STOCKS

News


2 కొనొచ్చు.. 1 హోల్డ్‌ చేయొచ్చు..

Saturday 27th October 2018
Markets_main1540622005.png-21532

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌.. బజాజ్‌ ఆటో, డీబీ కార్ప్‌ స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. అలాగే జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ను హోల్డ్‌ చేయవచ్చని సూచించింది. ఎందుకో చూద్దాం.. 

బజాజ్‌ ఆటో
కంపెనీ క్యూ2 ఎర్నిం‍గ్స్‌ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని సెంట్రమ్‌ పేర్కొంది. బై రేటింగ్‌ను కొనసాగిస్తున్నామని తెలిపింది. అయితే టార్గెట్‌ ప్రైస్‌ను రూ.3,167 నుంచి రూ.3,075కి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. స్టాక్‌ ప్రస్తుత ధర రూ.2,513తో పోలిస్తే 22 శాతం అప్‌సైడ్‌కు ఛాన్స్‌ ఉందని తెలిపింది. కంపెనీ మార్కెట్‌ వాటాను పెంచుకోవడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందని, అందులో భాగంగానే పలు ప్రొడక్టులను తక్కువ ధరలకు అందించాలనే ప్రణాళికలతో ముందకెళ్తోందని పేర్కొంది. ఎగుమతుల్లో కూడా మంచి వృద్ధి నమోదవుతోందని తెలిపింది. ధరల డిస్కౌంట్‌ వ్యూహం కారణంగా మార్జిన్లపై ఒత్తిడి కొనసాగవచ్చని అంచనా వేసింది. దేశీ టూవీలర్‌ విభాగంలో మంచి విక్రయాల వృద్ధి, ఎగుమతులు వ్యాపారం జోరందుకోవడం, భవిష్యత్‌ వృద్ధి అంచనాలు వంటివి సానుకూల అంశాలని తెలిపింది. 

డీబీ కార్ప్‌
ఈ స్టాక్‌పై బై రేటింగ్‌ కొనసాగిస్తున్నట్లు సెంట్రమ్‌ పేర్కొంది. అయితే టార్గెట్‌ ప్రైస్‌ను రూ.368 నుంచి రూ.298కి తగ్గించినట్లు తెలిపింది. ఎన్నికలు, ఆటో/ఎఫ్‌ఎంసీజీ/రియల్‌ ఎస్టేట్‌ వంటి రంగాల్లో రకవరీ సానుకూల అంశమని తెలిపింది. దీని వల్ల యాడ్‌ రెవెన్యూ పెరగొచ్చని పేర్కొంది. రేడియో, డిజిటల్‌ వ్యాపారాల్లో బలమైన వృద్ధి వల్ల మార్జిన్లు పెరగొచ్చని తెలిపింది. యాడ్‌ రెవెన్యూ తగ్గడం, న్యూస్‌ప్రింట్‌ వ్యయాలు పెరగడం ప్రతికూల అంశాలని పేర్కొంది.  

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ స్టాక్‌ను హోల్డ్‌ చేయవచ్చని సెంట్రమ్‌ సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.335గా నిర్ణయించింది. కంపెనీ బలమైన నిర్వహణ పనితీరు కనబరుస్తూనే వస్తోందని తెలిపింది. కొత్త కొనుగోళ్ల కారణంగా కంపెనీ మూలధన వ్యయాలు పెరుగుతాయని అంచనా వేసింది. వచ్చే 3-6 నెలల కాలంలో వీటిపై జేఎస్‌డబ్ల్యూ ఎంత ఇన్వెస్ట్‌ చేసిందో స్పష్టంగా తెలుస్తుందని పేర్కొంది. విక్రయాల వృద్ధి పరిమితంగానే ఉండటం ప్రతికూల అంశమని తెలిపింది. ప్రస్తుత వ్యాల్యుయేషన్స్‌ పరంగా చూస్తే స్టాక్‌ ధరలో అప్‌సైడ్‌ పరిమితంగా ఉండొచ్చని అంచనా వేసింది. 

 

కంపెనీల వివరాలు, పనితీరు సంబంధిత ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌లపై క్లిక్‌ చేయండి...

View Pdf One (1540622095Bajaj Auto - Q2FY19 Result Update - Centrum 25102018.pdf)
View Pdf Two (2060964736D B Corp - Q2FY19 Result Update - Centrum 25102018.pdf) View Pdf Three (1651764903JSW Steel - Q2FY19 Result Update - Centrum 26072018.pdf)

You may be interested

కేపీఐటీకి ‘బై’ రేటింగ్‌

Saturday 27th October 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ఐటీ కంపెనీ కేపీఐటీ టెక్నాలజీస్‌పై బై రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింంది. ఈ స్టాక్‌ టార్గెట్‌ ప్రైస్‌ను రూ.285గా నిర్ణయించింది. కంపెనీ క్యూ2 ఎర్నింగ్స్‌ ఆరోగ్యకరంగా ఉన్నాయని తెలిపింది. రెవెన్యూ అంచనాలకు అనుగుణంగా ఉంటే, లాభదాయకత అంచనాలను మించిందని పేర్కొంది. రానున్న కాలంలో మార్జిన్లు పెరిగే అవకాశముందని అంచనా వేసింది. కంపెనీ రెవెన్యూ గైడెన్స్‌ను స్థిరంగా కొనసాగించడం, ఈబీటా మార్జిన్‌ గైడెన్స్‌ పెంచడం

నవంబర్‌లో రూ.40వేల కోట్ల సెక్యూరిటీల కొనుగోలు: ఆర్‌బీఐ

Saturday 27th October 2018

ముంబై:- ఆర్థిక వ్యవస్థలో నగదు కొరతను తగ్గించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చర్యలకు పూనుకుంది. అందులో భాగంగా బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి ఈ నవంబర్‌లో రూ.40 వేల కోట్లను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ప్రజలు, వాణిజ్య సంస్థలు, ఇతర విత్తసంస్థల నుంచి నవంబర్‌లో బహిరంగ మార్కెట్ కార్యకలాపాల (ఓఎంవో) ద్వారా ప్రభుత్వానికి చెందిన రూ.40 వేల కోట్ల విలువైన సెక్యూరిటీలను కొనుగోలు చేయనున్నట్లు ఆర్‌బీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Most from this category