STOCKS

News


50%పైగా రాబడి అందించే స్టాక్స్‌!!

Thursday 29th November 2018
Markets_main1543471651.png-22480

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా పలు స్టాక్స్‌ను సిఫార్సు చేసింది. అవేంటో ఒకసారి చూద్దాం.. 

అరబిందో ఫార్మా
అరబిందో ఫార్మాపై బై రేటింగ్‌ను కొనసాగిస్తున్నాం. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,270గా నిర్ణయించాం. అంటే 60 శాతం అప్‌సైడ్‌కు ఛాన్స్‌ ఉంది. కంపెనీ క్యూ2 ఫలితాలు అంచనాలు మించాయి. వార్షికంగా విక్రయాలు 7 శాతం పెరిగాయి. అయితే ఇదే సమయంలో మార్జిన్లు 21.6 శాతానికి తగ్గితే, నికర లాభం 18 శాతంమేర క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లోని హైబేస్‌ ఇందుకు కారణం. అయితే రానున్న కాలంలో మార్జిన్లు, నికర లాభం మెరుగుపడొచ్చు. కంపెనీ అమెరికా మార్కెట్‌పై దృష్టి కేంద్రీకరించింది. అక్కడ భిన్నమైన ప్రొడక్టులను తీసుకురానుంది. ఫార్మా రంగంలోని టాప్‌ పిక్స్‌లో అరబిందో ఒకటి. కంపెనీ ఫార్ములేషన్‌ బిజినెస్‌ బాగుంది. వ్యాల్యుయేషన్స్‌ ఆకర్షణీయంగా ఉన్నాయి. 

స్టార్‌ సిమెంట్‌
స్టార్‌ సిమెంట్ స్టాక్‌పై బుల్లిష్‌గా ఉన్నాం. కొనుగోలు చేయవచ్చు. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.162గా నిర్ణయించాం. అంటే ప్రస్తుత మార్కెట్‌ ధరతో పోలిస్తే 67 శాతం పెరుగుదలకు అవకాశముంది. కంపెనీ ప్రస్తుత క్యూ2లోనూ బలమైన ఫలితాలనే ప్రకటించింది. విక్రయాల్లో మంచి వృద్ధి నమోదయ్యింది. ముడి పదార్ధాల ధరల పెరుగుదల, డీజిల్‌ వ్యయాలు పెరగడం, ఇతర కారణాల వల్ల వ్యయాలు పెరిగాయి. అందువల్ల వార్షికంగా చూస్తే ఈబీటా 11 శాతం క్షీణించింది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంపై ధీమాగా ఉంది. ధరలు సహా డిమాండ్‌ పెరగొచ్చనే అంచనాలున్నాయి. ఈశాన్య భారత దేశంలో బలమైన మార్కెట్‌ కలిగి ఉండటం సానుకూల అంశం. 

కోల్‌ ఇండియా
కోల్‌ ఇండియాపై బై రేటింగ్‌ కొనసాగిస్తున్నాం. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.370గా నిర్ణయించాం. ప్రస్తుత మార్కెట్‌ ధరతో పోలిస్తే 50 శాతం అప్‌సైడ్‌కు ఛాన్స్‌ ఉంది. కంపెనీ క్యూ2 పనితీరు అంచనాలు మించింది. వ్యయాలు నియంత్రణలోనే ఉన్నాయి. డిమాండ్‌ బాగుంది. రానున్న కాలంలో కంపెనీ బలమైన పనితీరు కనబరుస్తుందని అంచనా వేస్తున్నాం. ఎర్నింగ్స్‌ ఔట్‌లుక్‌ బాగుంది. అయితే స్టాక్‌ కొంత ఎక్కువ వ్యాల్యుయేషన్స్‌తోనే ట్రేడ్‌ అవుతోంది.  

కంపెనీల పనితీరుకు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌లపై క్లిక్‌ చేయండి...
 

View Pdf One (1543471679Aurobindo Pharma - Q2FY19 Result Update - Centrum 13112018.pdf)
View Pdf Two (1378632141Star Cement - Q2FY19 Result Update - Centrum 13112018.pdf) View Pdf Three (2001243178Coal India - Q2FY19 Result Update - Centrum 13112018.pdf)

You may be interested

ఫ్లిప్‌కార్ట్‌పై అమెజాన్‌ పైచెయ్యి

Thursday 29th November 2018

ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజాలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ మధ్య పోటీ త్రీవంగా నడుస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో అమెజాన్‌ పైచెయ్యి సాధించింది. స్థూల మర్చండైజ్‌ వ్యాల్యు (జీఎంవీ) పరంగా చూస్తే అమెజాన్‌.. ఫ్లిప్‌కార్ట్‌ను వెనక్కు నెట్టింది. స్టాండలోన్‌ ప్రాతిపదికన 2018 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అమెజాన్‌ జీఎంవీ 7.5 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇదే సమయంలో ఫ్లిప్‌కార్ట్‌ జీఎంవీ 6.2 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. బార్‌క్లేస్‌ నివేదికలో ఈ

పీఎన్‌బీ నిర్వహణ ఎన్‌సీఆర్‌ చేతికి

Thursday 29th November 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో మూడో అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంక్‌ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) నిర్వహణ బాధ్యత ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌ దక్కించుకుంది. మూడేళ్ల అగ్రిమెంట్‌లో పీఎన్‌బీ నగదు నిర్వహణ, కంటెంట్‌ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రానిక్‌ జర్నల్‌ పుల్లింగ్, సైట్‌ మేనేజ్‌మెంట్, సాఫ్ట్‌వేర్‌ డిస్ట్రిబ్యూషన్‌ వంటి అన్ని రకాల సేవలందిస్తామని ఎన్‌సీఆర్‌ ఇండియా ఎండీ నఫ్‌రోజ్‌ దస్తూర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం పీఎన్‌బీకి దేశంలో 6,692 బ్రాంచీలు, 3600

Most from this category