STOCKS

News


ఆఫ్‌షోర్‌లో రూపీ రివకరీ

Thursday 8th November 2018
Markets_main1541653457.png-21784

ఇండియన్‌ రూపాయి ఆఫ్‌షోర్‌ మార్కెట్‌లో కోలుకుంది. ఏకంగా 68 పైసలు మేర లాభపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ గురువారం ఉదయం 10:23 సమయంలో (భారతీయ కాలమాన ప్రకారం) 72.32 వద్ద ట్రేడవుతోంది. ఒకానొక సమయంలో 72.30 స్థాయికి కూడా బలపడింది. కాగా రూపాయి మంగళవారం 73 వద్ద ముగిసింది. దీంతో దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే శుక్రవారం రూపాయి పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశముంది.
కాగా రూపాయి మారక విలువలో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. సోమవారం ఒకేరోజు 67 పైసలు పతనమై 73.12కు చేరిన రూపాయి మంగళవారం తిరిగి కోలుకుంది. 12 పైసల లాభంతో 73 వద్ద ముగిసింది. దీపావళి, బలిప్రతిపాద సందర్భంగా ఫారెక్స్‌ మార్కెట్‌కు రెండు రోజులు సెలవు. తిరిగి ట్రేడింగ్‌ శుక్రవారం ప్రారంభమౌతుంది.

 

  



You may be interested

డైవర్సిఫై చేయడమే... సరైన నిర్ణయం..!

Thursday 8th November 2018

మోబియస్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌ వ్యవస్థాపకుడు, సీనియర్‌ ఫండ్‌ మేనేజర్‌ మార్క్‌ మోబియస్‌ సూచన స్టాక్‌ మార్కెట్‌ 20 ఏళ్ల చరిత్రను గమనించినట్లయితే, ఇందులో ఉత్తమ ర్యాలీ కనబర్చిన కాలం కేవలం 2 ఏళ్లు మాత్రమే ఉంటుందని ఇన్వెస్ట్‌మెంట్‌ గురు, మోబియస్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌ వ్యవస్థాపకుడైన మార్క్‌ మోబియస్‌ వ్యాఖ్యానించారు. ఏ దేశ మార్కెట్‌ను పరిశీలించినా ఇదే విధంగా ఉంటుందని వెల్లడించిన ఆయన.. ఇటువంటి ప్రయాణం చేస్తున్న మార్కెట్లకు సరైన విధానం డైవర్సిఫై

తగ్గిన పసిడి

Thursday 8th November 2018

ముంబై:- డాలర్‌ ఇండెక్స్‌ రీకవరీ, ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ కారణంగా గురువారం పసిడి ధర నష్టాల బాట పట్టింది. ఆసియా ట్రేడింగ్‌లో గురువారం భారత వర్తమానకాలం ప్రకారం మధ్యాహ్నం గం.9.40లకు ఔన్స్‌ పసిడి 5.00 డాలర్లు నష్టపోయి 1,223.70 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రాత్రి అమెరికా మార్కెట్ల లాభాల ముగింపును అందిపుచ్చుకున్న ఆసియా మార్కెట్లు నేటి ట్రేడింగ్‌ ర్యాలీ చేస్తున్నాయి. మరోవైపు డాలర్‌ ఇండెక్స్‌ నాలుగు రోజుల నష్టాల

Most from this category