STOCKS

News


ఎంవోఐఎల్‌ టార్గెట్‌ ఎంత?

Saturday 1st December 2018
Markets_main1543649830.png-22564

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా ఎంవోఐఎల్‌పై బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.260గా నిర్ణయించింది. కంపెనీ ప్రస్తుత క్యూ2 ఆదాయం అంచనాలు మించిందని పేర్కొంది. అధిక విక్రయాలు ఇందుకు కారణమని తెలిపింది. ధరల పెంపు కూడా సానుకూల ప్రభావం చూపిందని పేర్కొంది. మాంగనీస్‌ ఓర్‌ విక్రయాలు వార్షికంగా 17 శాతం, త్రైమాసికంగా 28 శాతం పెరిగాయని తెలిపింది. పీఏటీ అంచనాల కన్నా కొద్దిగా తక్కువగా నమోదయ్యిందని పేర్కొంది. అధిక పన్ను రేటు ఇందుకు కారణమని తెలిపింది. కంపెనీ ప్రధానంగా కార్యకలాపాల విస్తరణ, మైనింగ్‌ సామర్థ్యం పుంపు వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించిందని పేర్కొంది. మాంగనీస్‌ ఓర్‌ ఔట్‌లుక్‌ పాజిటివ్‌గా ఉందని తెలిపింది. బలమైన బిజినెస్‌ మోడల్‌, పటిష్టమైన బ్యాలెన్స్‌ షీటు, ఆరోగ్యకరమైన లిక్విడిటీ పొజిషన్‌ వంటివి సానుకూల అంశాలని పేర్కొంది. వ్యాల్యుయేషన్స్‌ ఆమోదయోగ్యంగా ఉన్నాయని తెలిపింది. రూ.260 టార్గెట్‌ ప్రైస్‌తో స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. 

కంపెనీ పనితీరుకు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1543649838MOIL_30Nov18_Kotak_PCG_00595.pdf)

You may be interested

ఆసస్‌ కొత్త ఫోన్‌.. జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రో ఎం2

Saturday 1st December 2018

తైవాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ’ఆసస్‌’ తాజాగా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లోకి తీసుకువచ్చేందకు రెడీ అయ్యింది. డిసెంబర్‌ 11న జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రో ఎం2 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించనుంది. ఈ ఫోన్‌ కేవలం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రో ఎం2 స్మార్ట్‌ఫోన్‌లో నాచ్‌ డిస్‌ప్లే, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌-6 ప్రొటెక‌్షన్‌ వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది. అయితే మిగతా

దీర్ఘకాల పెట్టుబడికి 3 సిఫార్సులు..!

Saturday 1st December 2018

ముంబై: నిఫ్టీ ఏడాది ఫార్వార్డ్‌ బేస్‌ టార్గెట్‌ ప్రస్తుతానికి 10,250 పాయింట్లుగా నిర్ణయించినట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ వెల్లడించారు. ఇంతకుముందు ఉన్నటువంటి 10,400 పాయింట్ల టార్గెట్‌ను ఈమేరకు కుందించినట్లు ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 2019 ఆర్థిక సంవత్సర ఎర్నింగ్స్‌ వృద్ధిరేటు 12.5 శాతం, 2020 వృద్ధిరేటు 15 శాతం ఆధారంగా ఈ అంచనాను వెల్లడించారు. ఇంతకుముందు వరుసగా 15, 20

Most from this category