News


ఐటీసీ కొనచ్చు..

Monday 5th November 2018
Markets_main1541392634.png-21695

భెల్‌     అమ్మేయండి 
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ. 73
టార్గెట్‌ ధర: రూ.60
ఎందుకంటే:  విద్యుదుత్పత్తి, పారిశ్రామిక యంత్రాలను తయారు చేసే ఈ ప్రభుత్వ రంగ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈపీసీ(ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌) కార్యకలాపాలు కూడా నిర్వహించే ఈ కంపెనీ ఈ క్యూ2 ఫలితాల్లో అమ్మకాలు మినహా మరే ఇతర అంశాలు అంచనాలను అందుకోలేకపోయాయి. అమ్మకాలు 8 శాతం పెరిగి రూ.6,780 కోట్లకు చేరాయి. స్థూల మార్జిన్‌ 2 శాతం పెరిగి 41.1 శాతంగా నమోదైంది. రూ.240 కోట్ల ఎబిటా సాధించింది. అధిక వ్యయాల కారణంగా మార్జిన్‌ 3.6 శాతానికే పరిమితమైంది. తరుగుదల రూ.87 కోట్ల నుంచి 72 శాతం తగ్గి 2.1 కోట్లకు చేరింది. నిర లాభం 60 శాతం వృద్ధితో రూ.190 కోట్లకు పెరిగింది. ఈ కంపెనీ మార్జిన్‌ 6.8 శాతంగా, నికర లాభం రూ.290 కోట్లుగా ఉండగలదని అంచనా వేశాం. ఆర్డర్‌ బుక్‌ రూ.1.16 లక్షల కోట్లుగా ఉన్నప్పటికీ, ఆర్డర్ల అమలు మందకొడిగా ఉంది. ఈ ఆర్డర్లలో అధిక భాగం గత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో సాధించినవి కావడంతో, ఇవి వచ్చే ఆర్థిక సంవత్సరంలో కానీ పట్టాలకెక్కవు. ఈ కంపెనీ భారీ షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించింది. 5.16 శాతం వాటాకు సమానమైన 18.9 కోట్ల షేర్లను ఒక్కోటీ రూ.86 ధరకు కొనుగోలు చేయనున్నది. షేర్ల బైబ్యాక్‌ కోసం రూ.రూ.1,630 కోట్లు వెచ్చించనున్నది. కంపెనీ దగ్గర రూ.7,000 కోట్ల నగదు, నగదు సమానమైన నిల్వలుండటంతో ఈ షేర్ల బైబ్యాక్‌ సజావుగానే సాగిపోనున్నది. ఆర్థిక ఫలితాలు అంచనాల కంటే బలహీనంగా ఉండటం, ఆర్డర్లు కూడా బలహీనంగానే ఉండటం, ఆర్డర్ల అమలు అంతంత మాత్రంగానే ఉండటం ప్రతికూలాంశాలు.  అందుకని ఈ షేర్‌ రూ.60 ధరకు(వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు ఇది 15 రెట్లు) చేరుతుందని అంచనా వేస్తున్నాం. 


ఐటీసీ    కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌ 
ప్రస్తుత ధర: రూ. 282
టార్గెట్‌ ధర: రూ.365
ఎందుకంటే: ఐటీసీ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బావున్నాయి. వరుసగా మూడు క్వార్టర్లలో తగ్గిన సిగరెట్ల విభాగం అమ్మకాలు ఈ క్యూ1లో 1.5 శాతం పెరగ్గా,  ఈ క్యూ2లో మాత్రం 6 శాతం ఎగిశాయి. సిగరెట్ల సెగ్మెంట్‌తో పాటు వివిధ సెగ్మెంట్ల అమ్మకాలు కూడా పెరిగాయి. అమ్మకాల పరంగా చూస్తే ఎఫ్‌ఎమ్‌సీజీ 13 శాతం, వ్యవసాయ విభాగం 13 శాతం, పేపర్‌ బోర్డ్‌ 9 శాతం, హోటల్స్‌ వ్యాపారం 21 శాతం చొప్పున వృద్ది చెందాయి. నిర్వహణ లాభం 12 శాతం పెరిగి రూ.4,206 కోట్లకు పెరిగింది. అధిక నిర్వహణ లాభం కారణంగా నికర లాభం 12 శాతం పెరిగి రూ.2,955 కోట్లకు ఎగసింది. సిగరెట్లపై పన్నులు నిలకడగా ఉండటంతో ఈ ఆర్థిక సంవత్సరంలో సిగరెట్ల అమ్మకాలు పటిష్టంగా ఉండగలవని అంచనా వేస్తున్నాం. వివిధ బ్రాండ్లపై ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగిస్తుండటం, కొత్త కేటగిరీలపై జెస్టేషన్‌ వ్యయాలు వంటి ప్రతికూలాంశాలు ఉన్నప్పటికీ, ఎఫ్‌ఎమ్‌సీజీ మంచి వృద్ధినే సాధించింది. సిగరెట్ల యేతర విభాగాల ఆదాయం పెంచుకోవడానికి ఐటీసీ ప్రయత్నాలు చేస్తోంది. ఆశీర్వాద్‌, సన్‌ ఫీస్ట్‌, బింగో బ్రాండ్లను విజయవంతంగా నడిపిస్తోంది. కొత్త కేటగిరీల ఉత్పత్తులను అందుబాటులోకి తేనున్నది. హోటల్స్‌, పేపర్‌, వ్యవసాయ విభాగాలు.. వృద్ది  సాధిస్తుండటం, వర్షాలు బాగానే కురియడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాల వృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెరగనుండడం.... సానుకూలాంశాలు. రెండేళ్లలో ఆదాయం 10 శాతం, నికర లాభం 12 శాతం చొప్పున చక్రగతిన వృద్ది చెందగలవని భావిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో 38.3 శాతంగా ఉన్న ఎబిటా మార్జిన్‌ ఈ ఆర్థిక సంవత్సంరలో 39.1 శాతానికి, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 39.7 శాతానికి పెరగగలదని అంచనా వేస్తున్నాం. You may be interested

రాబడులు మెరుగ్గా ఉండాలనుకుంటే...

Monday 5th November 2018

హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌ 100  ప్రస్తుతం మార్కెట్లో అస్థిరతలు, ప్రతికూల రాబడుల సమయంలోనూ మంచి ప్రతిఫలాన్ని ఆశించే వారు... గతం నుంచీ పనిచేస్తూ పనితీరు పరంగా పేరున్న పథకాలను ఎంచుకోవడం మంచి ఆలోచనే అవుతుంది. ఆ విధంగా చూసినప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌-100 ముందు వరుసలో ఉంటుంది. సెబీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో మార్పుల జరక్కముందు... ఈ ఏడాది మే వరకు హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌-200 పేరుతో కొనసాగింది. హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌-100 ప్రధానంగా లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో

క్షీణించిన రూపాయి

Monday 5th November 2018

ఇండియన్‌ రూపాయి సోమవారం బలహీనపడింది. ఆసియా కరెన్సీలు నష్టపోవడం, అమెరికా-చైనా ట్రేడ్‌ డీల్‌పై నెలకొన్న ఊహాగానాలు, అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాల కన్నా బాగుండటం వంటి అంశాలు ఇందుకు కారణం. ఉదయం 9:05 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.78 వద్ద ట్రేడవుతోంది. రూపాయి తన శుక్రవారం ముగింపు 72.44తో పోలిస్తే 0.52 శాతం నష్టపోయింది. రూపాయి సోమవారం 72.88 వద్ద ప్రారంభమైంది.   భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌

Most from this category