STOCKS

News


రూపీ పతనం ఆగట్లే..

Monday 17th September 2018
Markets_main1537158423.png-20303

  • 1 శాతానికిపైగా క్షీణత

ప్రధాని మోదీతో దేశ ఆర్థిక అంశాలపై చర్చించిన తర్వాత రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించిన పలు చర్యలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి సోమవారం మళ్లీ క్షీణించింది. వర్ధమాన మార్కెట్ల కరెన్సీలు కూడా పతనం కావడం ప్రతికూల ప్రభావం చూపింది. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన శుక్రవారం ముగింపు 71.86తో పోలిస్తే 1.09 శాతంమేర నష్టపోయింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి సోమవారం 72.49 వద్ద ప్రారంభమైంది. 
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 8.162 శాతంగా ఉంది. ఇక బాండ్‌ ఈల్డ్‌ శుక్రవారం ముగింపు స్థాయి 8.127 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి. 
ఈ ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 11.93 శాతం మేర బలహీన పడింది. వర్ధమాన దేశాల కరెన్సీల్లో మన రూపాయే అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 939.15 మిలియన్‌​డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 8.79 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకున్నారు. 
బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ ఇండెక్స్‌ సోమవారం 63 పాయింట్ల నష్టంతో 38,027 వద్ద ప్రారంభమైంది. జనవరి నుంచి చూస్తే ఇండెక్స్‌ 11.66 శాతం మేర లాభపడింది.  
ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. దక్షిణ కొరియా ఒన్‌ 0.85 శాతం, ఇండోనేసియా రుపియ 0.51 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.48 శాతం, తైవాన్‌ డాలర్‌ 0.19 శాతం, చైనా రెన్‌మిన్‌బి 0.007 శాతం, సింగపూర్‌ డాలర్‌ 0.022 శాతం, హాంగ్‌కాంగ్‌ డాలర్‌ 0.008 శాతం క్షీణించాయి. అయితే జపాన్‌ యెన్‌ 0.071 శాతం, చైనా ఆఫ్‌షోర్‌ 0.061 శాతం, థాయ్‌ బట్‌ 0.12 శాతం పెరిగాయి.  
ఇతర ప్రధాన కరెన్సీల్లో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు 94.927తో పోలిస్తే 0.01 శాతం పెరుగుదలతో 94.935 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

సూచీలకు మించి రాబడులు

Monday 17th September 2018

ఎడెల్వీజ్‌ లార్జ్‌క్యాప్‌ అన్ని కాలాల్లోనూ సూచీలకు తగ్గకుండా రాబడులను అందించడంలో ఎడెల్వీజ్‌ లార్జ్‌క్యాప్‌ పథకం పనితీరు గురించి తప్పకుండా చెప్పుకోవాల్సిందే. గడిచిన ఏడాది కాలంలో 17 శాతం రాబడులను అందించి లార్జ్‌క్యాప్‌ విభాగంలో ఉత్తమ పథకంగా నిలిచింది. లార్జ్‌క్యాప్‌ కారణంగా మార్కెట్లు ర్యాలీ చేయగా, ఇదే కాలంలో పోటీ పథకాల్లో రాబడులు ఒక అంకె వరకే ఉండడం గమనార్హం. బెంచ్‌మార్క్‌ నిఫ్టీ50తో పోలిస్తే రాబడుల్లో ముందు నిలిచింది. ఈ పథకం 2009లో

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Monday 17th September 2018

11,500 దిగువన నిఫ్టీ 38,000 మార్క్‌ కిందకు సెన్సెక్స్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 38,090 పాయింట్లతో పోలిస్తే 63 పాయింట్ల నష్టంతో 38,027 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,515 పాయింట్లతో పోలిస్తే 51 పాయింట్ల నష్టంతో 11,464 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సమయం పెరిగే కొద్ది ఇండెక్స్‌ల నష్టాలు కూడా పెరిగాయి. ఉదయం 9:30 సమయంలో నిఫ్టీ

Most from this category