STOCKS

News


అపోలో టైర్స్‌పై ఆనంద్‌రాఠి బుల్లిష్‌

Thursday 9th August 2018
Markets_main1533806779.png-19101

బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి
స్టాక్‌: అపోలో టైర్స్‌
ఇండస్ట్రీ: ఆటో
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర రూ.270
టార్గెట్‌ ప్రైస్‌: రూ.314

బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి.. అపోలో టైర్స్‌పై బుల్లిష్‌గా ఉంది. దీర్ఘకాలంలో మంచి రాబడి అందుకోవచ్చని అంచనా వేస్తోంది. స్టాక్‌పై బై కాల్‌ను కొనసాగిస్తోంది. ట్రక్స్‌ టైర్లలో బలమైన డిమాండ్‌ నమోదవ్వడం, సామర్థ్యం పెంపు, యూరోపియన్‌ వ్యాపారం పుంజుకోవడం, కార్యకలాపాల విస్తరణ, ఆదాయ వృద్ధి అంచనాలు ఇందుకు కారణంగా పేర్కొంది. అదే సమయంలో రబ్బరు ధరలు అధికంగా ఉండటం, సామర్థ్యం పెంపు అంచనాల కన్నా నెమ్మదిగా ఉండటం వంటివి ప్రతికూల అంశాలని తెలిపింది. 

కంపెనీ పనితీరు, ఆదాయ వ్యయాలు వంటి ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1533806857APTY_CU_020818.pdf)

You may be interested

మెరుస్తున్న మెటల్‌ షేర్లు

Thursday 9th August 2018

ముంబై:- హెవీ వెయిట్‌ షేర్ల ర్యాలీ గురువారం ఎన్‌ఎస్‌ఈ మెటల్‌ సూచి వెలుగులు విరజిమ్ముతోంది. నేడు ఎన్‌ఎస్‌ఈలోని మెటల్‌ ఇండెక్స్‌ 3,476 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో లోహ రంగ దిగ్గజాలైన కోల్‌ ఇండియా (2 శాతం) హిందాల్కో(4 శాతం), వేదాంత(3 శాతం), టాటా స్టీల్‌ (2 శాతం) షేర్లు లాభపడంతో మెటల్‌ ఇండెక్స్‌ 2శాతం ర్యాలీ చేసింది. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(3,453.60)తో పోలిస్తే 1.50శాతం

ఐసీఐసీఐ బ్యాంక్‌కు మోర్గాన్‌స్టాన్లీ బూస్ట్‌

Thursday 9th August 2018

దేశీయ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్‌ గురువారం ట్రేడింగ్‌లో సుమారు 8 శాతం దూసుకుపోయింది. అంతర్జాతీయ బ్రోకింగ్‌ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ తాజాగా ఐసీఐసీఐ బ్యాంకును తోటి బ్యాంకుల్లో మేటిగా అభివర్ణించింది. దీంతో ఒక్కసారిగా బ్యాంకు కౌంటర్లో కొనుగోళ్లు జోరందుకున్నాయి. బ్యాంకు మొండిపద్దుల విషయమై స్పష్టత రావడంతో షేరుపై ఇన్వెస్టర్లు మక్కువ చూపారు. వార్షిక నివేదికలో తమ బ్యాడ్‌ లోన్స్‌, ఎన్‌పీఏల గురించి పూర్తి వివరాలు పొందుపరిచనట్లు బ్యాంకు తెలిపింది.

Most from this category