STOCKS

News


సుందరం ఏఎమ్‌సీ బెట్స్‌ ఇవే..!

Thursday 12th July 2018
Markets_main1531385131.png-18244

ముంబై: గతేడాది సూచీలు బ్రహ్మాండమైన ర్యాలీని నమోదుచేయగా.. నిఫ్టీ 29 శాతం, నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 47 శాతం ర్యాలీ చేసి ఆశ్చర్యం కలిగించినట్లు సుందరం అసెట్ మేనేజ్‌మెంట్ సీఐఓ ఎస్ కృష్ణ కుమార్ అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జీవితకాల గరిష్టస్థాయిలను నమోదుచేసి అక్కడ నుంచి 10 శాతం వరకు కరెక్ట్‌ అయిన సూచీలు క్రమంగా పుంజుకుని మళ్లీ ఆస్థాయి వద్దకు చేరుకోగా.. ఇదే సమయంలో 12-20 శాతం వరకు దిద్దుబాటుకు గురైన మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు మాత్రం ఇప్పటికీ పూర్తిగా కోలుకోకపోయినప్పటికీ, ఇప్పుడిప్పుడే రికవరీ బాట పట్టినట్లు విశ్లేషించారు. బెంచ్‌మార్క్‌ ఇండీసెస్‌తో పోల్చితే మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 10 శాతం ప్రీమియంతో ఉండగా.. స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 10 శాతం డిస్కౌంట్‌ వద్ద ప్రస్తుతం కొనసాగుతున్నాయని ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఎర్నింగ్స్‌ సీజన్‌ అయినందువల్ల మిడ్‌క్యాప్‌ షేర్లలో పురోగతి ఉంటుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విభాగం ఫండమెంటల్స్‌ చాలా బలంగా ఉన్నట్లు వివరించిన ఆయన తాజా కరెక్షన్‌ తరువాత కూడా ఈ రంగంలో వాల్యుయేషన్స్‌ చెక్కుచెదరకుండా ఉన్నట్లు తెలియజేశారు. వచ్చే మూడు నెలల్లో పెట్టుబడులు లార్జ్‌క్యాప్స్‌ నుంచి మిడ్‌క్యాప్స్‌కు తరలివెళతాయని అంచనావేశారు. అంతర్జాతీయ అంశాలు ఇబ్బంది పెట్టకుండా ఉంటే మాత్రం లార్జ్‌క్యాప్స్‌లో కూడా ర్యాలీ ఉంటుందని అంచనావేస్తున్నట్లు తెలిపారు. వాణిజ్య వాహనాలు.. ఈ రంగానికి అనుబంధంగా ఉండే సరఫర కంపెనీల షేర్లు వచ్చే రెండేళ్లలో పాజిటీవ్‌గా ఉండనున్నట్లు అంచనావేశారు. బిల్డింగ్‌ మెటీరియల్‌, కన్సూమర్ డ్యూరబుల్స్ డిమాండ్‌ మందగించడం.. వస్తు సేవల పన్ను అమలు ఇబ్బందులు లాంటి ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ, 30-40 శాతం కరెక్షన్‌ తరువాత వాల్యుయేషన్స్‌ ఆకర్షణీయంగా ఉన్నట్లు వెల్లడించారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడడం, వృద్ధిరేటులో మెరుగుదల కారణంగా గడిచిన 12 నెలలుగా ఐటీ రంగ షేర్లు ర్యాలీ చేస్తున్నట్లు వివరించారు. ఈ రంగంలోని మిడ్‌క్యాప్‌ షేర్లపై న్యూట్రల్‌గా ఉన్నట్లు తెలిపారు. ఫార్మా రంగంలో గడ్డు పరిస్థితులు తుది దశకు చేరుకుని, ఇక ముందు ఆకర్షణీయంగా మారుతుందని అన్నారు. రిటైల్, ఆతిథ్యం, వినోదం, ఆరోగ్య సంరక్షణ వంటి సేవారంగాలు ఆకర్షణీయంగా ఉండనున్నట్లు విశ్లేషించారు. You may be interested

పతనమైన చమురు: పెట్రో షేర్లకు రెక్కలు

Thursday 12th July 2018

ముంబై:- ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు దిగి రావడంతో దేశీయంగా గురువారం ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగ షేర్లు హావా కొనసాగుతోంది. ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న బీఎస్‌ఈలోని ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌ నేడు 2.62శాతం లాభపడింది. ఇంట్రాడేలో 14295 పాయింట్ల గరిష్టాన్ని నమోదుచేసింది. మధ్యాహ్నం గం.2:00లకు సమయానికి ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచి 2శాతం

రూపాయి బలపడడం ఖాయం!

Thursday 12th July 2018

ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ పీజేఎస్‌సీ అంచనా దేశీయ కరెన్సీ ఈ ఏడాదిలో అధ్వాన్న ప్రదర్శన చేస్తూ వస్తోంది. చాలా మంది అనలిస్టులు రూపాయి మరింత బలహీనపడుతుందని అంచనాలు వేస్తున్నారు. అయితే రూపాయిపై ఖచ్ఛితమైన అంచనాలు వెలువరిస్తుందని భావించే ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ పీజేఎస్‌సీ మాత్ర భిన్న స్వరం వినిపిస్తోంది. ఈ ఏడాది చివరకల్లా రూపాయి బలపేతమవుతుందని ఎమిరేట్స్‌ బ్యాంక్‌ అంచనా వేస్తోంది. రూపాయి క్షీణతకు కారణాలైన క్రూడాయిల్‌ ధరల పెరుగుదల, డాలర్‌ బలపడడంఅనే జోడు

Most from this category