STOCKS

News


వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్‌పై కోటక్‌ బుల్లిష్‌

Tuesday 18th December 2018
Markets_main1545116429.png-23043

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్‌పై పాజిటివ్‌గా ఉంది. ఎందుకో చూద్దాం.. 

బ్రోకరేజ్‌: కోటక్‌ సెక్యూరిటీస్‌
స్టాక్‌: వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.282
టార్గెట్‌ ప్రైస్‌: రూ.355

కోటక్‌ సెక్యూరిటీస్‌.. వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్‌పై సానుకూలంగా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.355గా నిర్ణయించింది. ట్రకింగ్‌ విభాగంలో బలమైన పనితీరు, దేశ వ్యాప్తంగా జీఎస్‌టీ అమలు, సానుకూల నిబంధనలు, దేశీ వ్యాపారం మెరుగుదల, డీజిల్‌ ధరల తగ్గుదల వంటి అంశాలు వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్‌కు పాజిటివ్‌ అంశాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన యాక్సిల్‌ నిబంధనల మార్పు వల్ల కంపెనీకి ప్రయోజనం చేకూరుతుందని, సరుకు రవాణ సామర్థ్యం పెరుగుతుందని, తద్వారా ‍కంపెనీ మార్జిన్లు మెరుగుపడతాయని తెలిపింది. ఇకపోతే వ్యాల్యుయేషన్స్‌ కూడా ఆమోదయోగ్యంగానే ఉన్నాయని పేర్కొంది. అందువల్ల వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్‌ షేరును కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. కాగా వీఆర్‌ఎల్‌ కంపెనీ దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్‌, పార్సిల్‌ డెలివరీ, లగ్జరీ బస్‌ సర్వీలను అందిస్తోంది. 


కంపెనీ పనితీరుకు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1545116446VRLLogistics_17Dec18_Kotak_PCG_00606.pdf)

You may be interested

ఐటీ షేర్లకు రూపీ పోటు

Tuesday 18th December 2018

డాలర్ల రూపంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ షేర్లకు మంగళవారం రూపీ పోటు తగిలింది. ఎన్‌ఎస్‌ఈ ఎక్చ్సేంజ్‌లో అధిక వెయిటేజీ కలిగిన నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేడు 1.50శాతం నష్టపోయింది. డాలర్‌ మారకంలో రూపాయి రికవరి ఇందుకు కారణమైంది. ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ రేట్ల సమావేశ నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో డాలర్‌ బలహీన ట్రేడింగ్‌ దేశీయ రూపాయికి కలిసొస్తుంది. ఫలితంగా ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 71.16స్థాయిని బలపడింది.

ఫెడ్‌ మీటింగ్‌పై మార్కెట్‌ అంచనాలేంటి?

Tuesday 18th December 2018

అమెరికా ఫెడరల్‌ రిజర్వు సమావేశం ప్రారంభమైంది. బుధవారం అర్ధ రాత్రి పాలసీ నిర్ణయం వెలువడనుంది. దీని ఆధారపడి సమీప కాలంలో మార్కెట్‌ ట్రెండ్‌ ఉండొచ్చు. 25 బేసిస్‌ పాయింట్ల మేర రేట్ల పెంపు ఉంటుందని మార్కెట్‌ అంచనాకు వచ్చిందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ హెడ్‌ (టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్స్‌ అనలిస్ట్‌) రాజేశ్‌ పాల్వియా తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ఫెడరల్‌ రిజర్వు తాజా

Most from this category