STOCKS

News


ఈ మూడు స్టాక్స్‌ కొనొచ్చు..

Saturday 11th August 2018
Markets_main1533974547.png-19178

బ్రోకరేజ్‌ సంస్థ జేఎం ఫైనాన్సియల్‌ మూడు స్టాక్స్‌ కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తోంది. ఆ షేర్లివే..

స్టాక్‌: రిలయన్స్‌ నిప్పాన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.237
టార్గెట్‌ ప్రైస్‌: రూ.330
అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (ఏఎంసీ) పరిశ్రమలో ఇటీవల కాలంలో స్థూల కమిషన్‌ చెల్లింపులు పెరిగాయని జేఎం ఫైనాన్షియల్‌ పేర్కొంది. ఇదే సమయంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి గత రెండేళ్లలో ఇన్వెస్ట్‌మెంట్లు కూడా గణనీయంగా పెరిగాయని తెలిపింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో టాప్‌ ఏఎంసీల స్థూల కమిషన్‌ చెల్లింపుల్లో 52-85 శాతం వృద్ధి నమోదయ్యిందని పేర్కొంది. అలాగే గత ఐదేళ్లలో చూస్తే ఈక్విటీ ఎంఎఫ్‌ స్కీమ్స్‌లో టోటల్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియో తగ్గిందని తెలిపింది. ఆశ్చర్యకరంగా ఈక్విటీ ఎంఎఫ్‌ ఏయూఎం, ఏఎంసీ వృద్ధి కన్నా కమిషన్‌ చెల్లింపుల్లో వృద్ధి ఎక్కువగా ఉందని తెలిపింది. రిలయన్స్‌ నిప్సాన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ స్టాక్‌ కొనొచ్చని సిఫార్సు చేసింది. 

స్టాక్‌: శోభ
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.530
టార్గెట్‌ ప్రైస్‌: రూ.600
శోభ డెవలపర్స్‌ క్యూ1 లాభం వార్షిక ప్రాతిపదికన 10 శాతానికిపైగా పెరిగిందని జేఎం ఫైనాన్షియల్‌ తెలిపింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన కంపెనీ ఆదాయం రూ.597 కోట్లుగా నమోదయ్యిందని, వార్షిక ప్రాతిపదికన 12 శాతం తగ్గిందని పేర్కొంది. రియల్‌ ఎస్టేట్‌ ఆదాయం తగ్గడం ఇందుకు కారణమని తెలిపింది. అయితే విక్రయాలు 18 శాతం ఎగశాయని పేర్కొంది. ఈబీటా 7.9 శాతం, పీఏటీ 10 శాతం పెరిగాయని తెలిపింది. కొత్త అందుబాటు గృహ ప్రాజెక్టుల ఆవిష్కరణలు కలిసొచ్చే అంశమని, రూ.600 టర్గెట్‌ ప్రైస్‌తో స్టాక్‌ కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది.

స్టాక్‌: ట్రెడెంట్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.61
టార్గెట్‌ ప్రైస్‌: రూ.82
ట్రెడెంట్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.59.2 కోట్ల పీఏటీ ప్రకటించిందని జేఎం ఫైనాన్షియల్‌ పేర్కొంది. ఇది అంచనాల కన్నా తక్కువని తెలిపింది. ఈబీటా మార్జిన్లు 17.3 శాతానికి క్షీణించాయని పేర్కొంది. బెడ్‌షీట్లు, టెర్రీ టువల్‌ విక్రయాలు తగ్గడం ఇందుకు కారణమని తెలిపింది. ఎగుమతుల్లో పెరుగుదల, కాటన్‌ ధర కదలిక అంశాలు కీలకమని పేర్కొంది. కార్యకలాపాల విస్తరణ, సామర్థ్యం పెంపునకు కంపెనీ ప్రయత్నిస్తోందని తెలిపింది. కంపెనీ మధ్యంతర డివిడెండ్‌ కూడా ప్రకటించిందని పేర్కొంది. ఎర్నింగ్స్‌ అంచనాలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. అయితే బై రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. 
 



You may be interested

వీటిని హోల్డ్‌ చేయొచ్చు

Saturday 11th August 2018

బ్రోకరేజ్‌ సంస్థ జేఎం ఫైనాన్షియల్‌ తాజాగా మూడు స్టాక్స్‌ను హోల్డ్‌ చేయవచ్చని సిఫార్సు చేసింది. అవేంటో చూద్దాం.. స్టాక్‌: పీఎన్‌బీ రేటింగ్‌: హోల్డ్‌ ప్రస్తుత ధర: రూ.83 టార్గెట్‌ ప్రైస్‌: రూ.85 పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక (ఏప్రిల్‌-జూన్‌, క్యూ1) ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. బ్యాంక్‌ రూ.940 కోట్ల నికర నష్టా‍న్ని నమోదు చేసింది. త్రైమాసికం పరంగా చూస్తే బ్యాంక్‌ స్థూల ఎన్‌పీఏఎలు 18.38 శాతం నుంచి 18.26 శాతానికి, నికర

ఐపీఓకు నిహిలెంట్‌ టెక్నాలజీస్‌

Saturday 11th August 2018

ముంబై:- ఐటీ సెల్యూషన్స్‌ కంపెనీ నిహిలెంట్‌ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు సిద్ధమైంది. అందుకు సంబంధిత ముసాయిదా పత్రాలను శుక్రవారం మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబికి సమర్పించింది. ఓపెన్‌ ఆఫర్‌ పద్ధతిలో మొత్తం 21.25లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.250 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఈ ఐపీఓ ప్రక్రియకు మోతిలాల్‌ ఓస్వాల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ లిమిటెడ్‌ బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్‌గానూ, లింక్‌

Most from this category