STOCKS

News


వ్యాల్యు పిక్‌: హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌

Saturday 27th October 2018
Markets_main1540630430.png-21538

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. 
స్టాక్‌: హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.966
టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,182

ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌పై ఆనందరాఠి బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. స్టాక్‌ ధర వచ్చే ఏడాది కాలంలో రూ.1,182లకు చేరొచ్చని అంచనా వేస్తోంది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీని నెక్ట్స్‌-జనరేషన్‌ గ్లోబల్‌ టెక్నాలజీ కంపెనీగా అభివర్ణించింది. కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా ఆర్‌అండ్‌డీ సెంటర్లు, ఇన్నోవేషన్‌ ల్యాబ్స్‌, డెలివరీ సెంటర్లు ఉన్నాయని తెలిపింది. దాదాపు 1.24 లక్షల ఉద్యోగులతో 41 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని పేర్కొంది. డైవర్సిఫైడ్‌ పోర్ట్‌ఫోలియో సానుకూల అంశమని తెలిపింది. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌, టెలీకమ్యూనికేషన్స్‌, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌, రిటైల్‌, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఎనర్జీ, లాజిస్టిక్స్‌ వంటి పలు విభాగాల్లో సేవలందిస్తోందని పేర్కొంది. కంపెనీ ప్రధానంగా మోడ్‌-1,2,3 స్ట్రాటజీతో ముందుకెళ్తోందని తెలిపింది. మోడ్‌-1లో అప్లికేషన్‌ సర్వీసెస్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సర్వీసెస్‌, ఇంజినీరింగ్‌ అండ్‌ ఆర్‌అండ్‌డీ సర్వీసెస్‌, బిజినెస్‌ ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగ్‌ వంటి కోర్‌ సర్వీస్‌లకు ప్రాధాన్యమిస్తుందని పేర్కొంది. మోడ్‌-2లో క్లౌడ్‌ సర్వీసెస్‌, సెక్యూరిటీ సర్వీసెస్‌, డిజిటల్‌ అండ్‌ అనలిటిక్స్‌, ఐఓటీ వర్క్స్‌ వంటి నెక్ట్స్‌-జనరేషన్‌ సర్వీస్‌లపై దృష్టి కేంద్రీకరిస్తుందని తెలిపింది. ఇక మోడ్‌-3లో ప్రొడక్ట్స్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్స్‌ సంబంధిత సేవలు అందిస్తుందని పేర్కొంది. అందువల్ల భవిష్యత్‌ వృద్ధి అంచనాలు బాగున్నాయని తెలిపింది. రూ.1,182 టార్గెట్‌ ప్రైస్‌తో స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. 

కంపెనీ వివరాలు, పనితీరు సంబంధిత ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...
 

View Pdf One (1540630434HCL_Initiating_Oct18.pdf)

You may be interested

పసిడి రయ్‌.. రయ్‌..

Saturday 27th October 2018

పసిడి ధర శుక్రవారం రాత్రి 3 నెలల గరిష్టం వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి వాతావరణ పరిస్థితులు ఇందుకు కారణమయ్యాయి. రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి 6.30 డాలర్లు లాభపడి 1,235.40 వద్ద ముగిసింది. అమెరికాలో దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు ఆశించిన స్థాయిలో ఫలితాలను నమోదు చేయకపోవడంతో అక్కడి మార్కెట్లు భారీగా నష్టపోయాయి. మరోవైపు డాలర్‌ ఇండెక్స్‌ గరిష్ట స్థాయిల నుంచి తగ్గుదల కూడా పసిడి

కజారియా సిరామిక్స్‌ కొనొచ్చు: కోటక్‌ సెక్యూరిటీస్‌

Saturday 27th October 2018

ముంబై:- టైల్స్‌ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న కజారియా సిరామిక్స్‌కు బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది. షేరు పేరు:- కజారియా సిరామిక్స్‌ రంగం:- టైల్స్‌ తయారీ రేటింగ్‌:- కొనొచ్చు టార్గెట్‌ ధర:- రూ.500 విశ్లేషణ:- కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఫలితాలను ప్రకటించింది. నికర లాభం రూ.50.2 కోట్లను సాధించింది. అమ్మకాలు 11 శాతం పెరిగాయి. ఆదాయం 8.1 శాతం పెరిగి రూ.725 కోట్లను నమోదు చేసింది.

Most from this category