కొనదగిన 3 స్టాక్స్..
By Sakshi

ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ సెంట్రమ్ తాజాగా పలు స్టాక్స్‌ను సిఫార్సు చేసింది. అవేంటో ఒకసారి చూద్దాం.. సిప్లా జేకే సిమెంట్ ఆర్తి డ్రగ్స్ కంపెనీల పనితీరుకు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌లపై క్లిక్ చేయండి...
ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. బై రేటింగ్ కొనసాగిస్తున్నాం. టార్గెట్ ప్రైస్‌ను రూ.680గా నిర్ణయించాం. కంపెనీ క్యూ2 ఫలితాలు తమ అంచనాల కన్నా దిగువునే ఉన్నాయి. వార్షికంగా చూస్తే సిప్లా నికర లాభం 16 శాతం, రెవెన్యూ 2 శాతం క్షీణించింది. మార్జిన్లు కూడా 17.5 శాతానికి తగ్గాయి. హై-బేస్ కారణంగా దేశీ వ్యాపారం కూడా తగ్గినట్లు కనిపిస్తోంది. దేశీ మార్కెట్లో స్థిరమైన వృద్ధి, పలు విభాగాల్లో అధిపత్యం కలిగి ఉండటం వంటి అంశాలు భవిష్యత్ వృద్ధికి దోహదపడతాయి.
జేకే సిమెంట్‌పై పాజిటివ్‌గా ఉన్నాం. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. టార్గెట్ ప్రైస్‌ను రూ.890గా నిర్ణయించాం. ప్రస్తుత క్యూ2లో కంపెనీ గ్రే సిమెంట్ వ్యాపారపు విక్రయాలు తగ్గాయి. తక్కువ మార్జిన్లు ఉన్న వ్యాపారాలపై కంపెనీ దృష్టి పెట్టడం తగ్గించడం ఇందుకు కారణం. అలాగే పండుగ సీజన్ డిమాండ్ ఆలస్యం కావడం వల్ల వైట్ పుట్టీ విభాగపు విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడింది. అందువల్ల స్టాండలోన్ రెవెన్యూ 1 శాతం తగ్గింది. ఇంధన ధరలు పెరగడం, డీజిల్ వ్యయాలు ఎగయడం వల్ల ఈబీటా, పీఏటీ రెండూ క్షీణించాయి. అయితే వైట్ విభాగంలో స్థిరమైన వృద్ధిని సాధిస్తుండటం, పెట్‌కోక్, డీజిల్ ధరలు దిగివస్తుండటం, డిమాండ్ మెరుగుదల వంటి అంశాల కారణంగా ఇప్పటికీ ఈ స్టాక్‌పై పాజిటివ్‌గానే ఉన్నాం.
ఈ స్టాక్‌పై బై రేటింగ్ కొనసాగిస్తున్నాం. టార్గెట్ ప్రైస్‌ను రూ.870గా నిర్ణయించాం. కంపెనీ క్యూ2 ఫలితాలు అంచనాలకు దిగువునే ఉన్నాయి. వార్షికంగా చూస్తే ఆదాయం 9 శాతం పెరిగింది. అయితే నికర లాభం 23 శాతం క్షీణించింది. మార్జిన్లు కూడా 13.5 శాతానికి తగ్గాయి. వెర్టికల్ ఇంటిగ్రేషన్ వల్ల భవిష్యత్ వృద్ధి దోహదపడొచ్చు. కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణ తర్వాత మార్జిన్లు మెరుగుపడొచ్చు. దేశీ ఫార్మా వ్యాపారం మందగించడం, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లపై రెగ్యులేటరీ నిబంధనలు వంటివి రిస్క్ అంశాలు.
View Pdf Two (881181503JK Cement - Q2FY19 Result Update - Centrum 06112018.pdf) View Pdf Three (458752553Aarti Drugs - Q2FY19 Result Update - Centrum 12112018.pdf)
You may be interested
జోరుగా అటో షేర్ల ర్యాలీ
Thursday 29th November 20184శాతం లాభపడిన బజాజ్ అటో, మహీంద్రా షేర్లు మార్కెట్ ర్యాలీలో భాగంగా గురువారం అటో రంగ షేర్లు జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. ఎన్ఎస్ఈలో అటోరంగ షేర్లకు ప్రాతనిథ్యం వహించే నిఫ్టీ అటోరంగ ఇండెక్స్ ఇంట్రాడేలో 2శాతం ర్యాలీ చేసింది. బజాజ్ అటో, మహీంద్రా అండ్ మహీంద్రా షేరు 4శాతం ర్యాలీ చేశాయి. టీవీఎస్ మోటర్ 2.50శాతం, టాటామోటర్స్, అశోక్‌లేలాండ్, భాష్ లిమిటెడ్, అపోలోటైర్స్, భారత్ఫోర్జ్స్, హీరోమోటర్స్ కార్ప్, షేర్లు 1.50శాతం పెరిగాయి.
థండర్బర్డ్ 500ఎక్స్‌లో ఏబీఎస్ వేరియంట్
Thursday 29th November 2018ధర రూ.2.13 లక్షలు రాయల్ ఎన్ఫీల్డ్ తన పోర్ట్‌ఫోలియోలోని బైక్స్‌ను 2019 ఏప్రిల్ నుంచి అమలులోకి రానున్న కొత్త భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అప్డేట్ చేసుకుంటోంది. కంపెనీ అందులో భాగంగా తాజాగా థండర్బర్డ్ 500ఎక్స్‌లో ఏబీఎస్ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మార్కెట్లోకి రానున్న 125 సీసీ, అటుపై ఇంజిన్లను కలిగిన బైక్స్‌కు ఏబీఎస్ (యాంటీ బ్రేక్ లాక్ సిస్టమ్) ఫీచర్ తప్పనిసరి.