STOCKS

News


రూపాయి... ఒకే రోజు 55పైసలు లాభం

Saturday 13th October 2018
Markets_main1539410124.png-21115

ముంబై: ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌  మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ శుక్రవారం ఒకేరోజు 55 పైసలు లాభపడింది. గడచిన మూడు వారాల్లో ఒకేరోజు రూపాయి ఇంత ఎక్కువగా రికవరీ అవ్వడం ఇదే తొలిసారి. వరుసగా ఆరు రోజులు ఏ రోజుకారోజు కొత్త రికార్డులతో పతనం బాట పట్టిన రూపాయి ఈ నెల 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే అటు తర్వాత 10,11,12 తేదీల్లో వరుసగా 18, 09, 55 పైసలు చొప్పున మొత్తం 82 పైసలు బలపడింది. అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు గరిష్ట స్థాయిల నుంచి దాదాపు ఐదు డాలర్లు తగ్గడం, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల వాతావరణం దీనికి ప్రధాన కారణాలు. మరోవైపు రూపాయి పతనాన్ని అడ్డుకోడానికి అటు కేంద్రం ఇటు ఆర్‌బీఐ కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాయి. విదేశీ మారకం నిధుల ఆకర్షణ, మార్కెట్‌ సెంటిమెంట్‌ మెరుగుపడ్డంపై కేంద్రం దృష్టి సారించింది. శుక్రవారం ప్రారంభంతోటే రూపాయి పటిష్టంగా 73.84 వద్ద ప్రారంభమైంది. (గురువారం ముగింపు 74.12)  అటు తర్వాత 73.52 స్థాయి వరకూ బలపడింది. దిగుమతిదారులు, బ్యాంకర్లు డాలర్లను భారీగా అమ్మారు. 



You may be interested

బంధన్ బ్యాంక్‌కు సెబీ ఊరట

Saturday 13th October 2018

ముంబై: ప్రమోటర్ల షేర్‌హోల్డింగ్‌ తగ్గింపు విషయానికి సంబంధించి బంధన్ బ్యాంక్‌కు కొంత ఊరట లభించింది. లిస్టింగ్ తర్వాత ప్రమోటర్లు ఏడాది దాకా వాటాలను విక్రయించకుండా చేసే నిబంధన విషయంలో తమకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి మినహాయింపు లభించినట్లు బ్యాంక్ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్‌ లైసెన్సింగ్ నిబంధనలకు అనుగుణంగా ప్రమోటింగ్ సంస్థ బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ (బీఎఫ్‌హెచ్‌ఎల్‌).. బంధన్ బ్యాంకులో తనకున్న 82 శాతం వాటాలను 40 శాతానికి

హిందుస్తాన్‌ యూనిలీవర్‌ లాభం రూ.1,525 కోట్లు

Saturday 13th October 2018

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌(హెచ్‌యూఎల్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ. 1,525 కోట్ల నికర  లాభం(స్టాండలోన్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం(రూ.1,276 కోట్లు)తో పోల్చితే 20 శాతం వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్‌ తెలిపింది. వివిధ కేటగిరీల్లో రెండంకెల వృద్ధి సాధించడం, నిర్వహణ పనితీరు బాగా ఉండటం వల్ల ఈ స్థాయిలో నికర లాభం పెరిగిందని కంపెనీ సీఎమ్‌డీ

Most from this category