STOCKS

News


రూపాయి అప్‌..

Wednesday 8th August 2018
Markets_main1533701980.png-19027

  • 68.66 వద్ద ప్రారంభం
  • మంగళవారం ముగింపు 68.69తో పోలిస్తే 0.05 శాతం పెరుగుదల

ఇండియన్‌ రూపాయి బుధవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. దేశీ మార్కెట్లు సానుకూలముగా ఉండటం ఇందుకు ప్రధాన కారణం. ఉదయం 9:12 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 68.64 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన మునపటి ముగింపు 68.69తో పోలిస్తే 0.05 శాతం పెరిగింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి బుధవారం 68.66 వద్ద ప్రారంభమైంది. 
క్రూడ్‌ అయిల్‌ ధరల పెరుగుదల కారణంగా బాండ్‌ ఈల్డ్స్‌ వరుసగా ఐదో సెషన్‌లోనూ పెరిగాయి.  భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 7.791 శాతంగా ఉంది. మంగళవారం నాటి ముగింపు స్థాయి 7.786 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ ఇండెక్స్‌ బుధవారం 90 పాయింట్ల లాభంతో 37,756 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. జనవరి నుంచి చూస్తే దాదాపు ఇండెక్స్‌ దాదాపు 10.5 శాతంమేర లాభపడింది.
ఈ ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 7 శాతం మేర బలహీన పడింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 410.3 మిలియన్‌​డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 5.62 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకున్నారు. 
ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. దక్షిణ కొరియా ఒన్‌ 0.36 శాతం, చైనా రెన్‌బిన్‌బి 0.11 శాతం చొప్పున పెరిగాయి. చైనా ఆఫ్‌షోర్‌ 0.1 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.09 శాతం క్షీణించాయి. 
ఇతర ప్రధాన కరెన్సీల్లో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు 95.186తో పోలిస్తే 0.06 శాతం క్షీణతతో 95.125 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

మెర్క్‌ వాటా కొనుగోలుకు పీ అండ్‌ జీకి ఆమోదం

Wednesday 8th August 2018

ముంబై: ఫార్మా కంపెనీ మెర్క్‌లో 51.80 శాతం వాటా కొనుగోలుకు ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ కంపెనీకి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) ఆమోదం తెలిపింది. ఈ డీల్‌ విలువ రూ.1,290 కోట్లు. ఈ వాటాను పీ అండ్‌ జీ కి చెందిన ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ ఓవర్సీస్‌ ఇండియా బీవీ కొనుగోలు చేయనున్నది. ఈ డీల్‌ ఈ ఏడాది చివరకు పూర్తవ్వగలదని అంచనా. ఈ డీల్‌కు ఆర్థిక సలహాదారుగా జేపీ

లాభాలతోనే ఆరంభం..

Wednesday 8th August 2018

స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాల్లోనే ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 37,750 మార్క్‌కుపైన, నిఫ్టీ 11,410 మార్క్‌కుపైన ఆరంభమయ్యాయి. సెన్సెక్స్‌ మునుపటి ముగింపు 37,666 పాయింట్లతో పోలిస్తే 90 పాయింట్ల లాభంతో  37,756 పాయింట్ల వద్ద, నిఫ్టీ క్రితం ముగింపు 11,389 పాయింట్లతో పోలిస్తే 23 పాయింట్ల లాభంతో 11,412 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగియడం, ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగానే ట్రేడవుతుండటం, క్రూడ్‌ ధరల పెరుగుదల, మ్యూచువల్‌

Most from this category