STOCKS

News


30% రాబడిని అందించే 3 స్టాక్స్

Monday 17th December 2018
Markets_main1545039815.png-23006

అజ్‌కాన్ గ్లోబల్ ఈక్విటీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ఆకాశ్ జైన్ తాజాగా 10-30 శాతం రాబడిని అందించే మూడు స్టాక్స్ సిఫార్సు చేశారు. అవేంటో చూద్దాం..

సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ 
1974లో ఏర్పాటైన ఈ కంపెనీ న్యూఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తోంది. భారత్‌, అస్ట్రేలియాలోని అతిపెద్ద ప్రైవేట్‌ మ్యాన్‌పవర్‌ సెక్యూరిటీ సొల్యూషన్స్‌ ప్రొవైడర్స్‌లో ఇది ఒకటి. ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌ సర్‌వియలెన్స్‌, సెక్యూరిటీ కన్సల్టింగ్‌, ప్రి-ఎంప్లాయ్‌మెంట్‌ వెరిఫికేషన్‌, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌, క్యాష్‌/బులియన్‌ లాజిస్టిక్స్‌ వంటి వివిధ రకాల సేవలను అందిస్తుంది. సెక్యూరిటీ, క్యాష్‌ లాజిస్టిక్స్‌, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ వంటి మూడు కీలక విభాగాల్లో ఈ కంపెనీ అధిపత్యం ప్రదర్శిస్తోంది. సెక్యూరిటీ సర్వీసెస్‌ మార్కెట్‌కు భవిష్యత్‌ వృద్ధి అంచనాలు బాగున్నాయి. వచ్చే 12 నెలల కాలంలో 30 శాతం అప్‌సైడ్‌ అంచనాలతో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. స్టాక్‌ ధర రూ.995కు చేరొచ్చు. 3-5 ఏళ్ల పాటు వేచి ఉంటామని భావించే ఇన్వెస్టర్లు.. ఈ స్టాక్‌ను పడ్డప్పుడల్లా కొనుగోలు చేయవచ్చు. 

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో కంపెనీ పనితీరు ఆశించిన స్థాయిలో లేదు. పీఏటీ వార్షిక ప్రాతిపదికన 30 శాతం మేర పతనమైంది. నిర్వహణ వ్యయాలు పెరుగుదల, ఇన్వెస్ట్‌మెంట్‌ ఆదాయం తక్కువగా ఉండటం వంటివి ప్రతికూల ప్రభావం చూపాయి. అయితే ప్రొటెక‌్షన్‌ యాన్వలైజ్‌డ్‌ ప్రీమియం ఈక్వివలెంట్‌లో 77 శాతం వృద్ధి సానుకూల అంశం. వ్యాల్యుయేషన్స్‌ ఆకర్షణీయంగా ఉన్నాయి. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా చూస్తే స్టాక్‌ డిస్కౌంట్‌లో ట్రేడ్‌ అవుతోంది. స్టాక్‌ ధరలో 30 శాతం అప్‌సైడ్‌ను అంచనా వేయవచ్చు. టార్గెట్‌ ప్రైస్‌ రూ.403.

హెచ్‌డీఎఫ్‌సీ
హెచ్‌డీఎఫ్‌సీ షేరును రూ.2,100 టార్గెట్‌ ప్రైస్‌తో కొనుగోలు చేయవచ్చు. దాదాపు 10 శాతం రిటర్న్‌ ఆశించొచ్చు. దేశంలోని ప్రముఖ మోర్టేజ్‌ సంస్థలలో ఇది ఒకటి. హౌసింగ్‌ ఫైనాన్స్‌ విభాగంలో ఉత్తమ పనితీరు కనబరిచే సంస్థ. దాదాపు 16 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌సీ సంక్షోభం వల్ల వివిధ హెచ్‌ఎఫ్‌సీ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడింది. అయితే హెచ్‌డీఎఫ్‌సీ మాత్రం ఇందుకు మినహాయింపు. బలమైన పనితీరు కబనరిచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ లోన్‌ బుక్‌లో సెప్టెంబర్‌ నాటికి 17 శాతం వృద్ధి నమోదయ్యింది.   
 



You may be interested

ఐదో రోజూ లాభాలే

Monday 17th December 2018

సెన్సెక్స్‌ లాభం 307 పాయింట్లు కలిసొచ్చిన హెవీవెయిట్‌ షేర్ల ర్యాలీ బ్యాంకింగ్‌, విద్యుత్‌, అటో రంగ షేర్ల ర్యాలీతో మార్కెట్‌ వరుసగా అయిదోరోజూ లాభపడింది. డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం కూడా మార్కెట్‌కు కలిసొచ్చింది. ముఖ్యంగా హెవీవెయిట్‌ షేర్లైన హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంకు షేర్ల ర్యాలీతో సెన్సెక్స్‌ 307 పాయింట్లు, నిఫ్టీ 83 పాయింట్లు ఆర్జించాయి. ఎన్‌ఎస్‌ఈలోని బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 200పాయింట్ల లాభపడి 27వేల స్థాయికి తిరిగి

మెటల్‌ షేర్ల మెరుపులు

Monday 17th December 2018

అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధ సంధి కుదరవచ్చని ఆశాహనంతో సోమవారం మెటల్‌ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ 2శాతం లాభపడింది. గతంలో చైనాకు దిగుమతయ్యే అమెరికా వాహనాలు, వాహన విడిభాగాల దిగుమతులపై అదనంగా విధించిన 25శాతం అదనపు పన్నును జనవరి 1, 2019 నాటికి నుంచి రద్దు చేస్తున్నట్లు చైనా ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించినట్లు వార్తలు వెలువడ్డాయి. మరోవైపు అమెరికా కూడా చైనా దేశపు ఉత్పత్తులపై

Most from this category