STOCKS

News


ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌పై ఆనంద్‌రాఠి బుల్లిష్‌

Thursday 8th November 2018
Markets_main1541662587.png-21791

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..

బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి
స్టాక్‌: ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.187
టార్గెట్‌ ప్రైస్‌: రూ.239

ఆనంద్‌రాఠి.. ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌పై పాజిటివ్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. బై రేటింగ్‌ను కొనసాగించింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.239గా నిర్ణయించింది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (క్యూ2, జూలై-సెప్టెంబర్‌)లో అదిరిపోయే ఫలితాలను ప్రకటించిందని పేర్కొంది. టర్న్‌అరౌండ్‌ అయ్యిందని తెలిపింది. ఈబీటా 62 శాతం, ఆదాయం 10 శాతం పెరిగిందని పేర్కొంది. ఇక నికర లాభం రూ.43 కోట్లుగా నమోదయ్యిందని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో కంపెనీ 10 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించిందని గుర్తుచేసింది. అన్ని వ్యాపార విభాగాల్లో మెరుగుదల ఇందుకు కారణమని పేర్కొంది. రానున్న కాలంలోనూ ఇదే ట్రెండ్‌ కొనసాగవచ్చని అంచనా వేసింది. నెట్‌వర్క్‌ విస్తరణ, ప్రొడక్ట్‌ ఇన్నోవేషన్‌, వ్యయ నియంత్రణ వంటివి సానుకూల అంశాలని తెలిపింది. తీవ్రమైన పోటీ కారణంగా ఆదాయ వృద్ధి తగ్గొచ్చని పేర్కొంది.

కంపెనీ పనితీరుకు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1541662596ABFRL_CU_031118.pdf)

You may be interested

ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌పై సెంట్రమ్‌ పాజిటివ్‌

Thursday 8th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ వెల్త్‌ రీసెర్చ్‌ తాజాగా ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌ స్టాక్‌పై పాజిటివ్‌గా ఉంది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: సెంట్రమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ స్టాక్‌: ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌ రేటింగ్‌: ఔట్‌ఫర్ఫార్మర్‌ ప్రస్తుత ధర: రూ.136 టార్గెట్‌ ప్రైస్‌: రూ.175 అప్‌సైడ్‌ అంచనా: 30 శాతం సెంట్రమ్‌.. ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌పై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఔట్‌పర్ఫార్మర్‌ రేటింగ్‌ ఇచ్చింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.175గా నిర్ణయించింది. అంటే ప్రస్తుత ధరతో

దశాబ్దం కాలం తరువాత భారీ లాభాలు

Thursday 8th November 2018

దాదాపు దశాబ్దం కాలం తరువాత ముహూరత్ ట్రేడింగ్‌లో సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. ఈ ఏడాది సంవత్‌ 2075 ప్రారంభపు రోజు జరిగిన ముహూరత్ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 245 పాయింట్లు(0.70 శాతం) లాభపడి 35,237 వద్ద, నిఫ్టీ 68 పాయింట్ల (0.65శాతం) లాభంతో 10,598 వద్ద ముగిసింది. 2008 దీపావళి(సంవత్‌ 2065) ముహూరత్‌ ట్రేడింగ్‌ తర్వాత అంటే దాదాపు దశాబ్ధం తరువాత సూచీలు గత ఇంత భారీ ఎత్తున లాభపడటం

Most from this category