STOCKS

News


తగ్గిన రూపాయి

Friday 21st December 2018
Markets_main1545366179.png-23120

ఇండియన్‌ రూపాయి శుక్రవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే నష్టపోయింది. ప్రపంచ ఆర్థిక వృద్ధిపై నెలకొన్న ఆందోళనల కారణంగా గ్లోబల్‌ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొనడం ప్రతికూల ప్రభావం చూపింది. ఉదయం 9:15 సమయంలో రూపాయి 70.05 వద్ద ట్రేడవుతోంది. తన మునపటి ముగింపు (గురువారం) 69.70తో పోలిస్తే 0.49 శాతం నష్టపోయింది. 69.94 వద్ద ప్రారంభమైన రూపాయి.. 69.70 గరిష్ట స్థాయిని, 70.06 కనిష్ట స్థాయిని తాకింది. 

అమెరికా ప్రభుత్వం పాక్షికంగా మూతపడనుందనే ఆందోళనల వల్ల ట్రేడర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరిన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పాలసీ విధానాలపై భిన్నాభిప్రాయాల కారణంగా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్‌ మాటిస్‌ గురువారం రాజీనామా చేశారు. 

ఇంటర్నేషనల్‌ బెంచ్‌మార్క్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర గురువారం రాత్రి 2.89 శాతం క్షీణతతో 54.35 డాలర్లకు తగ్గింది. 2017 సెప్టెంబర్‌ 12 నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయి. ఈ ఏడాది ఇప్పటి దాకా క్రూడ్‌ ఆయిల్‌ ధర దాదాపు 17 శాతం మేర పతనమైంది. 2018 గరిష్ట స్థాయి నుంచి చూస్తే ఏకంగా 36 శాతం పడిపోయింది. అక్టోబర్‌ 3న బ్రెంట్‌ క్రూడ్‌ ధర 86.29 డాలర్లకు ఎగసింది.

భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 7.27 శాతం వద్ద ట్రేడవుతోంది. బాండ్‌ ఈల్డ్‌ మునపటి ముగింపు (గురువారం) 7.275 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్‌, ధరలు పరస్పరం వ్యతిరేక దిశల్లో ఉంటాయి.  

ఇకపోతే ఇండియన్‌ రూపాయి ఈ ఏడాది ఇప్పటి దాకా 8.76 శాతం మేర క్షీణించింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 4.37 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 7.12 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. 

అమెరికా ఫెడరల్‌ రిజర్వు చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ తాజా సమావేశంలో వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచారు. భవిష్యత్‌లోనూ రేట్ల పెంపు ఉండొచ్చని సంకేతాలిచ్చారు. దీంతో గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్లు పతనమయ్యాయి. 



You may be interested

ఓఎన్‌జీసీ బైబ్యాక్‌ @ రూ.4,022 కోట్లు

Friday 21st December 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ కంపెనీ రూ.4,022 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేయనున్నది. ఈ షేర్ల బైబ్యాక్‌కు కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని ఓఎన్‌జీసీ వెల్లడించిది. షేర్ల బైబ్యాక్‌లో భాగంగా 1.97 శాతం వాటాకు సమానమైన 25.29 కోట్ల షేర్లను, ఒక్కో షేర్‌ను రూ.159కు కొనుగోలు చేస్తామని  పేర్కొంది. ఓఎన్‌జీసీలో కేంద్ర ప్రభుత్వానికి 65.64 శాతం వాటా ఉండటంతో ఓఎన్‌జీసీ షేర్ల బైబ్యాక్‌ కారణంగా ప్రభుత్వానికి రూ.2,640 కోట్ల

10,950 దిగువున నిఫ్టీ

Friday 21st December 2018

సెన్సెక్స్‌ 38 పాయింట్లు డౌన్‌ అంతర్జాతీయ మార్కెట్ల బలహీత కారణంగా ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం మిశ్రమంగా ప్రారంభమైంది. నిఫ్టీ నష్టపోతే.. సెన్సెక్స్‌ పెరిగింది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,951 పాయింట్లతో పోలిస్తే 7 పాయింట్ల నష్టంతో 10,944 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,431 పాయింట్లతో పోలిస్తే 18 పాయింట్ల లాభంతో 36,449 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే సెన్సెక్స్‌ వెంటనే నష్టాల్లోకి

Most from this category