STOCKS

News


మళ్లీ 71వైపునకు జారిన రూపాయి

Tuesday 15th January 2019
Markets_main1547531515.png-23590

ముంబై: డాలర్‌ మారకంలో  రూపాయి విలువ మళ్లీ పతనబాట పట్టింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో సోమవారం రూపాయి విలువ  ఒకేరోజు 43 పైసలు క్షీణించి 70.92 వద్ద ముగిసింది. గడచిన నెల రోజుల్లో ఈ స్థాయికి రూపాయి పతనం కావడం ఇదే తొలిసారి. డిసెంబర్‌ 17న రూపాయి 71.56 వద్ద ముగిసింది.
కారణాలు చూస్తే...
- శుక్రవారం వెలువడిన నవంబర్‌ పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలను చూస్తే, ఆ నెల్లో కేవలం అరశాతం వృద్ధి నమోదయ్యింది. ఇది 17 నెలల కనిష్ట స్థాయి.
- విదేశీ నిధులు వెనక్కు మళ్లడం, దేశీయ ఈక్విటీ మార్కెట్ల పతనం ప్రతికూల ప్రభావం చూపాయి.
- చమురు ధరలు కొంత తగ్గడం, ప్రధాన ప్రపంచ దేశాల కరెన్సీలపై డాలర్‌ బలహీనత వల్ల రూపాయి పతనం కొంత ఆగింది కానీ, లేదంటే మరింత పతనం జరిగేదన్నది విశ్లేషణ.
- సోమవారం ప్రారంభంతోటే రూపాయి విలువ 70.50 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 70.44ను కూడా తాకింది. అయినా,  ఆ స్థాయిలో నిలబడలేకపోయింది.
- అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్‌ ధరలు అంతర్జాతీయంగా ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి  క్రమంగా కోలుకుని 69.40 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్‌ ధర తీవ్రతతో జారుడుబల్లపైకి ఎక్కింది.



You may be interested

మింత్రా-జబాంగ్‌కు అనంత్‌నారాయణన్‌ గుడ్‌బై

Tuesday 15th January 2019

కొత్త సీఈవోగా అమర్‌ నాగారం న్యూఢిల్లీ: ఈ కామర్స్‌ సంస్థలు మింత్రా, జబాంగ్‌ సీఈవోగా అనంత్‌నారాయణన్‌ తప్పుకున్నట్టు సంస్థ ప్రకటించింది. ఇతర అవకాశాల నేపథ్యంలో ఆయన సీఈవో పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొంది. అమర్‌ నాగారంను ఈ రెండు ఫ్యాషన్‌ పోర్టళ్లకు నూతన సీఈవోగా నియమించినట్టు, ఫ్లిప్‌కార్ట్‌ గ్రూపు సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తికి రిపోర్ట్‌ చేయనున్నట్టు తెలిపింది. నాగారం ఫ్లిప్‌కార్ట్‌ నుంచి ఇటీవలే మింత్రా, జబాంగ్‌కు మారారు. ఏడేళ్ల నుంచి

బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 52 శాతానికి

Tuesday 15th January 2019

క్రమంగా తగ్గించుకోనున్న కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: మెరుగైన కార్పొరేట్‌ విధానాల్లో భాగంగా... ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వం తన వాటాను 52 శాతానికి పరిమితం చేసుకోవాలని భావిస్తోంది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ‘‘ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వం సహజంగానే వాటాదారు. అయితే, ఇది మెరుగైన కార్పొరేట్‌ విధానాలకు అనుగుణంగా ఉండాలి. ప్రభుత్వం వాటా ముందుగా కనీసం 52 శాతానికి తగ్గాలి. మార్కెట్‌

Most from this category