STOCKS

News


ఆర్తి ఇండస్ట్రీస్‌ షేరు అదుర్స్‌: అనంద్‌ రాఠి

Saturday 1st September 2018
Markets_main1535790844.png-19876

ముంబై:- స్పెషాలిటీ కెమికల్స్‌ సంస్థ ఆర్తి ఇండస్ట్రీస్‌ షేరకు ఆనంద్‌ రాఠి షేర్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ సంస్థ బై రేటింగ్‌ను కేటాయించింది. సమర్థవంతమైన మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ, గృహ సంరక్షణ ఉత్పత్తు తయారీ దృష్టి, రానున్న మూడేళ్లలో కంపెనీ చక్రీయ వార్షిక వృద్ధి అంచనా పెరుగుదల తదితర అంశాలు ఆర్తి ఇండస్ట్రీస్‌కు కలిసొచ్చే అంశాలని ఆనంద్‌ రాఠి సంస్థ అంటోంది.  
సమర్థవంతమైన మేనేజ్‌మెంట్‌:- నిర్వహణ సామర్థ్య నైపుణ్య లక్షణాలు పుష్కలంగా ఉన్న మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ ఆర్తి ఇండస్ట్రీస్‌ను కెమిక్సల్‌ రంగంలో తిరుగులేని కంపెనీగా తీర్చిదిద్దింది. కెమికల్‌ రంగంలో నిరంతరం సంభవించే మార్పులను పసిగట్టి వాటికి అనుగుణంగా మేనేజెంట్‌ తీసుకునే నిర్ణయాలు సంస్థను లాభాల బాట పట్టిస్తున్నాయి. ఇటీవల కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గృహ సంరక్షణ ఉత్పత్తులపై యాజమాన్యం దృష్టి పెట్టింది.
మూడేళ్లలో 20శాతం సీఏజీఆర్‌:- కొత్తగా ప్రారంభించిన టౌలేనే వ్యాపారం వచ్చే ఆదాయంతో కంపెనీ ఆదాయం 20శాతం చక్రీయ వార్షిక వృద్ధిని నమోదు చేస్తుందని ఆనంద్‌ రాఠి అంచనా వేస్తుంది. నిరంతం పెరుగుతున్న ఆదాయ వృద్ధి కంపెనీ మూలధనాన్ని మరింత పెంచుతుంది.

రేటింగ్‌:- కొనొచ్చు
ప్రస్తుత దర:- రూ.1320
టార్గెట్‌ ధర:- రూ.1600.

(ఆర్తి ఇండస్ట్రీస్‌ షేరుపై ఆనంద్‌ రాఠి షేర్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ సంస్థ విశ్లేషణలను కింది పీడీఎఫ్‌లో పూర్తిగా చూడవచ్చు)

View Pdf One (1535791005ARTO_IC_290818.pdf)

You may be interested

ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌ టార్గెట్‌.. 145

Saturday 1st September 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: కోటక్‌ సెక్యూరిటీస్‌ స్టాక్‌: ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.118 టార్గెట్‌ ప్రైస్‌: రూ.145 బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌.. ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌పై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.145గా నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరంలో బలహీనమైన పనితీరు కనబర్చిన కంపెనీ కొత్త ఆర్థిక

స్టాక్‌ పిక్‌: యాక్సిస్‌ బ్యాంక్‌

Saturday 1st September 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఈ వారం స్టాక్‌ పిక్‌గా యాక్సిస్‌ బ్యాంక్‌ను సిఫార్సు చేసింది. ఎందుకో ఒకసారి చూద్దాం.. బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌: యాక్సిస్‌ బ్యాంక్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.649 టార్గెట్‌ ప్రైస్‌: రూ.735, రూ.815 బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. దేశీ మూడో అతిపెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ అయిన యాక్సిస్‌ బ్యాంక్‌పై బుల్లిష్‌గా ఉంది. కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. వచ్చే 3-4 త్రైమాసికాల్లో స్టాక్‌ ధర రూ.735,

Most from this category