News


హెచ్‌పీసీఎల్‌ షేరుపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరీటీస్‌ బుల్లిష్‌

Thursday 13th September 2018
Markets_main1536827251.png-20240

ముంబై:- ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థ హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) షేరుపై ప్రముఖ రేటింగ్‌ సం‍స్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సం‍స్థ బుల్లిష్‌గా ఉంది. షేరుకు ఉన్న బలమైన వాల్యూవేషన్స్‌ కారణంగా షేరుకు ‘‘బై’’కు కేటాయించినట్లు రేటింగ్‌ సం‍స్థ చెబుతోంది. హెచ్‌పీసీఎల్‌ షేరుపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీష్‌ విశ్లేషణలేమిటో ఇప్పుడు చూద్దాం...
సెక్టార్‌:- రీఫైనరీ సెక్టార్‌
ప్రస్తుత షేరు ధర:- రూ. 233.50
టార్గెట్‌ ధర:- రూ.476
విశ్లేషణ:- హెచ్‌సీఎల్‌సీఎల్‌ షేరు పెరిగిన పెట్రోల్‌, డిజిల్‌ ధరల కారణంగా గతేడాది ఆగస్ట్‌ నుంచి ఈ ఏడాది ఆగస్ట్‌ వరకు కాలంలో షేరు మొత్తం 48% పతనమైంది. ప్రస్తుతం షేరు ధర రూ.233.50ల వద్ద ఉంది. షేరుకు ఉన్న బలమైన వాల్యూవేషన్స్‌తో పోలిస్తే షేరు అండర్‌వాల్యూవేషన్‌తో ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనావేసింది. వివిధ రిఫైనరీలు, పెట్రో కెమికల్స్‌, మార్కెటింగ్‌, పైప్‌లైన్‌లు, నేచురల్‌ గ్యాస్‌ తదితర విభాగాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.8,400 కోట్ల మేర పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ త్రైమాసిక ఫలితాల ప్రకటన సందర్భంగా తెలిపింది. ఇక త్రైమాసికంలో పెరిగిన ఇన్వెంటరీ లాభాలు, ఒన్‌ - ఆఫ్‌ కాస్ట్స్ కారణంగా ఈ క్యూ1 కంపెనీ ఎబిటా 1.34శాతం, పీఏటీ(ప్రాఫిట్‌ ఆఫ్టర్‌ టాక్స్‌) 2.7శాతం వృద్ధిని సాధించింది. ఈ క్యూ1లో అద్భుతమైన పనితీరు కారణంగా రిఫైనరీ, మార్కెటింగ్‌ వ్యాపారాల్లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తోంది. ఎన్‌జీసీకి చెందిన మంగళూర్‌ రిఫైనరీ పెట్రోలియం లిమిటెడ్‌లో వ్యూహాత్మక వాటా కొనుగోలుతో కంపెనీ సబ్సీడరీ భారం తగ్గుదల, వ్యయ నియంత్రణలు  మాత్రమే కంపెనీకి అదనపు ఆదాయాన్ని సమకూర్చతుందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. అయితే ఆ వాటా కొనుగోలు ఇంకా పూర్తికాలేదు. సానుకూలాంశాల నేపథ్యంలో హెచ్‌పీసీఎల్‌ షేరుకు కేటాయించిన రూ.476ల టార్గెట్‌ ధరను కేవలం సంవత్సరంలోగా చేరుకుంటుందని హెచ్‌డీఎఫ్‌సీ విశ్వసిస్తుంది.

(కంపెనీ వివరాలు, పనితీరు సంబంధిత ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...)

View Pdf One (1536827507HPCL_-_ARA_-_HDFC_sec.pdf)

You may be interested

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌.. ఏ బ్యాంకులకు సమస్య?

Thursday 13th September 2018

ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌’ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌) గ్రూప్‌కు మీ బ్యాంక్‌ ఏమైనా భారీగా అప్పులిచ్చిందేమో చూడండి. ఇది దివాలా అంచుకు చేరుకుంది. దీంతో ఇచ్చిన మొత్తం తిరిగి రాకపోవచ్చు. ఇటీవలే రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా దీనికి ‘చెత్త’ రేటింగ్‌ ఇచ్చింది. దీంతో గ్రూప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసిన మ్యూచువల్‌ ఫండ్స్‌ ఏం చేయాలో తెలియక జట్టుపట్టుకుంటున్నాయి. రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ వల్ల దాదాపు

బ్రెంట్‌ @ 80 డాలర్లు

Thursday 13th September 2018

బ్రెంట్‌ క్రూడ్‌ ధర బుధవారం మళ్లీ బ్యారెల్‌కు 80 డాలర్లను తాకింది. ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర మే 22 నుంచి చూస్తే ఈ మార్క్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా సరఫరా తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. లండన్‌ మార్కెట్‌లో బ్రెంట్‌ ఫ్యూచర్స్‌ ధర బుధవారం ఒకానొక సమయంలో 80.13 డాలర్ల స్థాయికి పెరిగింది. అలాగే అమెరికా క్రూడ్‌ బెంచ్‌మార్క్‌ డబ్ల్యూటీఐ క్రూడ్‌ కూడా 70.98 డాలర్లకు ఎగసింది. ఇరాన్‌ను

Most from this category