STOCKS

News


ఇమామి...కొనొచ్చు-ఆనంద్‌ రాఠి

Thursday 8th November 2018
Markets_main1541671080.png-21796

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా ఇమామి స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..

బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి
స్టాక్‌: ఇమామి
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.421
టార్గెట్‌ ప్రైస్‌: రూ.595

ఆనంద్‌రాఠి.. ఇమామిపై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.595గా నిర్ణయించింది. కీలకమైన వ్యాపారాలపై దృష్టి కేంద్రీకరించడం, పలు ఉత్పత్తుల రి-లాంచ్‌, మార్కెట్‌ వాటా పెంపు, గ్రామీణ ప్రాంతాల్లో విస్తరణ, కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణ, మేనేజ్‌మెంట్‌ తీసుకుంటున్న చర్యల కారణంగా కంపెనీ బౌన్స్‌బ్యాక్‌ అవుతుందని విశ్వాసం వ్యక్తంచేసింది. స్వల్ప కాలంలో మార్జిన్లపై ఒత్తిడి నెలకొన్నప్పటికీ.. వ్యయ నియంత్రణ, ధరల పెంపు, డైవర్సిఫైడ్‌ పోర్ట్‌ఫోలియో వల్ల 2019-2020 ఆర్థిక సంవత్సరంలో మార్జిన్లలో మెరుగుదల ఉంటుందని అంచనా వేసింది. స్టాక్‌కి బై రేటింగ్‌ ఇచ్చింది. మంచి బ్రాండ్‌ పేరు సానుకూల అంశమని తెలిపింది. హోల్‌సేల్‌ విభాగం స్థిరీకరణకు అంచనాల కన్నా ఎక్కువ సమయం పట్టడం,  మెన్‌థాల్‌ ధరలు పెరగడం, కొత్త ప్రొడక్టులను తీసుకురావడంలో విఫలమవ్వడం వంటివి రిస్క్‌ అంశాలని తెలిపింది.

కంపెనీ పనితీరుకు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

 

 

View Pdf One (1541671115HMN_CU_051118.pdf)

You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌..

Friday 9th November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:33 సమయంలో 34 పాయింట్ల నష్టంతో 10,581 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,614 పాయింట్లతో పోలిస్తే 33 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ శుక్రవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఇక

ఓఎన్‌జీసీకి హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ బై రేటింగ్‌

Thursday 8th November 2018

ముంబై:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించిన ప్రభుత్వ రంగ సం‍స్థ ఆయిల్‌ అండ్‌ న్యాచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) షేరుకు ప్రముఖ రేటింగ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది. చమురు, సహజ వాయువు ఉత్పత్తి రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఓఎన్‌జీసీ కంపెనీ షేరుపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషణలు ఇలా ఉన్నాయి... రంగం:- చమురు ఉత్పత్తి, శుద్ధి రేటింగ్‌:- కొనవచ్చు టార్గెట్‌ ధర:-  రూ.182 క్యూ2 ఫలితాలు:- అంతర్జాతీయంగా చమురు

Most from this category