STOCKS

News


ఆర్తి డ్రగ్స్‌: 65% అప్‌సైడ్‌కు ఛాన్స్‌..

Saturday 6th October 2018
Markets_main1538812868.png-20920

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా ఆర్తి డ్రగ్స్‌పై బుల్లిష్‌గా ఉంది. ఎందుకో చూద్దాం.. 

స్టాక్‌: ఆర్తి డ్రగ్స్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.546
టార్గెట్‌ ప్రైస్‌: రూ.910
అప్‌సైడ్‌: 66 శాతం

సెంట్రమ్‌.. ఆర్తి డ్రగ్స్‌పై పాజిటివ్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.910గా నిర్ణయించింది. ఆర్తి డ్రగ్స్‌ కంపెనీ తయారు చేసే 10 ఏపీఐలలో (యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రీడియెంట్‌) తొమ్మిదింటిలో మార్కెట్‌ లీడర్‌గా ఉందని పేర్కొంది. క్వాలిఫైడ్‌ కెమికల్‌ ఇంజినీర్స్‌ను ప్రమోటర్లుగా కలిగి ఉండటం సానుకూల అంశమని తెలిపింది. కంపెనీ ఉత్పత్తి చేసే పది ప్రొడక్ట్‌లలో ఐదు చైనాలో తయారు అవుతాయని, అందువల్ల ఆ ఐదింటికే అక్కడి పోటీ పరిమితమౌతుందని పేర్కొంది. కంపెనీ ఉత్పత్తి వ్యయాలు తక్కువగా ఉన్నాయని తెలిపింది. అలాగే ఆర్తి డ్రగ్స్‌.. వివిధ రకాల ఔషధాలను తయారు చేస్తుందని, అలాగే ఇంటర్మీడియట్స్‌, ఏపీఐ, ఫార్మురేషన్స్‌ వంటి విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని పేర్కొంది. సామర్థ్యం పెంపు, కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణ, అధిక మార్జిన్లు అందించే ఫార్ములేషన్స్‌ విభాగంలో ఉండటం వంటి వాటి వల్ల ఆర్తి డ్రగ్స్‌ మంచి పనితీరు కనబరుస్తుందని అంచనా వేసింది. రూపాయి క్షీణత వల్ల ప్రయోజనం పొందుతుందని పేర్కొంది.  మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్లకు రెగ్యులేటరీ నిబంధనలు, దేశీ మార్కెట్‌ నెమ్మదించడం వంటి అంశాలు రిస్క్‌ అంశాలని తెలిపింది. 

కంపెనీ వివరాలు, పనితీరు సంబంధిత ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1538812908Aarti Drugs - Company Update - Centrum 04102018.pdf)

You may be interested

యాక్సిస్‌ బ్యాంక్‌లో వాటా విక్రయం వాయిదా

Saturday 6th October 2018

ముంబై:- ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న అస్థిరత కారణంగా యాక్సిస్‌ బ్యాంకులో ప్రభుత్వం తన వాటా విక్రయాన్ని వాయిదా వేసింది. ఈ నవంబర్‌ చివరినాటి కల్లా యాక్సిస్‌ బ్యాంకులోని తన మొత్తం వాటాలో 4శాతం వాటాను విక్రయించి రూ.7,000 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం భావించింది. సెకండరీ మార్కెట్లో ఆగస్ట్‌ చివరి నాటి నుంచి తలెత్తిన సంక్షోభంతో వాటా విక్రయ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది.

ఈ రెండు స్టాక్స్‌పై సెంట్రమ్‌ బుల్లిష్‌

Saturday 6th October 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా రెండు స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. అవేంటో ఒకసారి చూద్దాం..  స్టాక్‌: ఐసీఐసీఐ బ్యాంక్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.307 టార్గెట్‌ ప్రైస్‌: రూ.360 అప్‌సైడ్‌: 14 శాతం సెం‍ట్రమ్‌.. ఐసీఐసీఐ బ్యాంక్‌పై పాజిటివ్‌గా ఉంది. చందా కొచర్‌ తక్షణ నిష్క్రమణ, ఐదేళ్ల కాలానికి గానూ బ్యాంక్‌ ప్రస్తుత సీవోవో సందీప్‌ బక్షిని కొత్త ఎండీ, సీఈవోగా ప్రమోట్‌ చేయడం వంటి అంశాల వల్ల నాయకత్వ అంశంపై తలెత్తిన

Most from this category