STOCKS

News


ఎంఎం ఫోర్జింగ్స్‌పై బుల్లిష్‌

Saturday 22nd September 2018
Markets_main1537597155.png-20478

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా ఎంఎం ఫోర్జింగ్స్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..

బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి
స్టాక్‌: ఎంఎం ఫోర్జింగ్స్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.588
టార్గెట్‌ ప్రైస్‌: రూ.809

బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి.. ఎంఎం ఫోర్జింగ్స్‌పై పాజిటివ్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.809గా నిర్ణయించింది. బై రేటింగ్‌ ఇచ్చింది. ఎంఎం ఫోర్జింగ్స్‌.. తను కార్యకలాపాలు అందించే విభాగంలో పెద్ద కంపెనీగా అవతరించడానికి ప్రయత్నిస్తోందని తెలిపింది. దీనికోసం వచ్చే రెండేళ్ల కాలంలో అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని భావిస్తోందని పేర్కొంది. గత నాలుగేళ్లుగా స్థిర వృద్ధిని నమోదు చేస్తున్న ఎగుమతుల్లో మళ్లీ బలమైన వృద్ధి నమోదవుతుందనే అంచనాలున్నాయని తెలిపింది. కంపెనీ వివిధ కొత్త ప్రొడక్టులను మార్కెట్‌లోకి తీసుకువస్తోందని, అందువల్ల వచ్చే రెండేళ్ల కాలంలో దేశీ వ్యాపారంలో గణనీయమైన వృద్ధి ఉంటుందని పేర్కొంది. ఆదాయ వృద్ధి నేపథ్యంలో లాభదాయకత కూడా పెరుగుతుందని తెలిపింది. ఎగుమతులు పుంజుకోవడం, దేశీ వ్యాపారంలో మెరుగైన వృద్ధి కారణంగా వచ్చే రెండేళ్ల కాలంలో ఆదాయంలో 36 శాతం వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేసింది. అలాగే ఎర్నింగ్స్‌ వృద్ధి 38 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. అందువల్ల రూ.809 టార్గెట్‌ ప్రైస్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఇక ఎంఅండ్‌హెచ్‌ సీవీ విక్రయాలు తగ్గడం, అమెరికాలో క్లాస్‌ 8 ట్రక్స్‌ విక్రయాల క్షీణత రిస్క్‌ అంశాలని పేర్కొంది. 


కంపెనీ వివరాలు, పనితీరు సంబంధిత ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1537597166MMFC_IC_190918.pdf)

You may be interested

వారం కనిష్ట ధర వద్ద ముగిసిన పసిడి

Saturday 22nd September 2018

ప్రపంచమార్కెట్లో పసిడి ధర ఈవారం చివరి రోజైన శుక్రవారం ‘‘వారం కనిష్ట ధర’’ వద్ద స్ధిరపడింది. బ్రెగ్జిట్‌ అందోళనలతో పాటు, వాణిజ్యయుద్ధ భయాలు మరోసారి తెరపైకి రావడం, ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు అంచనాలు బలపడటం ఇందుకు కారణమయ్యాయి.  అమెరికా మార్కెట్లో శుక్రవారం రాత్రి ఔన్స్‌ పసిడి 10.30డాలర్ల నష్టపోయి 1201.30 డాలర్ల వద్ద ముగిసింది. బ్రిటన్‌ ప్రధాని థెరిస్సా మే శుక్రవారం ‘‘బ్రిటన్‌ ఐరోపా కూటమి నుంచి వైదొలగే ప్రక్రియకు

వావ్‌.. త్రీడీ వాల్‌

Saturday 22nd September 2018

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాన గది, పిల్లల గది, పడక గది... ఏదైనా సరే గదిలోని ఒక వైపు గోడకు వాల్‌ పేపర్‌తో ముస్తాబు చేసుకుంటే.. మన ఇంటికొచ్చే బంధుమిత్రులు, అతిథులు వావ్‌ అంటారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా.. వాల్‌ పేపర్లలోనూ సరికొత్త పోకడలు సంతరించుకున్నాయి. ఇందులో భాగంగానే మార్కెట్లో త్రీడీ వాల్‌ పేపర్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటి నిర్వహణలో కాస్త శ్రద్ధ చూపిస్తే చాలు దశాబ్ధ కాలంపాటు మన్నికగా

Most from this category