STOCKS

News


2 నెలల గరిష్టానికి రూపీ

Wednesday 14th November 2018
Markets_main1542168374.png-21967

ఇండియన్‌ రూపాయి బలపడింది. రెండు నెలల గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతోంది. క్రూడ్‌ ధరల తగ్గుదల బాగా కలిసొచ్చింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి బుధవారం 50 పైసలకుపైగా లాభపడింది. 72.16 వద్ద ప్రారంభమైంది. కాగా రూపాయి మంగళవారం 72.67 వద్ద ముగిసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి సెప్టెంబర్‌ 21న తొలిసారిగా 72 స్థాయికి పడిపోయింది. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 55.66 డాలర్ల వద్ద, బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 65 డాలర్ల సమీపంలో ఉంది. క్రూడ్‌ ధర ఒక్కరోజే దాదాపు 7 శాతంమేర పడిపోయింది.  

ఉదయం 9:34 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి 58 పైసలు లాభంతో 72.09 వద్ద ట్రేడవుతోంది.  

ద్రవ్యోల్బణం సహా ద్రవ్యలోటు భయాలు తగ్గడం కూడా రూపాయిపై సానుకూల ప్రభావం చూపింది. కేంద్ర ప్రభుత్వ బాం‍డ్లను కొనుగోలు చేస్తామని ఆర్‌బీఐ ప్రకటించడం వల్ల బాండ్‌ ధరలు పెరిగాయి. రూపాయి 7 వారాల గరిష్టానికి, పదేళ్ల బాండ్‌ ధరలు 15 వారాల గరిష్ట స్థాయికి చేరాయి. 
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.708 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు స్థాయి 7.804 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఈ ఏడాది ఇప్పటి దాకా 4.5 శాతంమేర పెరిగింది. ప్రస్తుత సంవత్సరం మొత్తంగా చూస్తే రూపాయి 11.5 శాతంమేర పతనమైంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 5.72 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 7.87 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. 
ఆసియా ప్రధాన కరెన్సీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇండోనేసియా రుపియ 0.29 శాతం, థాయ్‌ బట్‌ 0.26 శాతం, దక్షిణ కొరియా ఒన్‌ 0.11 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.11 శాతం, చైనా రెన్‌మిన్‌బి 0.1 శాతం పెరిగాయి. అయితే జపాన్‌ యెన్‌ మాత్రం 0.1 శాతం తగ్గింది. 
ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 97.303తో పోలిస్తే 0.24 శాతం తగ్గుదలతో 97.072 వద్ద ట్రేడవుతోంది. 
కాగా ఆర్‌బీఐ నవంబర్‌ 15న మార్కెట్‌లో లిక్విడిటీని పెంచేందుకు రూ.12,000 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనుంది. 
ఇక రిటైల్‌ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 3.31 శాతానికి తగ్గింది. 



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 14th November 2018

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఇవి జీఎంటర్‌టైన్‌మెంట్‌:- కంపెనీ ప్రమోటర్‌ గ్రూప్‌ 50శాతం వాటాను కంపెనీ వ్యూహాత్మక భాగస్వామికి విక్రయించారు. జెట్‌ ఎయిర్‌వేస్‌:- కంపెనీని టాటాగ్రూప్‌ కొనుగోలు చేస్తుందనే వార్తలను ఖండించింది. హిందాల్కో:- బ్రెజిల్‌లో అల్యూమినియం ఉత్పత్తితో పాటు రిసైక్లింగ్‌ ఉత్పాదకతను పెంచేందుకు తన అనుబంధ సంస్థ ‘‘నావిలస్‌’’ రూ.1200 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వాల్‌చంద్‌నగర్‌ ఇండస్ట్రీస్‌:- రూ.200 కోట్లకు మించకుండా సెక్యూరిటీల జారీ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇన్ఫోసిస్‌:- టెక్సాస్‌లో

లాభాల్లో మార్కెట్లు

Wednesday 14th November 2018

10,600 మార్క్‌కు పైన నిఫ్టీ సెన్సెక్స్‌ 180 పాయింట్లు అప్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,582 పాయింట్లతో పోలిస్తే 52 పాయింట్ల లాభంతో 10,634 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,144 పాయింట్లతో పోలిస్తే 186 పాయింట్ల లాభంతో 35,330 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. అమెరికా మార్కెట్లు మంగళవారం దాదాపుగా నష్టాల్లోనే ముగియడం, ఆసియా మార్కెట్ల ప్రధాన

Most from this category