STOCKS

News


కొనదగిన 2 స్టాక్స్‌

Monday 10th December 2018
Markets_main1544418299.png-22797

అరవింద్‌        కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: కోటక్‌ సెక్యూరిటీస్‌
ప్రస్తుత ధర: రూ.100
టార్గెట్‌ ధర: రూ.130
ఎందుకంటే: అరవింద్‌ కంపెనీ మూడు కంపెనీలుగా విడిపోయింది. బ్రాండెడ్‌ దుస్తులు, రిటైల్‌ వ్యాపారాన్ని అరవింద్‌ ఫ్యాషన్స్‌ లిమిటెడ్‌(ఏఎఫ్‌ఎల్‌)గా,  ఇంజినీరింగ్‌ వ్యాపారాన్ని అనుప్‌ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌(ఏఈఎల్‌)గా విడదీసింది. టెక్స్‌టైల్స్‌, అడ్వాన్స్‌ మెటీరియల్స్‌, ఇతర చిన్న వ్యాపారాలను ఆరవింద్‌ కంపెనీ చూసుకుంటుంది. డీమెర్జర్‌ ఫలితంగా మూడు లిస్టెడ్‌ కంపెనీలు తమ తమ వ్యాపార విభాగాలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తాయి. ఏఎఫ్‌ఎల్‌, ఏఈఎల్‌ కంపెనీలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కానున్నాయి. ఇక అరవింద్‌ కంపెనీ తన టెక్స్‌టైల్స్‌, అడ్వాన్స్‌ మెటీరియల్స్‌ వ్యాపారాల విస్తరణ కోసం మూడేళ్లలో రూ.1,500 ‍కోట్లు పెట్టుబడులు పెడుతున్నది. అడ్వాన్స్‌ మెటీరియల్స్‌ విభాగం- మౌలిక, ఆరోగ్య సంరక్షణ, ఇంధన, వైమానిక, పారిశ్రామిక వంటి అధిక వృద్ధి రంగాలకు అవసరమైన ఫైర్‌ ఫైటింగ్‌ జాకెట్స్‌, బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్స్‌, తదిరర ఉత్పత్తులను  అందిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం అరవింద్‌ మొత్తం ఆదాయంలో 7 శాతంగా ఉన్న ఈ విభాగం వాటా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 24 శాతానికి పెరగగలదని అంచనా వేస్తున్నాం. ఈ విభాగం నిర్వహణ మార్జిన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో 9 శాతంగా ఉంటాయని భావిస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 10 శాతం, ఎబిటా మార్జిన్‌ 1 శాతం చొప్పున వృద్ధి చెందగలవని కంపెనీ అంచనా వేస్తోంది. ఇటీవల కాలంలో టెక్స్‌టైల్స్‌ రంగం పలు సమస్యలను ఎదు‍ర్కొంది. కరెన్సీ ఒడిదుడుకులు, పత్తి ధరలు ఎగియడంతో ముడి పదార్ధాల ధరలు పెరగడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు తగ్గడం ఇవన్నీ టెక్స్‌టైల్స్‌ రంగంపై ప్రతికూల ప్రభావం చూపించాయి. అయితే అడ్వాన్స్‌ మెటీరియల్స్‌ విభాగం మంచి వృద్ధిని సాధిస్తుందనే అంచనాలున్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని. ప్రస్తుతం రూ.100గా ఉన్న ఈ కంపెనీ షేర్‌ ఏడాది కాలంలో రూ.130కు చేరగలదని అంచనా వేస్తున్నాం.

సన్‌ ఫార్మా        అట్టిపెట్టుకోండి (హోల్డ్‌)
బ్రోకరేజ్‌ సంస్థ: షేర్‌ఖాన్‌
ప్రస్తుత ధర: రూ.411
టార్గెట్‌ ధర: రూ.525

ఎందుకంటే: సన్‌ఫార్మా సమస్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ పాత ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసును తిరగతోడుతుందనే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కంపెనీకి ఇంకా ఎలాంటి సమాచారం సెబీ నుంచి అందలేదు. అయినప్పటికీ, షేర్‌ ధర బాగానే పడిపోయింది. ఈ కంపెనీ దేశీయ ఫార్ములేషన్స్‌ వ్యాపారం ఆదిత్య మెడి సేల్స్‌ (ఏఎమ్‌ఎల్‌) ద్వారా నిర్వహిస్తోంది. ఈ విషయమై కూడా ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొన్నది. దీనిని నివారించడానికి సన్‌ఫార్మా వివిధ మార్గాలను ఆన్వేషిస్తోంది. ఏఎమ్‌ఎల్‌ను కొనుగోలు చేయడం వాటిల్లో ఒకటి. ఈ కంపెనీ తన ఉద్యోగులకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,200 కోట్ల మేర రుణాలు, అడ్వాన్స్‌లను ఇచ్చింది. సాధారణ వ్యాపార కార్యకలాపాల్లో భాగంగానే ఈ రుణాలు, అడ్వాన్స్‌లు ఇచ్చామని, ఈ రుణాల కాలపరిమితి రెండు నుంచి రెండున్నర సంవత్సరాలు మాత్రమేనని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కంపెనీ వివరణ ఇచ్చింది.  ఇలాంటి నిర్వహణ సమస్యలు కంపెనీ వేల్యూయేషన్‌పై ప్రభావం చూపుతాయి. సెబీ దర్యాప్తు, తదితర అంశాలపై స్పష్టత రావలసి ఉంది. అందుకని కొత్తగా ఈ షేర్లు కొనాలనుకునేవాళ్లు కొంత కాలం వేచి చూడాలని సూచిస్తున్నాం. అలాగే ఇప్పటికే ఈ షేర్‌ను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు తక్షణం అమ్మేయకుండా హోల్డ్‌ చేయాలని సూచిస్తున్నాం. ర్యాన్‌బాక్సీ డీల్‌కు సంబంధించి ఎలాంటి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడలేదని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది.ట్రేడింగ్‌ విండో మూసివేతకు సంబంధించి స్పల్పమైన సాంకేతిక సమస్యలున్నాయని, వీటిని సెటిల్‌ చేశామని, ఈ విషయం అంతటితో ముగిసిందని వివరించింది. 

 You may be interested

5నెలల గరిష్టం వద్ద పసిడి

Monday 10th December 2018

ప్రపంచమార్కెట్లో పసిడి ధర సోమవారం 5నెలల గరిష్టస్థాయి వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతున్నాయి. నేడు ఆసియాలో భారతవర్తమాన కాల ప్రకారం ఉదయం గం.10:10ని.లకు ఔన్స్‌ పసిడి ధర 2డాలర్లు స్వల్పంగా పెరుగుదలతో 1,254.75డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నవంబర్‌ నెలలో అమెరికా ఉపాధి గణాంకాలు ఆర్థికవేత్తల అంచనాల కంటే తక్కువగా నమోదు కావడం, ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు అవకాశాలు సన్నగిల్లడం తదితర కారణాలు పసిడి ధరకు అండగా నిలుస్తున్నాయి. డాలర్‌

డైవర్సిఫికేషన్‌ కోసం ఎన్ని ఫండ్స్‌ ఉండాలి ?  

Monday 10th December 2018

ప్ర: బ్యాంక్‌ నుంచి గృహ రుణం తీసుకొని ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను.  ఈఎమ్‌ఐ ఎంత ఉండాలి? ఎంత మొత్తానికి రుణం తీసుకోవాలి  తదితర అంశాలపై నిర్ణయం తీసుకోవడానికి  ఏఏ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి ? -శ్రీధర్‌, విశాఖపట్టణం  జ: బ్యాంక్‌ నుంచి గృహ రుణం తీసుకునేటప్పుడు ముఖ్యంగా మూడు విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. గృహ రుణం ద్వారా మీరు కొనుగోలు చేసే ఇల్లు వల్ల అద్దె డబ్బులు ఆదా అవుతాయా? లేదా అనే విషయాన్ని

Most from this category