STOCKS

News


రూపాయి డౌన్‌...

Friday 10th August 2018
Markets_main1533875287.png-19111

  • 68.83 వద్ద ప్రారంభం
  • గురువారం ముగింపు 68.68తో పోలిస్తే 0.24 శాతం తగ్గుదల

ఇండియన్‌ రూపాయి శుక్రవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే బలహీనపడింది. అమెరికా, ఇతర దేశాల మధ్య నెలకొని ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా ప్రధాన కరెన్సీలు నష్టాల్లో ఉండటం ఇందుకు కారణం. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 68.84 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన మునపటి ముగింపు 68.68తో పోలిస్తే 0.24 శాతం క్షీణించింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి శుక్రువారం 68.83 వద్ద ప్రారంభమైంది. ఒకానొక సమయంలో 68.85కి కూడా పడిపోయింది.  
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 7.748 శాతంగా ఉంది. గురువారం నాటి ముగింపు స్థాయి 7.745 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ ఇండెక్స్‌ శుక్రవారం 26 పాయింట్ల లాభంతో 38,050 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. జనవరి నుంచి చూస్తే దాదాపు ఇండెక్స్‌ దాదాపు 11.65 శాతంమేర లాభపడింది.
ఈ ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 7 శాతం మేర బలహీన పడింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 260.4 మిలియన్‌​డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 5.43 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకున్నారు.
ఆసియా కరెన్సీలు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. దక్షిణ కొరియా ఒన్‌ 0.65 శాతం, చైనా రెన్‌మిన్‌బి 0.22 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.19 శాతం, ఇండోనేసియా రూపియ 0.13 శాతం, మలేసియా రింగిట్‌ 0.11 శాతం, తైవాన్‌ డాలర్‌ 0.06 శాతం క్షీణించాయి. ఇక జపాన్‌ యెన్‌ మాత్రం 0.16 శాతం, చైనా ఆఫ్‌షోర్‌ 0.08 శాతం, సింగపూర్‌ డాలర్‌ 0.08 శాతం లాభపడ్డాయి.
ఇతర దేశాల కరెన్సీతో అమెరికా కరెన్సీ పటిష్టతను సూచించే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు 95.504తో పోలిస్తే 0.07 శాతం లాభంతో 95.57 వద్ద ఉంది.

జూన్‌ నెల ఐఐపీ గణాంకాలు శుక్రవారం వెల్లడి కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. 



You may be interested

స్థిరంగా పసిడి ధర

Friday 10th August 2018

ట్రేడ్‌ వార్‌తో అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో పసిడి ఔన్స్‌ ధర శుక్రవారం భారత కాలమానం ప్రకారం గం.10:00 ని.లకు 0.30 డాలర్లు స్వల్ప పెరుగుదలతో 1,220.20 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గత రాత్రి అమెరికా మార్కెట్ల ఫ్లాట్‌ ముగింపు కారణంగా అక్కడ పసిడి బలపడింది. అయితే నేటి ఉదయం యూఎస్‌-చైనా ట్రేడ్ వార్‌ భయాల కారణంగా ఆసియాలో పలు

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 10th August 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు జీఎంఆర్‌ ఇన్ఫ్రా:- రూ.2950 కోట్ల నిధుల సమీకరణ ఆమోదం తెలపింది. జెట్‌ ఎయిర్‌వేస్‌:- తొలి త్రైమాసిక ఫలితాల ప్రకటను వాయిదా వేసింది. ఐడీబీఐ బ్యాంకు:- కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన 12.50లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించింది. స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా:- తన అనుబంధ సంస్థ ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో 4శాతం వాటా ఉపసంహరించుకునేందుకు సెంట్రల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి అనుమతులు

Most from this category