STOCKS

News


బీఎఫ్‌ఎస్‌ఐ కంపెనీల క్యు2 ఫలితాలు ఎలా ఉండొచ్చు?

Saturday 20th October 2018
Markets_main1540033041.png-21327

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషణ

వడ్డీరేట్ల పెరుగుదల, లిక్విడిటీ తరుగుదల, క్రెడిట్‌ డిమాండ్‌ కాస్త ఊపందుకోవడం, డిఫాల్టింగ్‌లు.. క్యు2లో బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్స్యూరెన్స్‌ రంగం(బీఎఫ్‌ఎస్‌ఐ)లో చోటు చేసుకున్న ప్రధాన అంశాలు. రెండో త్రైమాసికంలో బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో రిటైల్‌పై ఎక్కువ ఫోకస్‌ ఉన్న కంపెనీలు మంచి ఫలితాలు ప్రకటించవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. ముఖ్యంగా రిటైల్‌ ప్రైవేట్‌ బ్యాంకులపై పాజిటివ్‌గా ఉన్నట్లు తెలిపింది.

మొండిపద్దులు తక్కువగా ఉండి, ఆరోగ్యవంతమైన బీ/ఎస్‌ ఉన్న బ్యాంకులను ఎంచుకోవాలని సూచించింది. కోటక్‌ మహీంద్రా, ఆర్‌బీకే, సీయూబీకే, డీసీబీబీ కంపెనీలపై పాజిటివ్‌ అంచనాలున్నాయని తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంకుకు త్వరలో రీరేటింగ్‌ రావచ్చని అభిప్రాయపడింది. ఫైనాన్షియల్‌ కంపెనీలకు సమీప భవిష్యత్‌లో గడ్డుకాలం కనిపిస్తోందని అంచనా వేసింది. దీర్ఘకాలిక పెట్టుబడులకు బీమా కంపెనీల షేర్లు మంచివని సూచించింది. ఈ విభాగంలో ఎస్‌బీఐలైఫ్‌, మాక్స్‌ను ఎంచుకోవచ్చని సూచించింది. 


మరిన్నివివరాలకు కింద ఇచ్చిన పీడీఎఫ్‌ లింక్‌ను క్లిక్‌ చేయండి...

View Pdf One (1540033112BFSI Sector Q2FY19 Results Preview by HDFC Secutiries.pdf)

You may be interested

గట్టి మద్దతు కోసం నిఫ్టీ యత్నాలు

Saturday 20th October 2018

వచ్చే వారం మార్కెట్లపై విశ్లేషణ గతవారం మార్కెట్లు ఆటుపోట్ల నడుమ ఊగిసలాడాయి. వారం ఆరంభంలో సాధించిన లాభాలన్నీ చివరకు వచ్చేసరికి ఆవిరయ్యాయి. అంతకుముందు భావించినట్లే నిఫ్టీ ఈ వారంలో 10700 పాయింట్ల వరకు పుల్‌బ్యాక్‌ చూపింది. అయితే వెనువెంటనే అక్కడనుంచి వేగంగా వెనక్కువచ్చింది. మొత్తం మీద నిఫ్టీ వారాన్ని దాదాపు 170 పాయింట్ల నష్టంతో ముగించింది. అయితే వారం చార్టుల్లో హయ్యర్‌ హై, హయ్యర్‌ లో ఏర్పరిచింది. కొత్తవారంలో నిఫ్టీ ఎక్స్‌పైనీ

రిలయన్స్‌ టార్గెట్‌ @ 1,303

Saturday 20th October 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరుపై ధీమాగానే ఉంది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రేటింగ్‌: కొనొచ్చు ఇండస్ట్రీ: ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ప్రస్తుత ధర: రూ.1,101 టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,303 హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై పాజిటివ్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ప్రకటించిన ఎర్నింగ్స్‌ను గమనిస్తే.. తన నిర్వహణ సామర్థ్యాన్ని

Most from this category