News


నెలలో 12% రాబడి అందించే 3 స్టాక్స్‌

Friday 21st December 2018
Markets_main1545377283.png-23138

ఐఐఎఫ్‌ఎల్‌కు చెందిన సీనియర్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ హడ్రియన్‌ మెన్డోంకా తాజాగా వచ్చే నెల రోజుల్లో 12 శాతం దాకా రాబడిని అందించగల మూడు స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో చూద్దాం.. 

డీసీబీ బ్యాంక్‌: గత ఆరు క్వార్టర్లుగా చూస్తే ఈ స్టాక్‌ డౌన్‌ ట్రెండ్‌లోనే ఉంది. అయితే వీక్లి చార్ట్‌లో తన ఇన్వర్స్‌ హెడ్‌ అండ్‌ షోల్డర్‌ ప్యాట్రన్‌ నుంచి బ్రేక్‌ ఔట్‌ అయ్యింది. అలాగే ఫాలింగ్‌ చానల్‌ ప్యాట్రన్‌ నుంచి బయటకు వచ్చింది.  200 రోజుల ఎక్స్‌పొన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌ పైకి వచ్చింది. డీసీబీ బ్యాంక్‌ షేరు వీక్లి చార్ట్‌లో హైయర్‌ లోను ఏర్పరచింది. అందువల్ల మధ్యస్థ కాలంలో ఈ స్టాక్‌ ధరలో పెరుగుదల ఉండొచ్చు. రూ.180 టార్గెట్‌ ప్రైస్‌తో ఈ స్టాక్‌ను కొనొచ్చు. స్టాప్‌ లాస్‌ రూ.162. దాదాపు 7 శాతం రాబడి అంచనా వేయవచ్చు. 

గృహ్‌ఫైనాన్స్‌: ఈ స్టాక్‌ గత ఏడు నెలలుగా లోయర్‌ లాప్‌ అండ్‌ లోయర్‌ బాటమ్‌ వ్యవస్థలో ఉంటూ వచ్చింది. ఎట్టకేలకు వీక్లి చార్ట్‌లో సిమెట్రికల్‌ ట్రైయాంగిల్‌ ప్యాట్రన్‌ నుంచి బ్రేక్‌ ఔట్‌ అయ్యింది. ట్రేడింగ్‌ వ్యాల్యుమ్స్‌ పెరుగుదలతోపాటు  స్టాక్‌ ధర కూడా పెరిగింది. 200 రోజుల ఎక్స్‌పొన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌ను అధిగమించింది. దీనికి పైస్థాయిలో నిలదొక్కుకుంది. అందువల్ల ఈ స్టాక్‌పై బుల్లిష్‌గా ఉన్నాం. రూ.355 టార్గెట్‌ ప్రైస్‌తో ఈ స్టాక్‌ను కొనొచ్చు. స్టాప్‌ లాస్‌ రూ.299. దాదాపు 12 శాతం రాబడి ఆశించొచ్చు. 

హీరో మోటొకార్ప్‌: ఇండెక్స్‌ హెవీవెయిట్‌ షేరు అయిన హీరో మోటొకార్ప్‌ గత రెండు నెలల నుంచి మంచి పనితీరు కనబరుస్తోంది. ఈ క్రమంలోనే పెన్నంట్‌ ప్యాట్రన్‌ నుంచి బ్రేక్‌ ఔట్‌ అయ్యింది. అంటే సమీప కాలంలో స్టాక్‌ ధర వేగంగా పెరగొచ్చు. వీక్లి చార్ట్‌లో హీరో మోటొకార్ప్‌ తన 100 వారాల ఎక్స్‌పొన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌ను అధిగమించింది. ఆర్‌ఎస్‌ఐ కూడా బుల్లిష్‌ ట్రెండ్‌ను సూచిస్తోంది. అందువల్ల ఈ స్టాక్‌ను రూ.3,650 టార్గెట్‌ ప్రైస్‌తో కొనొచ్చు. స్టాప్‌ లాస్‌ రూ.3,215. దాదాపు 8 శాతం రాబడిని అంచనా వేయవచ్చు.  



You may be interested

బ్యాంకులకు మూలధనం.. ఒరిగేదేంలేదు!!

Friday 21st December 2018

గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ సిటీ అంచనా కేంద్ర ప్రభుత్వం వచ్చే కొన్ని నెలల్లో ప్రభుత్వ బ్యాంకులకు రూ.83,000 కోట్ల మూలధనాన్ని అందిచనుంది. ఈ నిధుల సంబంధిత బ్యాంకుల వృద్ధికి దోహదపడకపోవచ్చని గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ సిటీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అందించే మూలధనం ప్రభుత్వ బ్యాంకుల వృద్ధికి సహాయపడకపోవచ్చు. కానీ అవి దివాలా తీయకుండా ఆప్పగలదని పేర్కొంది. అలాగే మూలధనం అందుకోవడం వల్ల కొన్ని బ్యాంకులు ఆర్‌బీఐ నిర్దేశిత సత్వర దిద్దుబాటు

ఏడాది కనిష్టానికి క్రూడ్‌ పతనం

Friday 21st December 2018

క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గురువారం దాదాపు 5 శాతానికి పైగా పతనమయ్యాయి. దీంతో క్రూడ్‌ ధర ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయింది. ఓవర్‌సప్లై, ఆయిల్‌ డిమాండ్‌ వృద్ధి బలహీనంగా ఉండొచ్చనే అంచనాలు, ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్ల పెంపు, స్టాక్‌ మార్కెట్ల పతనం వంటి అంశాలు ఇందుకు కారణం.  ఇంటర్నేషనల్‌ బెంచ్‌మార్క్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 2.89 డాలర్లు లేదా 5.05 శాతం క్షీణతతో 54.35 డాలర్లకు తగ్గింది.

Most from this category