STOCKS

News


ఈ షేర్లపై కన్నేయండి..

Monday 17th December 2018
Markets_main1545034450.png-22990

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌    కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ.293
టార్గెట్ ధర: రూ.366
ఎందుకంటే: జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 18 మిలియన్‌ టన్నులు.  మూడేళ్లలో  వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని  25 మిలియన్‌ టన్నులకు పెంచుకోవాలని కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. దీని కోసం రూ.44,400 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. ఈ కంపెనీకి చెందిన 12 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల విజయనగర్‌ స్టీల్‌ ప్లాంట్‌ అన్ని అంశాల్లో సంతృప్తికరమైన పనితీరును కనబరుస్తోంది. కర్నాటకలోని బళ్లారి గనులకు సమీపంలో ఉన్న ఈ ప్లాంట్‌లో కార్మికుల ఉత్పాదకత గరిష్ట స్థాయిలో ఉండటం, పారిశ్రామిక వ్యర్థాలను 95 శాతం వరకూ మళ్లీ వినియోగించుకోగలగడం, కాలుష్యం తక్కువ స్థాయిలో ఉండటం, దేశీయ స్టీల్‌ కంపెనీల నుంచి పోటీ తక్కువగా లేని దక్షిణ భారత దేశంలో ఈ ప్లాంట్‌ ఉండటం.....చెప్పుకోదగిన ప్రత్యేకతలు. విస్తరణలో భాగంగా చేపట్టిన పైప్‌ కన్వేయర్‌ ప్రాజెక్ట్‌ వల్ల ఇనుప ఖనిజం రవాణా వ్యయాలు టన్నుకు రూ.300 తగ్గుతాయి. వార్షికంగా ఈ ఆదా రూ.500-600 కోట్ల మేర ఉండవచ్చు. కంపెనీ సొంత గనులు వచ్చే ఆర్థిక సంవత్సరం కల్లా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. 1.5 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉన్న మోనెట్‌ ఇస్పాత్‌ కంపెనీలో వాటాను జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కొనుగోలు చేసింది. త్వరలో ఈ కంపెనీలో మోనెట్‌ ఇస్పాత్‌ విలీనం కానున్నది. ఈ విలీనంతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 26.2 మిలియన్‌ టన్నులకు పెరుగుతుంది. అమెరికా, ఇటలీలో కొన్ని ప్లాంట్లను కొనుగోలు చేసింది. తక్కువ వ్యయంతో కొనుగోలు చేసిన అమెరికాలోని ఏసిరో ప్లాంట్‌ టర్న్‌ అరౌండ్‌ సాధిస్తే, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ విలువ చెప్పుకోదగిన స్థాయిలో పెరుగుతుంది. ఐదేళ్లలో కంపెనీ అమ్మకాలు 8-10 శాతం రేంజ్‌లో, ఎబిటా 10-12 శాతం రేంజ్‌లో చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా.  


హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌        కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఎడిల్‌వేజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌
ప్రస్తుత ధర: రూ.960
టార్గెట్ ధర: రూ.1,300
ఎందుకంటే: ఐబీఎమ్‌కు చెందిన ఏడు సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులను 180 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయడానికి హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఇటీవలే ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి కావలసిన నిధులను అధిక భాగం అంతర్గత వనరుల నుంచి సమకూర్చుకుంటోంది. 30 కోట్ల డాలర్ల మేర రుణాలను సమీకరిస్తోంది. ఈ డీల్‌ వచ్చే ఏడాది జూన్‌కల్లా పూర్తవ్వగలదని అంచనా. ఈ డీల్‌ ఫలితంగా ఈ కంపెనీకి 5,000 కోట్ల డాలర్ల ఆదాయం ఆర్జించే అవకాశాలు లభిస్తాయి. వేగంగా వృద్ధి చెందే ఇతర మార్కెట్లకు మరింతగా విస్తరించగలుగుతుంది. ఐబీఎమ్‌ నుంచి కొనుగోలు చేసిన సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులతో పాటు తన ఉత్పత్తులను కూడా విక్రయించుకోగలుగుతుంది. ఇలా ఈ డీల్‌ వల్ల క్రాస్‌ సెల్లింగ్‌ ప్రయోజనాలు లభిస్తాయి. అంతే కాకుండా వార్షిక ఆదాయం 65 కోట్ల మేర పెరగనున్నది. ఎబిటా మార్జిన్‌ 50 శాతం పెరుగుతుంది. ప్లాట్‌ఫార్మ్‌, ప్రొడక్ట్‌ ఆధారిత సొల్యూషన్లకు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అధిక ప్రాధాన్యత ఇస్తోందని తాజా డీల్‌ సూచిస్తోంది.  వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 12.5 రెట్ల ధర వద్ద ప్రస్తుతం ఈ షేర్‌​ట్రేడవుతోంది. ఇది కొనుగోలు చేయడానికి ఆకర్షణీయమైన ధర అని భావిస్తున్నాం. ఏడాదిలో ఈ షేర్‌ రూ.1,300 ధరకు చేరగలదని అంచనా వేస్తున్నాం. ఇది వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 16 రెట్లు అధికం. 



You may be interested

భారీ నిధులు...ఏ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి ? 

Monday 17th December 2018

ప్ర: భూమి అమ్మకం వల్ల ఒకేసారి భారీగా రూ.5 కోట్లు వచ్చాయి. దీనిని దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఎన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయమంటారు ? ఎన్ని నెలల్లో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేస్తే బావుంటుంది ? -నవకాంత్‌, హైదరాబాద్‌  జ: మీరు అడిగిన రెండు ప్రశ్నల్లో రెండో ప్రశ్న ముఖ్యమైనది.రూ. 5 కోట్ల పెట్టుబడి అంటే పెద్ద మొత్తమే. ఇది మీ రెండేళ్ల ఆదాయమైతే, ఈ మొత్తాన్ని ఒక ఏడాది

క్లిష్ట సమయాల్లోనూ స్థిరమైన పనితీరు

Monday 17th December 2018

ఇన్వెస్కో ఇండియా మిడ్‌క్యాప్‌ ఫండ్‌ మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలన్న తలంపుతో ఉన్న వారు ఇన్వెస్కో ఇండియా మిడ్‌క్యాప్‌ ఫండ్‌ పథకాన్ని పరిశీలించొచ్చు. ఈ ఏడాది మార్కెట్‌ కరెక్షన్‌లో ఈ పథకం నష్టాలను సూచీలతో పోలిస్తే తక్కువకు పరిమితం చేయడాన్ని గమనించొచ్చు. మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ సగటున 10 శాతం నష్టాలను ఇవ్వగా, ఇన్వెస్కో ఇండియా కేవలం 3.8 శాతానికే నష్టాలను తగ్గించుకుంది. ఈ పథకం మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్‌

Most from this category