STOCKS

News


ఫార్మాలో టాప్‌ పిక్‌: అరబిందో

Thursday 13th September 2018
Markets_main1536817957.png-20234

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా అరబిందో ఫార్మా షేరు కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. 

బ్రోకరేజ్‌: సెంట్రమ్‌
స్టాక్‌: అరబిందో ఫార్మా
ఇండస్ట్రీ: ఫార్మా
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.773
టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,270
అప్‌సైడ్‌: 64 శాతం
సెంట్రమ్‌.. అరబిందో ఫార్మాపై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,010 నుంచి రూ.1,270కు పెంచింది. బై రేటింగ్‌ను కొనసాగించింది. అరబిందో ఫార్మా అమెరికాకు చెందిన నోవార్టిస్‌ ఏజీ అనుబంధ సంస్థ శాండోజ్‌ డెర్మటాలజీని కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. నోవార్టిస్‌ ఏజీ జనరిక్‌ వ్యాపార విభాగమే శాండోజ్‌. ఈ డీల్‌ విలువ 1 బిలియన్‌ డాలర్‌ (రూ.7,200 కోట్లు)గా ఉంది. అమెరికాలో వ్యాపార వృద్ధి, విస్తరణలో భాగంగానే ఈ కొనుగోలు చేస్తున్నట్లు అరబిందో ఫార్మా పేర్కొంది. శాండోజ్‌ కొనుగోలు పూర్తయితే అరబిందో ఫార్మా అమెరికాలో రెండో అతిపెద్ద జెనరిక్‌ కంపెనీగా, అక్కడి డెర్మటాలజీ విభాగంలోనూ రెండో అతిపెద్ద కంపెనీగా అవతరించనుంది. 
ఫార్మా రంగంలో అరబిందో ఫార్మా తమ టాప్‌ పిక్‌ అని సెంట్రమ్‌ పేర్కొంది. వార్షికంగా చూస్తే రెవెన్యూ వృద్ధి 29 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. అయితే 2019-20లో మార్జిన్లు స్వల్పంగా తగ్గొచ్చని తెలిపింది. నికర లాభం వార్షికంగా 56 శాతం పెరగొచ్చని పేర్కొంది. వ్యాల్యుయేషన్స్‌ ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపింది. మ్యానుఫ్యాక్చరింగ్‌ ఫెసిలిటీలకు రెగ్యులేటరీ నిబంధనలు, అమెరికాలో వ్యాపారం నెమ్మదించడం వంటివి రిస్క్‌ అంశాలని పేర్కొంది. 
 

కంపెనీ వివరాలు, పనితీరు సంబంధిత ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1536818014Aurobindo Pharma - Event Update - Centrum 10092018.pdf)

You may be interested

ఫైజర్‌ హోల్డ్‌ చేయొచ్చు

Thursday 13th September 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా ఫైజర్‌ స్టాక్‌ను హోల్డ్‌ చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..  బ్రోకరేజ్‌: సెం‍ట్రమ్‌ స్టాక్‌: ఫైజర్‌ ఇండస్ట్రీ: ఫార్మా రేటింగ్‌: హోల్డ్‌  ప్రస్తుత ధర: రూ.3,576 టార్గెట్‌ ప్రైస్‌: రూ.3,100 డౌన్‌సైడ్‌: 13.8 శాతం  సెంట్రమ్‌.. ఫైజర్‌ స్టాక్‌ను హోల్డ్‌ చేయవచ్చని సిఫార్సు చేసింది. స్టాక్‌ రేటింగ్‌ను బై నుంచి హోల్డ్‌కి తగ్గించింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.3,100గా నిర్ణయించింది. ఫైజర్‌ స్టాక్‌ గత కొద్ది కాలంగా బాగా పెరిగిందని, అందువల్ల అధిక వ్యాల్యుయేషన్స్‌ చోటుచేసుకున్నాయని

బాష్‌ నుంచి నూతన శ్రేణి వాషింగ్‌ మిషన్లు

Thursday 13th September 2018

హైదరాబాద్‌: గృహోపకరణాల తయారీ సంస్థ బాష్‌ విపణిలోకి కొత్తగా టాప్‌లోడ్‌ వాషింగ్‌ మిషన్లను విడుదల చేసింది. దీంతో పాటూ బాష్‌ ఇతర ఉత్పత్తులపై వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు కంపెనీ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈనెల 14 వరకూ గృహోపకరణాల ఉత్పత్తుల ట్రక్‌ హైదరాబాద్‌లోని అత్తాపూర్, చైతన్యపురి, మదీనాగూడ వంటి పలు ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుందని.. ఆయా ఉత్పత్తులపై వినియోగదారులకు అవగాహన కల్పిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం బాష్‌

Most from this category