STOCKS

News


పీఐ ఇండస్ట్రీస్‌పై జియోజిత్‌ ఏమంటోంది?

Saturday 15th December 2018
Markets_main1544859873.png-22967

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ జియోజిత్‌ ఫైనాన్షియల సర్వీసెస్‌ తాజాగా పీఐ ఇండస్ట్రీస్‌ షేరును కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. 

బ్రోకరేజ్‌: జియోజిత్‌
స్టాక్‌: పీఐ ఇండస్ట్రీస్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.873

జియోజిత్‌.. పీఐ ఇండస్ట్రీస్‌ షేరుపై పాజిటివ్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.873గా నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పీఐ ఇండస్ట్రీస్‌ అమ్మకాలు వార్షికంగా చూస్తే 29 శాతం మేర పెరిగాయని పేర్కొంది. దేశీ విక్రయాలతోపాటు, ఎగుమతులు బలంగా ఉండటం ఇందుకు కారణమని తెలిపింది. అయితే అధిక వ్యయాలు, కరెన్సీ ఒడిదుడుకుల వల్ల ఈబీటా మార్జిన్లు వార్షిక ప్రాతిపదికన చూస్తే 18.6 శాతానికి తగ్గాయని పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈబీటా మార్జిన్లు మెరుగుపడొచ్చని అంచనా వేసింది. కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణ, బలమైన ఎర్నింగ్స్‌ అంచనాలు ఇందుకు కారణంగా పేర్కొంది. ఆర్డర్‌ బుక్‌ బలంగా ఉండటం, ఎగుమతుల పెరుగుదల, నూతన ప్రొడక్టుల ఆవిష్కరణ, కొత్త ప్లాంట్ల ఏర్పాటు వంటి పలు అంశాల నేపథ్యంలో రానున్న కాలంలో కంపెనీ పీఏటీలో 19 శాతం మేర వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేసింది. అందువల్ల పీఐ ఇండస్ట్రీస్‌ స్టాక్‌పై సానుకూలముగా ఉన్నామని పేర్కొంది. 



You may be interested

వర్ధమానదేశ మార్కెట్లపై విదేశీ ఇన్వెస్టర్లు శీతకన్ను

Saturday 15th December 2018

విదేశీ ఇన్వెస్టర్లు వర్ధమానదేశ మార్కెట్లలో పెట్టుబడుల విషయంలో శీతకన్ను వేస్తున్నారు. ఈ డిసెంబర్‌ ప్రారంభం నుంచి వర్ధమాన దేశ మార్కెట్ల నుంచి 600 మిలియన్‌ డాలర్ల విలువైన పెట్టుబడులను వెనక్కితీసుకున్నారు. ఎఫ్ఐఐలు వెనక్కి తీసుకున్న మొత్తం పెట్టుబడుల్లో 500 మిలియన్‌ డాలర్లు భారత్‌, తైవాన్‌ దేశాల నుంచే కావడం విశేషం. అలాగే మలేషియా, సౌత్‌కొరియా, థాయిలాండ్‌ దేశాల నుంచి రూ.100 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. యూరప్‌ దేశాల్లో

ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ను ఏం చేద్దాం?

Saturday 15th December 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తాజాగా ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ షేరును కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..  బ్రోకరేజ్‌: జియోజిత్‌ స్టాక్‌: ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ రేటింగ్‌: కొనొచ్చు టార్గెట్‌ ప్రైస్‌: రూ.276 రిటర్న్‌ అంచనా: 10 శాతం జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌.. ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌పై నమ్మకంతో ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.276గా నిర్ణయించింది. ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ స్టోరేజ్‌ బ్యాటరీ వ్యాపారంలో 60 శాతం వాటాతో

Most from this category