ఆల్‌కార్గొ లాజిస్టిక్స్‌కు బై రేటింగ్
By Sakshi

ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ కోటక్ సెక్యూరిటీస్ తాజాగా ఆల్‌కార్గొ లాజిస్టిక్స్ స్టాక్‌పై బుల్లిష్‌గా ఉంది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్: కోటక్ సెక్యూరిటీస్ కోటక్ సెక్యూరిటీస్.. ఆల్‌కార్గొ లాజిస్టిక్స్‌పై పాజిటివ్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్ ప్రైస్‌ను రూ.145గా నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో కంపెనీ ఆరోగ్యకరమైన పనితీరు కనబర్చిందని పేర్కొంది. రానున్న కాలంలో మంచి పనితీరు కనబర్చవచ్చని అంచనా వేసింది. కంటైనర్ వ్యాపారం బలహీనంగా ఉండటం వల్ల మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ ఆపరేషన్స్ (ఎంటీవో) విభాగంలో మార్జిన్లపై ఒత్తిడి నెలకొందని పేర్కొంది. అయితే ఎంటీవో విభాగంలో మంచి వృద్ధి నమోదయ్యిందని పేర్కొంది. ప్రాజెక్ట్ లాజిస్టిక్స్ అండ్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్ డివిజన్స్ (పీఈడీ) విభాగం నిరుత్సాహానికి గురిచేసిందని, దీని వల్ల కంపెనీ లాభదాయకతపై ప్రతికూల ప్రభావం పడిందని తెలిపింది. అలాగే కాంట్రాక్ట్ లాజిస్టిక్స్ డివిజన్ కూడా సరైన పనితీరు కనబర్చడం లేదని పేర్కొంది. అయితే కంపెనీ ప్రస్తుతం ప్రాజెక్ట్ ట్రాన్స్‌పోర్టేషన్ విభాగంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందని తెలిపింది. అలాగే ఇతర సమీప దేశాల్లో అవకాశాలను అన్వేషిస్తోందని పేర్కొంది. అందువల్ల రూ.145 టార్గెట్ ప్రైస్‌తో స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. కంపెనీ పనితీరుకు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి...
స్టాక్: ఆల్‌కార్గొ లాజిస్టిక్స్
రేటింగ్: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.105
టార్గెట్ ప్రైస్: రూ.145
You may be interested
రికమండేషన్ అష్టపది
Saturday 8th December 2018వచ్చే సంవత్సర కాలానికి మంచి రాబడిని అందించే షేర్లు ఎనిమిది రంగాల్లో లభిస్తాయని కోటక్ సెక్యూరిటీస్ చెబుతోంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈ రంగాలను, వీటిలోని నాణ్యమైన స్టాకులను ఎంచుకోవాలని సూచిస్తోంది. 1. అటోమొబైల్స్: క్రూడాయిల్ ధరలు తగ్గడం బాగా కలిసిరానుంది. చాలా స్టాకులు ఆకర్షణీయమైన వాల్యూషన్లకు చేరుతున్నాయి. ముడిపదార్ధాల ధరల్లో స్థిరత్వం వస్తే మరింత దూసుకుపోనుంది. 2. ఆటో విడిభాగాలు: విడిభాగాల డిమాండ్, వాల్యూంల్లో వృద్ది ఆరోగ్యకరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టైర్ల కంపెనీల
జెన్సర్ టెక్నాలజీస్‌పై పాజిటివ్
Saturday 8th December 2018ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ కోటక్ సెక్యూరిటీస్ తాజాగా జెన్సర్ టెక్నాలజీస్ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్: కోటక్ సెక్యూరిటీస్ స్టాక్: జెన్సర్ టెక్నాలజీస్ రేటింగ్: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.230 టార్గెట్ ప్రైస్: రూ.257 కోటక్ సెక్యూరిటీస్.. జెన్సర్ టెక్నాలజీస్‌పై సానుకూలముగా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్ ప్రైస్‌ను రూ.257గా నిర్ణయించింది. కంపెనీ తన ఆర్వోడీ నెక్ట్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా డిజిటల్ విభాగంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందని, ఈ