STOCKS

News


2వారాల గరిష్టానికి రూపాయి

Monday 20th May 2019
Markets_main1558331981.png-25835

ఎగ్జిట్‌ పోల్స్‌ ఈసారి కూడా భాజపాకే జై కొట్టడంతో ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ 2వారాల గరిష్టానికి ఎగిసింది. నేడు ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ గత ముగింపు(70.22)తో పోలిస్తే 73 పైసలు బలపడి 69.49 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 86 పైసల వరకు లాభపడి 69.44 స్థాయి వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఈ స్థాయి రూపాయికి 2వారాల కనిష్టస్థాయి కావడం విశేషం. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఎగ్జిట్‌ పోల్స్‌ను స్వాగతించారు. ఈక్విటీ షేర్లల్లో కొనుగోళ్ల వెల్లువ కొనసాగుతుడటం కూడా సెంటిమెంట్‌ను బలపరిచింది. నేడు డాలర్‌ మారకంలో రూపాయి విలువ 69.20 - 69.90 శ్రేణిలో కదలాడవచ్చని ప్రముఖ ఫారెక్స్‌ ట్రేడింగ్‌ సంస్థ మోతిలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు పెరగినప్పటికీ, ఆ ప్రభావం రూపాయిపై పడకపోవడం విశేషం. ఉదయం గం.11:00లకు డాలర్‌ మారకంలో రూపాయి 63 పైసల లాభంతో 69.59 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు బెంచ్‌మార్క్‌ 10ఏళ్ల బాండ్‌ ఈల్డ్ 6 బేసిస్‌ పాయింట్ల నష్టపోయి 7.30శాతం వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

ఇదే సమయానికి దేశీయ బెంచ్‌మార్క్‌ ఈక్విటీ షేర్లైన సెన్సెక్స్‌ 927 పాయింట్ల లాభంతో 38857 వద్ద, నిఫ్టీ 269 పాయిం‍ట్ల లాభంతో 11676 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 



You may be interested

ఒపెక్‌ నిర్ణయంతో ఎగిసిన చమురు ధర

Monday 20th May 2019

ఉత్పత్తికోతలు కొనసాగించాలని, తద్వారా చమురు ధరలు పడకుండా ఈ ఏడాది మొత్తం మద్దతు అందించాలని ఒపెక్‌ సమావేశంలో నిర్ణయించారు. దీంతో సోమవారం ముడిచమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో బహుళవారాల గరిష్ఠాలకు చేరింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు సైతం చమురు ధరకు ఆజ్యం పోశాయి. దీంతో బ్రెంట్‌ క్రూడ్‌ దాదాపు 1.5 శాతం పెరిగి 73.40 డాలర్లను తాకింది. ఒపెక్‌ సమావేశంలో అన్ని దేశాల మధ్య ఉత్పత్తి కోతకు సంబంధించి ఏకాభిప్రాయం

ప్రస్తుతానికి ఐరన్‌ బటర్‌ఫ్లై వ్యూహం బెటర్‌!

Monday 20th May 2019

మార్కెట్లో ఎన్నికలానంతర ర్యాలీ ఆరంభమైంది. 2014 ప్రీఎలక‌్షన్‌ ర్యాలీని ఈ దఫా మార్కెట్లు ప్రతిబింబించాయి. అదేతరహాలో పోస్ట్‌ ఎలక‌్షన్‌ ర్యాలీ కూడా ఉండొచ్చని నిపుణుల అంచనా. నిఫ్టీకి 11100 పాయింట్ల స్థాయి అత్యంత కీలకమైనదిగా మారింది. ఈ స్థాయి వద్ద కీలక మూవింగ్‌ యావరేజ్‌లు, కీలక ఫిబొనాక్కి స్థాయిలు ఉన్నాయి. ఈ స్థాయికి పైన ఉన్నంత వరకు నిఫ్టీకి పెద్దగా ఇబ్బంది ఉండదని నిపుణుల విశ్లేషణ. ప్రస్తుతం మార్కెట్లకు సంస్కరణల

Most from this category