ తాజాగా రత్నమయి మెటల్స్ అండ్ ట్యూబ్స్ స్టాక్‌ను హోల్డ్ చేయవచ్చని సిఫార్సు చేసింది. స్టాక్: రత్నమయి మెటల్స్ అండ్ ట్యూబ్స్ ఇండస్ట్రీ: మెటల్స్ రేటింగ్: హోల్డ్ ప్రస్తుత ధర: రూ.861 టార్గెట్ ప్రైస్: రూ.940 సెంట్రమ్.. రత్నమయి మెటల్స్ అండ్ ట్యూబ్స్‌పై పాజిటివ్‌గానే ఉంది. అయితే టార్గెట్ ప్రైస్‌ను రూ.970 నుంచి రూ.940కి తగ్గించింది. భవిష్యత్ బలమైన వృద్ధి అంచనాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం అప్‌ట్రెండ్ సామర్థ్యం పరిమితంగానే ఉండటం ఇందుకు కారణంగా
నగరంలో 13,170 గృహాలు రెడీ!
Saturday 11th August 2018సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం దేశంలో 4,65,555 గృహాలు నిర్మాణం పూర్తయి.. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి విలువ రూ.3,32,848 కోట్లుగా ఉంటుందని ప్రాప్‌ఈక్విటీ తెలిపింది. వీటిల్లో ద్వితీయ శ్రేణి పట్టణాల్లో 68,094 యూనిట్లు ఉన్నాయని, వీటి విలువ రూ.33,512 కోట్లుగా ఉంటుందని సర్వే పేర్కొంది. ♦ హైదరాబాద్‌లో 2.3 కోట్ల చ.అ.ల్లో 51 ప్రాజెక్ట్‌లు నిర్మాణం పూర్తి చేసుకొని రెడీగా ఉన్నాయని . వీటిల్లో 13,710 యూనిట్లు గృహ ప్రవేశానికి రెడీగా