STOCKS

News


సన్‌ టీవీ, యాక్సిస్‌ బ్యాంక్‌పై బుల్లిష్‌

Monday 19th November 2018
Markets_main1542605822.png-22176

సన్‌ టీవీ     
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ.608
టార్గెట్‌ ధర: రూ.835
ఎందుకంటే: ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. చందా ఆదాయం 21 శాతం వృద్ధి చెందింది. కానీ ప్రకటనల ఆదాయం 3 శాతమే పెరిగింది. మొత్తం మీద  కంపెనీ ఆదాయం 11 శాతమే వృద్ధి చెంది రూ.740 కోట్లకు పెరిగింది. ఇబిటా 12 శాతం పెరిగి రూ.550 కోట్లకు చేరింది. ఇబిటా వృద్ధి ఆరోగ్యకరంగా ఉండటం, తరుగుదల తక్కువగా ఉండటం, ఇతర ఆదాయం అధికంగా ఉండటంతో నికర లాభం 23 శాతం వృద్ధితో రూ.350 కోట్లకు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో ఆదాయం 28 శాతం, ఇబిటా 36 శాతం, నికర లాభం 42 శాతం చొప్పున పెరిగాయి. మిగిలిన ఆరు నెలల కాలానికి ప్రకటనల ఆదాయం పది శాతానికి పైగా వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. రెండేళ్లలో ఆదాయం 18 శాతం, ప్రకటనల ఆదాయం 12 శాతం, చందా ఆదాయం 19 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. గత ఆరు నెలల కాలంలో ఈ షేర్‌ 30 శాతం క్షీణించింది.దీంతో కొనుగోళ్లకు ప్రస్తుత ధర ఆకర్షణీయంగా ఉందని భావిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి కల్లా కంపెనీ పెట్టిన పెట్టుబడిపై రాబడి (ఆర్‌ఓసీఈ) 31 శాతానికి పెరగగలదని అంచనా వేస్తున్నాం. ఓవర్‌ ద టాప్‌ (ఓటీటీ) ప్లాట్‌ఫార్మ్‌పై సన్‌ నెక్స్‌ట్‌ను అందుబాటులోకి తేవడం, బెంగాలీ చానెల్‌ను ప్రారంభించనుండటం, సన్‌ లైఫ్‌ చానెల్‌ను మళ్లీ తీసుకురావడం... వీటిపై పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రతిఫలాలు ఇవ్వడానికి మరికొంత కాలం పట్టనుండటం... ప్రతికూలాంశాలు. 

యాక్సిస్‌ బ్యాంక్‌  
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌
ప్రస్తుత ధర: రూ.620
టార్గెట్‌ ధర: రూ.725
ఎందుకంటే: ప్రైవేట్‌ రంగంలోని ఈ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు బావున్నాయి. రుణ నాణ్యత మెరుగుపడింది.  ఈ క్యూ1లో రూ.4,337 కోట్లుగా ఉన్న తాజా మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.2,777 కోట్లకు తగ్గాయి. గత క్వార్టర్లను పరిగణనలోకి తీసుకుంటే ఇదే అత్యంత కనిష్ట స్థాయి. ఇటీవల రుణాల చెల్లింపుల్లో విఫలమైన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కంపెనీకి ఈ బ్యాంక్‌ ఇచ్చిన రుణాలు రూ.825 కోట్ల మేరకు ఉన్నాయి. రుణాలు 11 శాతం వృద్ధి చెంది రూ.4,56,121కోట్లకు పెరిగాయి. రిటైల్‌ రుణాలు 20 శాతం వృద్ధి చెందాయి. గత కొన్ని క్వార్టర్లుగా అంతంత మాత్రం వృద్ది సాధించిన కార్పొరేట్‌ రుణాలు 21 శాతం పెరిగాయి. నిర్వహణ లాభం 8.4 శాతం వృద్ధితో రూ.4,094 కోట్లకు పెరిగింది. నికర లాభం 82 శాతం వృద్ధితో రూ.790 కోట్లకు ఎగసింది. కేటాయింపులు తగ్గాయి.  రుణాలు, లాభదాయకత విషయంలో మూడో అతి పెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇదే. రెండేళ్లలో రుణాలు 18 శాతం చక్రగతి వృద్ధితో రూ.6,07,702 కోట్లకు పెరగగలవని అంచనా వేస్తున్నాం. మొత్తం డిపాజిట్లలో కాసా డిపాజిట్లు 48 శాతంగా ఉన్నాయి. 2018–09 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ బ్యాంక్‌ నికర వడ్డీ మార్జిన్‌ను 3 శాతానికి పైగానే సాధిస్తోంది.  వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఓఈ) 13 శాతానికి మించి ఉండగలదని, అలాగే రిటర్న్‌ ఆన్‌ అసెట్‌(ఆర్‌ఓఏ) 1.1 శాతంగా ఉండగలదని భావిస్తున్నాం. 
 



You may be interested

నిఫ్టీ మార్చి టార్గెట్‌.. 9,500

Monday 19th November 2018

నిఫ్టీ మార్చి కల్లా 9,500 పాయింట్లకు తగ్గవచ్చని యూబీఎస్‌ అంచనా వేస్తోంది. ఇన్వెస్టర్లు మార్కెట్‌ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం తేలింది.  నిఫ్టీపై ప్రభావం చూపే అంశాలు, నిఫ్టీ రేంజ్‌బౌండ్‌, మార్కెట్‌ సెంటిమెంట్‌ వంటి పలు అంశాలపై ఇన్వెస్టర్లు స్పందించారు. యూబీఎస్‌ సర్వే ప్రకారం..  ♦ సర్వేలో పాల్గొన్న దాదాపు 61 శాతం మంది ఇన్వెస్టర్లు మార్కెట్‌లో బేరిష్‌ సెంటిమెంట్‌ ఉందని తెలిపారు. గత సర్వేలో

అమెరికాను బట్టి అంచనా వేయొద్దు!

Monday 19th November 2018

ప్ర: బాండ్‌ ఫండ్స్‌ పనితీరు గత ఏడాది కాలంలో సంతృప్తికరంగా లేదు. బాండ్ల రాబడులు పెరగడం వల్ల ఈ బాండ్‌ ఫండ్స్‌ ఎలాంటి రాబడులనివ్వలేదు. కొన్నైతే నష్టాలనూ ఇచ్చాయి. ఇప్పుడైతే అమెరికాలో బాండ్ల రాబడులు స్థిరంగా ఉన్నాయి. ఈ ›ప్రభావంతో భారత్‌లో కూడా బాండ్ల రాబడులు స్థిరత్వాన్ని పొందుతాయా? ఇప్పుడు బాండ్ల ఫండ్లు మంచి రాబడులనిచ్చే అవకాశాలున్నాయా? - వినయ్‌, హైదరాబాద్‌  జ: సాధారణంగా ఇన్వెస్టర్లు ఆదాయం ఖచ్చితంగా వస్తుందనే అంచనాలుంటేనే బాండ్‌

Most from this category