STOCKS

News


రెండంకెల రాబడినిచ్చే 2 స్టాక్స్‌

Friday 30th November 2018
Markets_main1543570034.png-22527

ఐసీఐసీఐ డైరెక్ట్‌ టెక్నికల్‌ హెడ్‌ ధర్మేశ్‌ షా తాజాగా వచ్చే ఆరు నెలల కాలంలో రెండంకెల రాబడిని అందించే రెండు స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో ఒక సారి చూద్దాం.. 

ఏబీబీ
ఏబీబీ షేరు ధర గత రెండేళ్లుగా ఓవరాల్‌గా చూస్తే అప్‌ట్రెండ్‌లో ఉంటూ వస్తోంది. రానున్న కాలంలో స్టాక్‌ ధర రూ.1,320- 1,330 వద్ద కన్సాలిడేట్‌ అవ్వొచ్చు. ఇక 50 రోజుల ఎక్స్‌పొన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌ దాదాపు రూ.1,316 స్థాయి వద్ద ఉంది. వీక్లి ఆర్‌ఎస్‌ఐ పైకి కదులుతోంది. అంటే సమీప కాలంలో పాజిటివ్‌ మూమెంట్‌ ఉండొచ్చు. మద్యస్థ కాలంలో దాదాపు రూ.1,550 వరకు పెరగొచ్చు. ప్రస్తుతం స్టాక్‌ రూ.1,400 వద్ద కదలాడుతోంది. స్టాప్‌లాస్‌ రూ.1,315తో కొనుగోలు చేయవచ్చు. వచ్చే ఆరు నెలల కాలంలో 12 శాతం రాబడిని అందుకోవచ్చు.

మారికో
దేశంలోని ప్రముఖ కన్సూమర్‌ ప్రొడక్ట్స్‌ తయారీ కంపెనీల్లో ఒకటైన మారికోపై పాజిటివ్‌గా ఉన్నాం. కంపెనీ మెటీరియల్‌ ఖర్చులో దాదాపు సగ భాగం ‘కోప్రా’కు చెందుతుంది. కొబ్బరి నూనె తయారీలో దీన్ని వాడతారు. దీని ధర రూ.144 (2018 జనవరి) నుంచి రూ.91కి (2018 అక్టోబర్‌) తగ్గింది. ఇది కంపెనీకి చాలా సానుకూల అంశం. స్టాక్‌ ధర కన్సాలిడేట్‌ అవుతూ ఉంది. దీని తర్వాత అప్‌ట్రెండ్‌ ఉండొచ్చు. స్టాక్‌ టార్గెట్‌ ప్రైస్‌ను రూ.410గా నిర్ణయించాం. రూ.329 స్టాప్‌లాస్‌తో స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. వచ్చే ఆరు నెలల కాలంలో 14 శాతం రాబడిని అంచనా వేయవచ్చు. 



You may be interested

ఐటీ, ఎనర్జీ రంగాలకు ఓవర్‌వెయిట్‌..

Friday 30th November 2018

ముంబై: డాలర్‌ రూపాయి మారకం విలువ దీర్ఘకాలంలో బలహీనపడిన నేపథ్యంలో ఐటీ రంగ వ్యాపారం మెరుగుపడిందని యూనియన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ వినయ్ పహారియా విశ్లేషించారు. మరోవైపు ఎనర్జీ రంగ వాల్యుయేషన్స్‌ ఆకర్షణీయంగా ఉన్నట్లు ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. నిరాశాజనక వృద్ధి, మార్జిన్లతో ఫైనాన్షియల్‌ రంగం ఏమంత ఆసక్తిగా లేదన్నారు. ప్రభుత్వ వ్యయం నెమ్మదించడం, వినిమయం తగ్గడం వంటి ప్రతికూల అంశాలు ఎన్‌బీఎఫ్‌సీ

ఎఫ్‌ఐఐలు కొన్న షేర్లలో 50% వరకు ర్యాలీ

Friday 30th November 2018

ముంబై: గతకొద్దికాలంగా భారత స్టాక్‌ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను క్రమంగా వెనక్కి తీసుకుంటూ నెట్‌ సెల్లర్లుగా నిలుస్తూ వచ్చిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐ)లు ఈనెలలో పంథా మార్చారు. వరుసగా ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మార్కెట్‌ నుంచి తమ సొమ్మును ఉపసంహరించుకున్న వీరు.. నవంబర్‌లో ఇప్పటివరకు  ఈక్విటీ, డెట్‌లో కలిపి రూ.10,000 కోట్లను కుమ్మరించారు. అంతకుముందు మూడు నెలల్లో రూ.60,000 కోట్లను వెనక్కుతీసుకున్న ఎఫ్‌ఐఐలు.. ఒక్కసారిగా పతనమైన

Most from this category