STOCKS

News


ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌కు ‘బై’ రేటింగ్‌

Saturday 20th October 2018
Markets_main1540030560.png-21324

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..

బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి
స్టాక్‌: ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌
ఇండస్ట్రీ: హెల్త్‌కేర్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.718
టార్గెట్‌ ప్రైస్‌: రూ.879

ఆనంద్‌రాఠి.. ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌పై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. బై రేటింగ్‌ ఇచ్చింది. దేశీ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ అయిన ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌ ప్రధానంగా జీవనశైలి సంబంధిత రుగ్మతల చికిత్సలకు అవసరమైన ప్రొడక్టుల తయారీపై దృష్టి కేంద్రీకరించిందని పేర్కొంది. కంపెనీ 2018-2021 ఆర్థిక సంవత్సరాల్లో చక్రగతిన రెవెన్యూలో 19 శాతం, పీఏటీలో 20 శాతం వృద్ధిని సాధించొచ్చని అంచనా వేసింది. కంపెనీ దీర్ఘకాలిక, క్రిటికల్‌ వ్యాధుల చికిత్సకు అవసరమైన ప్రొడక్టులపై దృష్టి పెట్టడం సానుకూల అంశమని, దీని వల్ల మంచి వృద్ధి నమోదవుతుందని, మార్జిన్లు కూడా పెరుగుతుతాయని పేర్కొంది. రెవెన్యూలో బలమైన వృద్ధిని అంచనా వేస్తున్నామని, ఈబీటా మార్జిన్లు బాగుంటాయని, ప్రాఫిట్‌ బాగా పెరగొచ్చని తెలిపింది. వేగవంతమైన వృద్ధికి అవకాశమున్న విభాగాలకు ప్రాధాన్యమివ్వడం, ఆరోగ్యకరమైన బ్యాలెన్స్‌ షీటు, నిర్వహణ మార్జిన్లు బలంగా ఉండటం వంటి అంశాల నేపథ్యంలో ఈ స్టాక్‌ను రూ.879 టార్గెట్‌ ప్రైస్‌తో కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎన్‌ఎల్‌ఈఎం కింద ఎక్కువ ప్రొడక్టులు ఉండటం, అమలులో జాప్యం, పోటీతత్వం వంటివి రిస్క్‌ అంశాలని తెలిపింది. 

కంపెనీ వివరాలు, పనితీరు సంబంధిత ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1540030579ERIS_IC_171018.pdf)

You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్యు2 ఫలితాలు... ఏం చూడాలి?

Saturday 20th October 2018

శనివారం దేశీయ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించనుంది. ఈ దఫా బలమైన లోన్‌గ్రోత్‌ను బ్యాంకు నమోదు చేస్తుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. లాభాల్లో 17- 21 శాతం పెరుగుదల ఉండొచ్చని భావిస్తున్నారు. వడ్డీ వ్యయాల కారణంగా మార్జిన్లు కుంచించుకుపోవచ్చని, అయితే ఆస్తుల నాణ్యత మాత్రం స్థిరంగా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. శుక్రవారం షేరు దాదాపు అరశాతం నష్టంతో క్లోజయింది.  - మోతీలాల్‌ ఓస్వాల్‌: బ్యాంకు లోన్‌గ్రోత్‌

డీసీబీ బ్యాంక్‌పై బుల్లిష్‌..

Saturday 20th October 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా డీసీబీ బ్యాంక్‌పై పాజిటివ్‌గా ఉంది. ఎందుకో చూద్దాం..  బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌: డీసీబీ బ్యాంక్‌ ఇండస్ట్రీ: బ్యాంక్స్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.157 టార్గెట్‌ ప్రైస్‌: రూ.209 హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. డీసీబీ బ్యాంక్‌పై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఆకర్షణీయ ఫలితాలను వెల్లడించిందని పేర్కొంది. మరీముఖ్యంగా రుణ నాణ్యత స్థిరంగా కొనసాగించిందని

Most from this category