News


ఫినొలెక్స్‌ కేబుల్స్‌పై పాజిటివ్‌

Tuesday 20th November 2018
Markets_main1542697260.png-22221

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా ఫినొలెక్స్‌ కేబుల్స్‌పై పాజిటివ్‌గా ఉంది. ఎందుకో చూద్దాం..

బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి
స్టాక్‌: ఫినొలెక్స్‌ కేబుల్స్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.476
టార్గెట్‌ ప్రైస్‌: రూ.598

ఆనంద్‌రాఠి.. ఫినొలెక్స్‌ కేబుల్స్‌పై బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.598గా నిర్ణయించింది. కంపెనీ ప్రస్తుత క్యూ2లో నిరుత్సాహ ఫలితాలను ప్రకటించిందని తెలిపింది. పీఏటీ వార్షికంగా 7 శాతం తగ్గిందని పేర్కొంది. రెవెన్యూ వృద్ధిలో వార్షికంగా పురోగతి లేదని కేవలం 2 శాతంగా నమోదయ్యింది తెలిపింది. ఈబీటా మార్జిన్లు కూడా తగ్గాయని పేర్కొంది. అందువల్ల ఎర్నింగ్స్‌ అంచనాలను తగ్గిస్తున్నామని తెలిపింది. కొత్త ప్రొడక్టులు, జేవీల్లో మెరుగుదల, కోర్‌ బిజినెస్‌ ఎర్నింగ్స్‌ వృద్ధి వంటి అంశాలపై ఆధారపడి తదుపరి రి-రేటింగ్‌ ఉంటుందని తెలిపింది. సరఫరా అడ్డంకులు, కమోడిటీ ధరల్లో ఒడిదుడుకులు క్యూ2 ఫలితాలపై ప్రభావం చూపాయని పేర్కొంది. ఇకపోతే కంపెనీకి రుణ భారం లేదని తెలిపింది. ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌, కొత్త ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ వల్ల వృద్ధి సాధ్యమౌతుందని తెలిపింది. డైవర్సిఫైడ్‌ బిజినెస్‌, మార్కెట్‌లో లీడర్‌షిప్‌ పొజిషన్‌, బలమైన బ్యాలెన్స్‌ షీట్‌ వంటివి సానుకూల అంశాలని పేర్కొంది. కాపర్‌ ధరల్లో ఒడిదుడుకులు, పోటీతత్వం, డిమాండ్‌ మందగమనం వంటివి రిస్క్‌ అంశాలని తెలిపింది. 

కంపెనీ పనితీరుకు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1542697281FNXC_CU_161118.pdf)

You may be interested

10 లార్జ్‌క్యాప్‌ సిఫార్సులు.. 40% వరకు రాబడి..!

Tuesday 20th November 2018

ముంబై: ఆగస్టులో నమోదైన జీవితకాల గరిష్టస్థాయి నుంచి చూస్తే.. సూచీలు ఇప్పటికీ 9 శాతం నష్టాల్లో ఉన్నాయి. తాజా కరెక్షన్‌లో అనేక నాణ్యమైన షేర్లు 52-వారాల గరిష్టస్థాయి దిగువకు పడిపోయాయి. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ తరహా షేర్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆకర్షణీయ లాభాలను పొందవచ్చని మోతిలాల్ ఓస్వాల్ సూచిస్తోంది. నాణ్యమైన షేర్ల జాబితాలోని 10 లార్జ్‌క్యాప్‌ షేర్లు 52-వారాల గరిష్టస్థాయి నుంచి 27 శాతం పడిపోగా.. వీటిలో

భారత్‌పై అండర్‌వెయిట్‌..

Tuesday 20th November 2018

భారత్‌ మార్కెట్‌పై ప్రస్తుతం అండర్‌వెయిట్‌తో ఉన్నామని జులియస్‌ బేర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మార్క్‌ మాథ్యూస్‌ తెలిపారు. ఈ ఏడాది ఇండియన్‌ మార్కెట్లు కరెక‌్షన్‌కు గురైనా కూడా.. చైనా, ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే ఇంకా వ్యాల్యుయేషన్స్‌ ఎక్కువగానే ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.  వర్ధమాన మార్కెట్లు ప్రస్తుతం పడిపోయాయని మార్క్‌ మాథ్యూస్‌ తెలిపారు. ఈ ఏడాది చివరిలో ర్యాలీ ఉండొచ్చని అంచనా

Most from this category